రైతులను ఆదుకునేందుకు చట్టం తేవాలి
టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం
కందుకూరు: రైతులను విపత్కర పరిస్థితుల్లో ఆదుకునేలా ప్రభుత్వం ప్రత్యేక చట్టం తేవాల్సిన అవసరం ఉందని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కరువు పరిస్థితులపై అధ్యయనం చేయడానికి శనివారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని గుమ్మడవెల్ల్లిలో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో పర్యటించి రైతులతో సమావేశమయ్యారు. ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.