పారిశ్రామికాభివృద్ధికి దిక్సూచి | AP Govt has formulated a new industrial policy aimed to developing the state | Sakshi
Sakshi News home page

పారిశ్రామికాభివృద్ధికి దిక్సూచి

Published Sun, Aug 9 2020 5:00 AM | Last Updated on Sun, Aug 9 2020 5:00 AM

AP Govt has formulated a new industrial policy aimed to developing the state - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం రూపొందించింది. భారీగా పెట్టుబడులను ఆకర్షించడం కోసం రాయితీలు ఇవ్వాలని నిర్ణయించింది. 2020–23కు రూపొందించిన పారిశ్రామిక విధానాన్ని సోమవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ రోజా ఆవిష్కరించనున్నారు. 

నూతన పారిశ్రామిక విధానంలో ప్రధానాంశాలు..
► వెనుకబడిన వర్గాల మహిళా పారిశ్రామికవేత్తలకు పెద్దపీట. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి. 
► ఇప్పటికే బాగా విస్తరించిన ఫార్మా, టెక్స్‌టైల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పెట్రోకెమికల్స్‌ రంగాలతోపాటు 10 కొత్త రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణపై ప్రత్యేక దృష్టి. 
► బొమ్మల తయారీ, ఫర్నీచర్, ఫుట్‌వేర్‌–లెదర్, మెషినరీ, ఎయిరోస్పేస్, డిఫెన్స్‌ వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా పథకాలు.
► పెట్టుబడులు పెట్టినవారు నష్టపోకుండా పూర్తిగా హ్యాండ్‌ హోల్డింగ్‌ అందించేలా చర్యలు.

అనేక రాయితీలు..
► ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు.
► కనీసం 10 మందికి ఉపాధి కల్పించే మహిళా పారిశ్రామికవేత్తలకు సగం ధరకే భూమి, స్టాంప్‌ డ్యూటీ నుంచి మినహాయింపు, ఐదేళ్లపాటు విద్యుత్‌ సబ్సిడీతోపాటు అనేక రాయితీలు. 
► సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు 100 శాతం స్టాంప్‌ డ్యూటీ, ఐదేళ్లపాటు 100 శాతం ఎస్‌జీఎస్టీ మినహాయింపుతోపాటు వడ్డీ రాయితీ, విద్యుత్‌ సబ్సిడీ, నాలా చార్జీలో కొంత మినహాయింపు.
► 2 వేల మందికిపైగా ఉపాధి కల్పించే పరిశ్రమలకు 100%, వెయ్యి నుంచి రెండు వేల మందికి ఉపాధి కల్పిస్తే 75%, 1,000 మంది వరకు ఉపాధి కల్పిస్తే 50 శాతం జీఎస్టీ మినహాయింపు. 
► మెగా ప్రాజెక్టులకు వాటి పెట్టుబడి ప్రతిపాదనలకనుగుణంగా అదనపు రాయితీలు.
► పారిశ్రామిక పార్కుల్లో 16.2 శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీలకు కేటాయిస్తారు.
► నైపుణ్యం కలిగిన మానవవనరులను అందించడం కోసం 30 నైపుణ్య శిక్షణ కేంద్రాలు, రెండు స్కిల్డ్‌ వర్సిటీలు, డిజిటల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్సే్ఛంజ్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement