Visakha tour
-
విశాఖలో ప్రధాని మోదీ రోడ్ షో
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో ప్రధాని మోదీ పర్యటించారు. సిరిపురం జంక్షన్ నుంచి రోడ్ షో ప్రారంభమైంది. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు రోడ్ షో సాగింది. అనంతరం ప్రధాని మోదీ బహిరంగ సభలో మాట్లాడారు.సాయంత్రం.. ప్రధాని ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతరం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం సభా వేదిక వద్ద నుంచి వర్చువల్‌గా పలు శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేసి ప్రసంగించారు.అనంతరం విశాఖ విమానాశ్రయానికి చేరుకుని భువనేశ్వర్ వెళ్లారు. వెంకటాద్రి వంటిల్లు రెస్టారెంట్ నుంచి కిలోమీటరు పొడవున రోడ్డు షోలో పాల్గొని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సభా వేదిక వద్దకు ప్రధాని చేరుకున్నారు.అక్కడ నుంచే వర్చువల్‌గా విశాఖ రైల్వే జోన్ ప్రధాన కేంద్రం సహా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు, కృష్ణపట్నం ఇండ్రస్టియల్ నోడ్, గుంటూరు–బీబీనగర్, గుత్తి–పెండేకల్ రైల్వే లైన్ల డబ్లింగ్ వంటి పనులకు శంకుస్థాపన చేశారు. చిలకలూరిపేట 6 లైన్ల బైపాస్‌ను జాతికి అంకితం చేయడంతోపాటు పలు జాతీయ రహదారులు, రైల్వే లైన్లను వర్చువల్‌గా ప్రధాని ప్రారంభించారు.ఇదీ చదవండి: ప్రధాని పర్యటనలో పోలీసుల ఓవరాక్షన్.. ఉక్కు కార్మికులకు వార్నింగ్ -
CM Jagan: ఎల్లుండి విశాఖకు సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి/విశాఖపట్నం: ఎల్లుండి(మంగళవారం) విశాఖపట్నంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. విజన్ విశాఖ సదస్సులో వివిధ రంగాల వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశం కానున్నారు. అనంతరం స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సీఎం సమావేశం కానున్నారు. సీఎం వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున పరిశీలించారు. పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, పోలీస్ జాయింట్ కమిషనర్ ఫక్కీరప్ప, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, ఇతర అధికారులతో కలిసి రాడిసన్ బ్లూ హోటల్, వి–కన్వెన్షన్ హాళ్లను పరిశీలించారు. విజన్ వైజాగ్ పేరుతో రాడిసన్ బ్లూ హోటల్లో నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులు హాజరుకానున్నారని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అనంతరం పీఎంపాలెంలోని వి–కన్వెన్షన్ హాలుకు చేరుకుని అక్కడ ఏర్పాట్లను గమనించారు. స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో ఇక్కడ సీఎం జగన్ సమావేశమవుతారు. తర్వాత రుషికొండ హరిత రిసార్ట్స్ సమీపంలోని హెలిప్యాడ్‌ను అధికారులతో కలిసి పరిశీలించారు. హెలిప్యాడ్ నుంచి రాడిసన్ బ్లూ హోటల్, వి– కన్వెన్షన్ హాలుకు ముఖ్యమంత్రి చేరుకునే రూట్ మ్యాప్ గురించి చర్చించారు. ఇదీ చదవండి: వల్లనోరిమామా నేనెళ్లను.. చీపురుపల్లి పోనంటున్న తమ్ముళ్లు -
కాసేపట్లో విశాఖకు సీఎం వైఎస్ జగన్
-
విశాఖలో ఐసీఐడీ కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాల ప్రారంభం (ఫొటోలు)
-
ఏపీకి అవకాశం.. అదృష్టంగా భావిస్తున్నాం: సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: నీటి పారుదల రంగంపై సదస్సు జరగడం శుభపరిణామం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్ సెంట్రల్ వాటర్ కమిషన్, ఏపీ జలవనరుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐసీఐడీ కాంగ్రెస్ ప్లీనరీని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న దేశ, విదేశీ ప్రతినిధులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో సాగునీటి రంగం, వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం జగన్ అన్నారు. ఏపీకి విస్తారమైన తీర ప్రాంతం ఉంది. ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవడమే లక్ష్యం. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తరచూ కరవు వస్తోంది. వర్షం కురిసేది తక్కువ కాలమే.. ఆ నీటిని సంరక్షించుకుని వ్యవసాయానికి వాడుకోవాలి. సదస్సు నిర్వహణకు ఏపీకి అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. చదవండి: అసామాన్యులకు సత్కారం -
ఇది శుభపరిణామం: సీఎం జగన్
