సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక నిరంకుశ పోకడలు పెరిగిపోయాయని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శించారు. కేబినెట్ పని చేయడం లేదన్నారు. టీజేఎస్ కార్యాలయంలో శుక్ర వారం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర కమిటీ నియామకం
టీజేఎస్ పూర్తిస్థాయి రాష్ట్ర కార్యవర్గాన్ని కోదండ రామ్ శుక్రవారం ప్రకటించారు. తాను అధ్యక్షునిగా వ్యవహరించే పార్టీలో ఉపాధ్యక్షులుగా సయ్యద్ బదృద్దీన్, పీఎల్ విశ్వేశ్వర్‌రావు, రమేష్‌రెడ్డి, రాజమల్లయ్యను నియమించారు. ప్రధాన కార్యదర్శులుగా జి.వెంకట్‌రెడ్డి, ఎ. శ్రీనివాస్, కె.ధర్మార్జున్, జి.శంకర్‌రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా బాబన్న, బైరి రమేష్, భవానీరెడ్డి, మురళీధర్, జాయింట్ సెక్రటరీలుగా రాజు, రాయప్ప, ముజాహిద్, ఆశప్ప, కోశాధికారిగా డీపీరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా వెంకటేశ్వర్‌రావు, మమత, మోహన్‌రెడ్డి, లక్ష్మారెడ్డిని నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment