సాక్షి, హైదరాబాద్: బీజేపీ నాయకుల మాటల్లో విషం తప్ప విషయం లేదని మరోసారి రుజువైందని మంత్రి హరీష్ విమర్శించారు. బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో దేశానికి ఏమైనా దశ దిశ చూపిస్తారని అనుకున్నామని, కానీ సభల్లో కేసీఆర్ నామస్మరణ తప్ప వేరే లేదన్నారు. తెలంగాణకు ఏం చేస్తారో ఒక్క బీజేపీ నాయకుడూ చెప్పలేదని మండిపడ్డారు.18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్ వచ్చారని, తమ రాష్ట్రంలో తెలంగాణ కన్నా అద్భుతమైన పథకాలు ఉన్నాయని ఒక్కరైనా చెప్పగలిగారా అని ప్రశ్నించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మంత్రి హరీష్ రావు కౌంటర్ వేశారు. తెలంగాణలో లక్ష కోట్ల రూపాయల పంట కొన్నామని ప్రధాని చెప్పారు. తెలంగాణలో సాగునీరు అందుతుందో లేదో రైతుల్నే అడుగుదామన్నారు. నీళ్లు ఇవ్వకుండానే పంట పండకుండానే లక్ష కోట్ల విలువైన ధాన్యం కొన్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రెండు కోట్ల టన్నుల ధాన్యం అదనంగా పండిందన్నారు. పంజాబ్ తరువాత ఎక్కువ వరి పండించిన రాష్ట్ర తెలంగాణేనని నీతి ఆయోగే చెప్పిందన్నారు.
60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కాస్త రెండు కోట్ల 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని తెలిపారు. సాగునీరు పారకపోతే ఇంత ధాన్యం ఎక్కడ నుండి పండిందని ప్రశ్నించారు. కేసీఆర్ దూరదృష్టితో సాగునీటి ప్రాజెక్టులు కడితేనే దాన్య రాశులు పెరిగాయని అన్నారు. అతి తక్కువ కాలంలో వృద్ధి రేటులో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. నీళ్లు వచ్చాయా అని అమిత్ షా అడగటం వల్ల ఆయన స్థాయిని తగ్గించుకుంటున్నారని పేర్కొన్నారు.
చదవండి: ‘సీఎం ఎవరు కౌన్ కిస్కా.. కేసీఆర్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు’
Comments
Please login to add a commentAdd a comment