సాక్షి, తాడేపల్లి/విశాఖపట్నం: ఎల్లుండి(మంగళవారం) విశాఖపట్నంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. విజన్ విశాఖ సదస్సులో వివిధ రంగాల వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశం కానున్నారు. అనంతరం స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సీఎం సమావేశం కానున్నారు.
సీఎం వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున పరిశీలించారు. పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, పోలీస్ జాయింట్ కమిషనర్ ఫక్కీరప్ప, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, ఇతర అధికారులతో కలిసి రాడిసన్ బ్లూ హోటల్, వి–కన్వెన్షన్ హాళ్లను పరిశీలించారు. విజన్ వైజాగ్ పేరుతో రాడిసన్ బ్లూ హోటల్లో నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులు హాజరుకానున్నారని తెలిపారు.
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అనంతరం పీఎంపాలెంలోని వి–కన్వెన్షన్ హాలుకు చేరుకుని అక్కడ ఏర్పాట్లను గమనించారు. స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో ఇక్కడ సీఎం జగన్ సమావేశమవుతారు. తర్వాత రుషికొండ హరిత రిసార్ట్స్ సమీపంలోని హెలిప్యాడ్‌ను అధికారులతో కలిసి పరిశీలించారు. హెలిప్యాడ్ నుంచి రాడిసన్ బ్లూ హోటల్, వి– కన్వెన్షన్ హాలుకు ముఖ్యమంత్రి చేరుకునే రూట్ మ్యాప్ గురించి చర్చించారు.
ఇదీ చదవండి: వల్లనోరిమామా నేనెళ్లను.. చీపురుపల్లి పోనంటున్న తమ్ముళ్లు
Comments
Please login to add a commentAdd a comment