Updates: 10:55 AM నీటి పారుదల రంగంలో భారత్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది: షెకావత్ ►ఇరిగేషన్‌పై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నాం ►ప్రపంచ దేశాలకు భారత్ అతిపెద్ద ఎగుమతిదారుగా వృద్ధి చెందుతోంది ►వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నాం ►మోదీ నేతృత్వంలో నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నాం ►రైతులకు మేలు జరిగేలా నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నాం ►భూగర్భ జలాల సంరక్షణకు సరైన ప్రణాళికలు రూపొందిస్తున్నాం ►నీటిని పొదుపుగా వాడితేనే భవిష్యత్ తరాలను ఉపయోగం ►వాటర్ రీసైక్లింగ్ విధానంతో మురికినీటిని శుద్ది చేస్తున్నాం ►తాగు, సాగునీటికి ఇబ్బంది కలగకుండా సరైన చర్యలు చేపడుతున్నాం ►2019లో మోదీ నేతృత్వంలో జలశక్తి అభియాన్ ప్రారంభించాం ►జలశక్తి అభియాన్‌తో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి ►నదుల అనుసంధాన ప్రక్రియ వేగంగా జరుగుతోంది ►ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్‌లో ఉన్న నదులను అనుసంధానం చేస్తున్నాం ►డ్యామ్ సేఫ్టీ యాక్ట్‌ల ద్వారా డ్యామ్‌ల పరిరక్షణ జరుగుతోంది ►అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా డ్యామ్‌లను పరిరక్షిస్తున్నాం ►ప్రపంచబ్యాంకు సహకారంతో డ్యామ్‌ల పరిరక్షణ జరుగుతోంది 10:45 AM నీటి పారుదల రంగంపై సదస్సు జరగడం శుభపరిణామం: సీఎం జగన్ ►సదస్సులో పాల్గొన్న దేశ,విదేశీ ప్రతినిధులకు కృతజ్ఞతలు ►ఏపీలో సాగునీటి రంగం, వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ►ఏపీకి విస్తారమైన తీర ప్రాంతం ఉంది ►ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవడమే లక్ష్యం ►రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తరచూ కరవు వస్తోంది ►వర్షం కురిసేది తక్కువ కాలమే.. ఆ నీటిని సంరక్షించుకుని వ్యవసాయానికి వాడుకోవాలి ►సదస్సు నిర్వహణకు ఏపీకి అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాం 10:05 AM ►రాడిసన్ బ్లూ హోటల్లో ప్రారంభమైన ఐసీఐడీ కాంగ్రెస్ ప్లీనరీ ►కేంద్రమంత్రి షెకావత్‌తో కలిసి ప్రారంభించిన సీఎం జగన్ ►ర్యాడిసన్ బ్లూ రిసార్ట్స్ వేదికగా ప్రతిష్టాత్మక సదస్సు ►సుమారు 90 దేశాల నుంచి హాజరైన ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు ►నీటి ఎద్దడిని అధిగమించడం, అధిక దిగుబడులే సదస్సు అజెండా ►కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు సత్కారం చేసి జ్ఞాపికలను బహూకరించిన నిర్వాహకులు ►విశాఖ చేరుకున్న సీఎం జగన్ ►రుషికొండ ఐటీ హిల్స్‌కు చేరుకున్న సీఎం జగన్ ►విశాఖపట్నం బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ ►మరికొద్ది సేపట్లో ఐసీఐడీ సదస్సుకు హాజరుకానున్న సీఎం సాక్షి, విశాఖపట్నం: మరో అంతర్జాతీయ సదస్సుకు విశాఖ సిద్ధమైంది. అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకమైన ఐసీఐడీ కాంగ్రెస్ ప్లీనరీకి వేదికవుతోంది. 74 దేశాల అంబాసిడర్లు, మంత్రులు, ఇతర ప్రతినిధులకు అతిథ్యమిస్తోంది. ఇప్పటికే జీఐఎస్, జీ 20 సదస్సులతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన విశాఖలో గురువారం నుంచి ఈ నెల 8వ తేదీ వరకు 25వ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ సదస్సు జరగనుంది. 57 ఏళ్ల తరువాత భారత్‌లో జరుగుతున్న ఈ సదస్సుకు విశాఖ వేదికవడం విశేషం. సెంట్రల్ వాటర్ కమిషన్, ఏపీ జలవనరుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రాడిసన్ బ్లూ హోటల్లో జరగనున్న ఈ సదస్సును గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. ‘వ్యవసాయం నీటి కొరతను అధిగమించడం’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఐసీఐడీ అధ్యక్షుడు డాక్టర్ రాగబ్, ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుతో పాటు భారత్ నుంచి 300 మంది హాజరుకానున్నారు. అలాగే ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, చైనా, ఇండోనేషియా, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయిల్, జపాన్, కొరియా, మలేషియా, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం ఇలా 74 దేశాల నుంచి 900 మందికి పైగా ప్రతినిధులు రానున్నారు. ఇదే వేదికపై 74వ అంతర్జాతీయ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(ఐఈసీ) సదస్సు కూడా జరగనుంది. తొలిరోజు ప్రముఖుల కీలక ఉపన్యాసాలు ఉండగా.. 3, 4, 5, అలాగే 9వ తేదీన విశాఖ పర్యాటక ప్రాంతాలైన అరకు వ్యాలీ, బొర్రా గుహలు, తాటిపూడి రిజర్వాయర్ వంటి ప్రాంతాలను సందర్శించనున్నారు. ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సు విజయవంతంగా పూర్తయ్యేందుకు పోలీసులు 1100 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. -
CM Jagan: నేనున్నా..! కాన్వాయ్ ఆపి.. బాధితులకు అండగా నిలిచి..
సాక్షి, విశాఖపట్నం: వివిధ సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాసటగా నిలుస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా బాధితులు కనిపించిన వెంటనే పరామర్శించి భరోసా కల్పిస్తున్నారు. వెంటనే ఆదుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశిస్తున్నారు. తాజాగా విశాఖ పర్యటన సందర్భంగా పలుచోట్ల ఈ దృశ్యాలు కనిపించాయి. వెన్నుపూస బాధితుడికి ఓదార్పు పెందుర్తి మండలం వేపగుంటకు చెందిన వీరవల్లి మోహన్ (17) నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ పడిపోవడంతో వెన్నుపూస దెబ్బతింది. ఆరోగ్యశ్రీ దయవల్ల వైద్యం అందినా ఫిజియో థెరపీ కోసం చాలా ఖర్చవుతున్నట్లు ఇనార్బిట్ మాల్ శంకుస్థాపన కోసం వచ్చిన సీఎం జగన్ ఎదుట బాధితుడు మొర పెట్టుకున్నాడు. దీంతో సీఎం జగన్ ఆదేశాల మేరకు కలెక్టర్ డా.మల్లికార్జున వైద్య ఖర్చుల కోసం బాధితుడికి రూ.లక్ష చెక్కు అందజేశారు. చదవండి: తీవ్ర వాయుగుండం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు క్యాన్సర్ బారినపడ్డ వలంటీర్‌కు సాయం కాన్సర్ బారినపడి చికిత్స పొందుతున్న ఓ వలంటీర్‌కు ఆర్ధిక సహాయం అందింది. పద్మనాభం మండలం కొవ్వాడ గ్రామ వలంటీర్ అంకాబత్తుల తులసి క్యాన్సర్ బారినపడి చికిత్స పొందుతోంది. ఆమె భర్త ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఏయూలో సీఎం జగన్‌ను తన కుటుంబంతోపాటు కలుసుకుంది. ఆమె అనారోగ్య సమస్య గురించి తెలుసుకున్న సీఎం జగన్ తక్షణ సాయంగా రూ.లక్ష అందించాలని ఆదేశించారు. చికిత్సకు అవసరమైన సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇవ్వడంతో తులసి కుటుంబం చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపింది. క్యాన్సర్ బారినపడ్డ వలంటీర్‌కు సాయం కాన్సర్ బారినపడి చికిత్స పొందుతున్న ఓ వలంటీర్‌కు ఆర్ధిక సహాయం అందింది. పద్మనాభం మండలం కొవ్వాడ గ్రామ వలంటీర్ అంకాబత్తుల తులసి క్యాన్సర్ బారినపడి చికిత్స పొందుతోంది. ఆమె భర్త ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఏయూలో సీఎం జగన్‌ను తన కుటుంబంతోపాటు కలుసుకుంది. ఆమె అనారోగ్య సమస్య గురించి తెలుసుకున్న సీఎం జగన్ తక్షణ సాయంగా రూ.లక్ష అందించాలని ఆదేశించారు. చికిత్సకు అవసరమైన సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇవ్వడంతో తులసి కుటుంబం చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపింది. తొమ్మిదేళ్ల చిన్నారికి ఊరట.. కంచరపాలెం బాపూజీ నగర్‌కు చెందిన సంతోషి తన కుమారుడ్ని తీసుకొని సీఎంని కలిసేందుకు రాగా భద్రతా సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారిని వారించిన ముఖ్యమంత్రి బాధిత కుటుంబాన్ని లోపలికి పిలిచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన కుమారుడు గవిడి ఢిల్లీశ్వరరావు (9) చిన్నప్పటి నుంచి ఆర్థోపెడిక్ సమస్యతో బాధపడుతున్నాడని, వైద్యం కోసం ప్రతి నెలా వేల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు మహిళ తెలిపింది. వారి సమస్య విని చలించిపోయిన సీఎం జగన్ ఆర్థిక సాయం చేయాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి కలెక్టర్ వెంటనే రూ.లక్ష చెక్కును అందజేశారు. బాలుడికి భరోసా.. అనారోగ్యంతో బాధ పడుతున్న పెదవాల్తేర్‌కు చెందిన బాలుడు కె.రమేష్ (11)కి తక్షణ ఆర్థిక సాయంగా రూ.లక్ష ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. బాధితుడి తల్లి కె.లక్ష్మి, ఏయూలో సీఎంను కలుసుకుని తన కుమారుడి అనారోగ్యం గురించి వివరించారు. -
సీఎం వైఎస్ జగన్ విశాఖ టూర్ షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: రేపటి నుంచి మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నంలో పర్యటించనున్నారు. వైజాగ్‌లో మార్చి 3,4 తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో సీఎం పాల్గొనున్నారు. రేపు(గురువారం) సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 5.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు, రాత్రికి అక్కడే బస చేస్తారు. 3వ తేదీ షెడ్యూల్: ఉదయం 9.10 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌కు చేరుకుని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో సీఎం పాల్గొంటారు. రాత్రి 8.00-9.00 గంటల సమయంలో ఎంజీఎం పార్క్ హోటల్లో జీఐఎస్ డెలిగేట్స్‌కు ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రాత్రి బస చేయనున్నారు. 4వ తేదీ షెడ్యూల్: ఉదయం 9.10 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌కు చేరుకుని రెండో రోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో సీఎం పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 3.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. చదవండి: విజయవాడ: నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్ -
విశాఖదే వికాసం
అటు సముద్రం... ఇటు జన సముద్రం! సాగర కెరటాలతో పోటీపడి విశాఖలో ఉప్పొంగిన జన వాహిని! కడలి కదిలి వచ్చినట్లుగా ఏయూ ప్రాంగణం కిక్కిరిసింది. విశాఖలో ప్రధాని మోదీ పాల్గొన్న బహిరంగ సభ అంచనాలకు మించి విజయవంతమైంది. సభా ప్రాంగణంలో మూడు లక్షల మందికి ఏర్పాట్లు చేయగా తెల్లవారుజాము నుంచే జన ప్రవాహం మొదలైంది. లోపల కిక్కిరిసి పోవడంతో భారీ సంఖ్యలో బయటే నిరీక్షించారు. పెద్ద ఎత్తున తరలి వచ్చినా ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతో బాగా ఏర్పాట్లు చేసిందని, ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఈ స్థాయిలో భారీ సభ గతంలో ఎన్నడూ జరగ లేదని, ఇక ముందూ సాధ్యం కాదని బీజేపీ నేతలు సైతం వ్యాఖ్యానించారు. విశాఖలో రూ.10,742 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. వేల ఏళ్ల క్రితమే ప్రపంచ దేశాలతో వర్తక, వాణిజ్య సంబంధాలను నెరపిన ఘన చరిత్ర ఇక్కడి ఓడరేవు సొంతమని ప్రధాని ప్రశంసించారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ప్రాధాన్యమని పునరుద్ఘాటిస్తూ విభజన హామీలను నెరవేర్చాలని ప్రధానిని సీఎం జగన్ సభా వేదికగా మరోసారి కోరారు. ‘‘అందరితో కలసి మెలసి స్నేహపూర్వకంగా, సుహృద్భావంతో మెలగడం ఆంధ్రప్రదేశ్ ప్రజల నైజం. విద్య, వైద్య, సాంకేతిక రంగాల్లో తమదంటూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. దేశాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కీలకపాత్ర పోషిస్తోంది. వెయ్యేళ్ల క్రితమే పశ్చిమ ఆసియా, రోమ్ నగరాలకు విశాఖ నుంచి ఎగుమతులు జరిగాయి. రక్షణ, పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో కీలకపాత్ర పోషిస్తూ విశాఖపట్నం దేశంలోనే ప్రముఖ నగరంగా గుర్తింపు తెచ్చుకుంది’’ – ప్రధాని మోదీ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోగా భారత్ మాత్రం అభివృద్ధి పథంలో దూసుకెళుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అందుకనే ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయన్నారు. విశాఖలో రూ.10,742 కోట్లతో చేపట్టిన ఏడు ప్రాజెక్టులు నగర అభివృద్ధితోపాటు ఆంధ్రప్రదేశ్ పురోగతికి దోహదం చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర పర్యటన సందర్భంగా శనివారం విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ మైదానంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కలసి వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆ వివరాలివీ.. వాణిజ్యానికి కేంద్ర బిందువు.. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా మూడు నెలల క్రితం ఏపీలో పర్యటించే అవకాశం నాకు లభించింది. విశాఖపట్నానికి చాలా విశిష్టమైన వర్తక, వ్యాపార సంప్రదాయాలున్నాయి. పురాతన భారతదేశంలో ముఖ్యమైన ఓడరేవుగా విలసిల్లింది. వేల సంవత్సరాల క్రితమే పశ్చిమాసియా, రోమ్‌లకు వాణిజ్య మార్గంలో భాగంగా ఉంది. ఇప్పుడు కూడా దేశ వాణిజ్యానికి కేంద్ర బిందువుగా నిలిచింది. మౌలిక సదుపాయాల కల్పనలో కొత్త కోణాలను ఆవిష్కరించడం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను సాధించేందుకు దోహదం చేస్తుంది. కీలకమైన మౌలిక సదుపాయాల కల్పన విషయంలో అండగా ఉంటాం. ఏపీ తీరానికి కొత్త ఊపు.. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సమయంలో దేశం అభివృద్ధి పథంలో సాగుతోంది. సామాన్యుడి అవసరాల ఆధారంగానే మౌలిక సదుపాయాల కల్పన రోడ్‌మ్యాప్ రూపొందిస్తున్నాం. ప్రతిపాదిత ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్‌లోని 6–వరుసల రహదారి, పోర్టు కనెక్టివిటీకి ప్రత్యేక రహదారి, విశాఖ రైల్వే స్టేషన్, ఫిషింగ్ హార్బర్ల ఆధునికీకరణ లాంటి ప్రాజెక్టులు సమగ్ర అభివృద్ధి దృక్పథంలో భాగంగా చేపట్టినవే. ప్రధానమంత్రి గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేయడమే కాకుండా ప్రాజెక్టుల వ్యయాన్ని కూడా తగ్గించింది. మల్టీ మోడల్ రవాణా వ్యవస్థ ప్రతి నగరం భవిష్యత్తు అవసరాలను తీరుస్తుంది. విశాఖ ఈ దిశగా ఒక అడుగు వేసింది. ఈ అభివృద్ధి పరుగు పందెంలో ఏపీ, తీర ప్రాంతాలు కొత్త ఊపు, శక్తితో ముందుకు సాగుతాయి. విశాఖలో జరిగిన సభకు హాజరైన భారీ జనసందోహంలో ఓ భాగం పౌరుల ఆకాంక్షలను గుర్తిస్తూ.. ప్రపంచ దేశాలన్నీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ అభివృద్ధిలో భారత్ కొత్త అధ్యాయాన్ని లిఖించింది. దేశం సాధించిన విజయాలను ప్రపంచం గుర్తించింది. భారత్ ప్రపంచానికి ఆశాకిరణంగా మారింది. పౌరుల ఆకాంక్షలు, అవసరాలను గుర్తిస్తూ పని చేస్తున్నందున ఇది సాధ్యమైంది. సామాన్యుల జీవితాన్ని మెరుగుపరిచేలా విధానాలను రూపొందిస్తూ ప్రతి నిర్ణయం తీసుకుంటున్నాం. పీఎల్ఐ స్కీమ్, జీఎస్టీ, ఐబీసీ, జాతీయ మౌలిక సదుపాయాల పైప్‌లైన్ ప్రాజెక్టులు దేశంలో పెట్టుబడులు పెరగడానికి కారణమయ్యాయి. అదే సమయంలో పేదల సంక్షేమం కోసం పథకాలను విస్తృతం చేస్తున్నాం. ఈ అభివృద్ధి ప్రయాణంలో అట్టడుగున ఉన్న ప్రాంతాలు కూడా భాగమయ్యాయి. గత రెండున్నరేళ్లుగా ఉచిత రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయడంతో పాటు ప్రతి రైతు ఖాతాలో ఏటా రూ.6 వేలు చొప్పున జమ చేస్తున్నాం. డ్రోన్, గేమింగ్, స్టార్టప్ రంగాల్లో నిబంధనల సడలింపులతో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతోంది. మత్స్యకారుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డుల జారీతో పాటు విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ చేపడుతున్నాం. నౌకాయాన రంగంలో రూ.వేల కోట్లతో ప్రాజెక్టులు చేపడుతున్నాం. సముద్ర తీరం శతాబ్దాలుగా దేశాన్ని సుభిక్షంగా ఉంచుతోంది. మన సముద్ర తీరాలు దేశ శ్రేయస్సుకు ముఖ ద్వారాలుగా పని చేశాయి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ► దాదాపు రూ.450 కోట్లతో చేపట్టనున్న విశాఖ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ► రూ.150 కోట్లతో చేపట్టనున్న విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ ప్రాజెక్టుతో హ్యాండ్లింగ్ సామర్థ్యం రోజుకు 150 టన్నుల నుంచి 300 టన్నులకు పెరగనుంది. ► విశాఖ– రాయ్‌పూర్ 6 లైన్ల రహదారి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. రూ.3,750 కోట్లకుపైగా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టు వల్ల ప్రయాణ దూరం 14 నుంచి 7 గంటలకు తగ్గడంతో పాటు ఏపీ, ఒడిశాలోని వెనుకబడిన ప్రాంతాలకు కనెక్టివిటీ పెరగనుంది. ► విశాఖలోని కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలా నగర్ జంక్షన్ వరకు పోర్టు అవసరాల కోసం ప్రత్యేక రహదారికి, రూ.2,658 కోట్లతో గెయిల్ నిర్మిస్తున్న శ్రీకాకుళం–అంగుల్ పైపులైన్ పనులకు శంకుస్థాపన చేశారు. èరూ.211 కోట్లతో నిర్మించిన పాతపట్నం–నరసన్నపేట 2 లైన్ల రహదారి, రూ.2,917 కోట్లతో పూర్తి చేసిన ఓఎన్జీసీ యూ–ఫీల్డ్ అభివృద్ధి ప్రాజెక్టును ప్రధాని జాతికి అంకితం చేశారు. విశేష నగరం విశాఖ శుక్రవారమే విశాఖ చేరుకుని ఐఎన్ఎస్ చోళా సూట్లో బస చేసిన ప్రధాని మోదీ ఉదయం 10 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. గవర్నర్, సీఎం, రైల్వే మంత్రి ఆయనకు స్వాగతం పలికారు. వివిధ ప్రాజెక్టుల స్టాల్స్‌ను పరిశీలించాక సభా వేదికపైకి చేరుకున్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సీఎం జగన్ ప్రసంగించాక ప్రధాని మాట్లాడారు. ఆయన ప్రసంగాన్ని ఎమ్మెల్సీ మాధవ్ తెలుగులో అనువదించారు. సుమారు 25 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో ఏపీ ప్రజల మనస్తత్వాన్ని ప్రధాని మెచ్చుకోవడంతో పాటు విశాఖ నగరాన్ని విశేష నగరంగా అభివర్ణించారు. అనంతరం ప్రధాని 11.56 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో బయలుదేరారు. రాష్ట్రానికి వందే భారత్ రైలు! త్వరలో ఏపీకి వందే భారత్ రైలును కేటాయిస్తాం. విశాఖ రైల్వే స్టేషన్ ఆధునికీకరణతో ప్రపంచస్థాయి సదుపాయాలు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. సోలార్ ద్వారా రైల్వేల విద్యుత్ అవసరాలు తీర్చుకుంటున్నాం. వన్ స్టేషన్–వన్ ప్రొడక్ట్ ద్వారా విశాఖ రైల్వే స్టేషన్లో ఏటికొప్పాక బొమ్మలను అందుబాటులో ఉంచాం. ప్రధాని మోదీ హయాంలో ఏపీకి కేంద్రం కేటాయిస్తున్న నిధులు పెరిగాయి. 2004కి ముందు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు రూ.886 కోట్లు కేటాయించగా ప్రధాని మోదీ ఏకంగా రూ.7,043 కోట్లు కేటాయించారు. – అశ్విని వైష్ణవ్, రైల్వేశాఖ మంత్రి -
Visakha Tour: ప్రధానికి స్వాగతం పలికిన గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్
Time: 08:57 PM ఐఎన్ఎస్ చోళ గెస్ట్‌హౌస్‌లో ప్రధాని బస విశాఖ మారుతి జంక్షన్ నుంచి ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు. 1.5 కిలోమీటర్ల మేర రోడ్‌షోలో ప్రధాని పాల్గొన్నారు. విశాఖ ఐఎన్ఎస్ చోళ గెస్ట్‌హౌస్‌కు ప్రధాని చేరుకున్నారు. రాత్రికి అక్కడ బస చేస్తారు. Time: 08:13 PM ప్రధానికి ఘన స్వాగతం ప్రధాని మోదీకి ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి విడదల రజిని స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి ప్రధాని.. చోళ (నౌకా దళానికి చెందిన గెస్ట్ హౌస్)కు వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. రేపు(శనివారం) ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో భారీ బహిరంగసభ నిర్వహంచనున్నారు. ప్రధాని మోదీ సభావేదికపై గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మాత్రమే ఉంటారు. రేపటి సభలో 40 నిమిషాల పాటు ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. Time: 08:06 PM విశాఖ ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోదీ చేరుకున్నారు. Time: 07:21 PM కాసేపట్లో విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు ప్రధాని మోదీ కాసేపట్లో విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు ప్రధాని మోదీ చేరుకోనున్నారు. ప్రధానికి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ స్వాగతం పలకనున్నారు. Time: 06:55 PM విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. కాసేపట్లో విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు ప్రధాని మోదీ రానున్నారు. ప్రధానికి సీఎం జగన్ స్వాగతం పలకనున్నారు. Time: 05:44 PM విశాఖ బయల్దేరిన సీఎం వైఎస్ జగన్ ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం బయల్దేరారు. ప్రధాని మోదీకి సీఎం స్వాగతం పలకనున్నారు. ఇవాళ, రేపు(శనివారం) పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. సాక్షి, విశాఖపట్నం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం విశాఖకు రానున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రధానితో కలిసి సీఎం పాల్గొననున్నారు. రూ.7,614 కోట్లతో చేపట్టనున్న ఐదు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.7,619 కోట్లతో పనులు పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేస్తారు ప్రధాని మోదీ పర్యటన సాగేదిలా.. 11వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు మధురై విమానాశ్రయం నుంచి బయలుదేరి సాయంత్రం 7.25 గంటలకు విశాఖ పాత విమానాశ్రయం ఐఎన్ఎస్ డేగకు చేరుకుంటారు. తర్వాత చోళ (నౌకా దళానికి చెందిన గెస్ట్ హౌస్)కు వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. 12వ తేదీ ఉదయం 10.10 గంటలకు చోళ నుంచి బయలుదేరి 10.30 గంటలకు ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్లో జరగనున్న బహిరంగ సభకు హాజరవుతారు. అనంతరం 9 అభివృద్ధి ప్రాజెక్టులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకొని తిరుగు ప్రయాణమవుతారు. సీఎం జగన్ పర్యటన సాగేదిలా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సాయంత్రం 6.35 గంటలకు విశాఖలోని ఐఎన్ఎస్ డేగకు చేరుకుని, ప్రధానికి స్వాగతం పలుకుతారు. రాత్రికి పోర్ట్ గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు. శనివారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం ప్రధానికి వీడ్కోలు పలికి.. తిరిగి తాడేపల్లిలోని నివాసానికి బయలుదేరుతారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రెండు రోజుల పర్యటన.. విశాఖకు ప్రధాని, సీఎం..
దొండపర్తి (విశాఖ దక్షిణ): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం విశాఖకు రానున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రధానితో కలిసి సీఎం పాల్గొననున్నారు. రూ.7,614 కోట్లతో చేపట్టనున్న ఐదు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.7,619 కోట్లతో పనులు పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేస్తారు. ఈ సభకు లక్షలాది మంది ప్రజలు హాజరవుతారని భావిస్తున్నారు. పీఎం, సీఎంతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి వస్తున్న దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ పర్యటన సాగేదిలా.. 11వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు మధురై విమానాశ్రయం నుంచి బయలుదేరి సాయంత్రం 7.25 గంటలకు విశాఖ పాత విమానాశ్రయం ఐఎన్ఎస్ డేగకు చేరుకుంటారు. తర్వాత చోళ (నౌకా దళానికి చెందిన గెస్ట్ హౌస్)కు వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. 12వ తేదీ ఉదయం 10.10 గంటలకు చోళ నుంచి బయలుదేరి 10.30 గంటలకు ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్లో జరగనున్న బహిరంగ సభకు హాజరవుతారు. అనంతరం 9 అభివృద్ధి ప్రాజెక్టులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకొని తిరుగు ప్రయాణమవుతారు. గవర్నర్ విశ్వభూషణ్ రాక: రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ 11వ తేదీ సాయంత్రం 4.20 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. నోవాటెల్ హోటల్లో కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత రాత్రి 7 గంటలకు ఐఎన్ఎస్ డేగకు చేరుకొని ప్రధానికి స్వాగతం పలుకుతారు. అనంతరం నోవాటెల్‌కు చేరుకొని రాత్రి బస చేస్తారు. 12న 10.20 గంటలకు ఏయూకు చేరుకొని ప్రధానితో కలిసి పలు శంకుస్థాపనలు, ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఐఎన్ఎస్ డేగాకు చేరుకుని ప్రధానికి వీడ్కోలు పలుకుతారు. ఆ తర్వాత గన్నవరం పయనమవుతారు. సీఎం జగన్ పర్యటన సాగేదిలా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సాయంత్రం 6.35 గంటలకు విశాఖలోని ఐఎన్ఎస్ డేగకు చేరుకుని, ప్రధానికి స్వాగతం పలుకుతారు. రాత్రికి పోర్ట్ గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు. శనివారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం ప్రధానికి వీడ్కోలు పలికి.. తిరిగి తాడేపల్లిలోని నివాసానికి బయలుదేరుతారు. -
11వ తేదీన విశాఖకు ప్రధాని.. రూ. 10,742 కోట్లతో ప్రాజెక్టులకు శంకుస్థాపన
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/ఏయూ క్యాంపస్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన ఖరారయ్యింది. ఈ సందర్భంగా మొత్తం రూ.10,742 కోట్లు విలువ చేసే ఐదు నూతన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు పూర్తయిన రెండు ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేస్తారు. ఇందుకోసం ప్రధాని ఈ నెల 11వ తేదీన విశాఖపట్నానికి చేరుకుంటారు. ఆ రోజు సా.5.30 గంటలకు మధురై విమానాశ్రయం నుంచి బయల్దేరి రాత్రి 7.25 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ తర్వాత చోళ షూట్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. ఇక 12వ తేదీ ఉ.10.10 గంటలకు చోళ షూట్ నుంచి ఆంధ్రా యూనివర్సిటీ మైదానంలో జరగనున్న బహిరంగ సభకు బయల్దేరుతారు. 10.30 గంటలకు రోడ్డు మార్గంలో అక్కడకు చేరుకుని 11.45 వరకు జరిగే బహిరంగ సభలో ఈ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి ప్రారంభిస్తారు. అనంతరం 12 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుని 12.05 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు తిరుగు ప్రయాణం అవుతారు. సిద్ధమవుతున్న సభావేదిక మరోవైపు.. 12వ తేదీన జరిగే బహిరంగ సభకు ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ప్రధాన వేదికను రేయింబవళ్లు తీర్చిదిద్దుతున్నారు. రెండు భారీ జర్మన్ టెంట్ల ఏర్పాటు ఇప్పటికే పూర్తికావొచ్చింది. ఇక మద్దిలపాలెం గేట్ నుంచి ఏయూలోకి ప్రధాన మంత్రి ప్రయాణించే మార్గంలో రహదారికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటుచేస్తున్నారు. దారిపొడవునా, ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో మైదానం చుట్టూ వీటిని ఏర్పాటుచేశారు. ఈ మొత్తం ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాంబు స్క్వాడ్ విస్తృత తనిఖీలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసులు, బాంబు స్క్వాడ్ అణువణువూ తనిఖీ చేస్తున్నారు. గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రముఖులు పాల్గొననుండడంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధాన వేదికకు ఎదురుగా భారీగా ఫ్లెక్సీలనూ ఏర్పాటుచేస్తున్నారు. -
పథకం ప్రకారమే మంత్రులపై దాడి
దొండపర్తి (విశాఖ దక్షిణ): జనసేన నాయకులు, కార్యకర్తలు పథకం ప్రకారమే విశాఖ విమానాశ్రయంలో మంత్రులపై దాడిచేశారని నగర పోలీస్ కమిషనర్ సిహెచ్.శ్రీకాంత్ చెప్పారు. ఆయన ఆదివారం విశాఖలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ విశాఖ పర్యటనలో జరిగిన పరిణామాలపై ఆ పార్టీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను కొట్టిపడేశారు. ఈ నెల 13వ తేదీన జనసేన రాష్ట్ర నాయకుడు కోన తాతారావు జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ జిల్లా పర్యటనకు సంబంధించిన వివరాలతో డీసీపీకి లేఖ ఇచ్చినట్లు చెప్పారు. 15వ తేదీ మధ్యాహ్నం రెండుగంటలకు ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా నోవోటెల్ హోటల్‌కు వెళతారని, 16వ తేదీ పోర్టు కళావాణి ఆడిటోరియంలో జనవాణి కార్యక్రమం, 17వ తేదీన వైఎంసీఏలో జరిగే కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళతారని ఆ లేఖలో పేర్కొన్నారని తెలిపారు. ఎయిర్‌పోర్టు నుంచి హోటల్‌కు ర్యాలీ, డీజే, భారీ జనసమీకరణల గురించి ఆ లేఖలో పేర్కొనలేదని, వాటికి అనుమతి కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. డ్రోన్ వినియోగానికి అనుమతి కోరగా.. రిమోట్ పైలెట్ ఎయిర్‌క్రాఫ్ట్ అనుమతి లేకపోవడంతో దాన్ని తిరస్కరించినట్లు చెప్పారు. సెక్షన్ 30 అమలులో ఉన్నప్పటికీ ముందస్తు అనుమతులు లేకుండా భారీ ఎత్తున జనసమీకరణ చేసి విమానాశ్రయానికి తరలించారని పేర్కొన్నారు. విశాఖ గర్జన కార్యక్రమాన్ని ముగించుకుని విమానాశ్రయానికి చేరుకున్న మంత్రులు రోజా, విడదల రజిని, జోగి రమేష్, టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి.. వైఎస్సార్సీపీ నాయకుల వాహనాలపై జనసేన నాయకులు, కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగానే పెద్ద ఎత్తున దాడులు చేశారని చెప్పారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి కూడా పాల్పడ్డారన్నారు. ఈ దాడిలో మంత్రి రోజా పీఏ దిలీప్‌కుమార్‌కు, అక్కడే విధులు నిర్వర్తిస్తున్న పెందుర్తి పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావుకు గాయాలవడంతో ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. మంత్రి రోజాపై దాడిచేయడానికి ప్రయత్నించిన సమయంలో మధ్యలో ఉన్న పీఏ దిలీప్ తలకు తీవ్ర గాయమై కుట్లుకూడా పడ్డాయన్నారు. వారిచ్చిన ఫిర్యాదుల మేరకు దాడిచేసినవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. దాడులు అప్పటికప్పుడు నిర్ణయించుకున్నవి కాదని, వివిధ సమూహాల వ్యక్తులు, వేర్వేరు మంత్రులు, నాయకులను టార్గెట్ చేస్తూ ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే దాడులు చేసినట్లు తమ విచారణలో తేలిందని పేర్కొన్నారు. అదేరోజు 70 మంది నిందితులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టామన్నారు. రిమాండ్ రిపోర్టు పరిశీలించిన న్యాయస్థానం వారిలో తొమ్మిదిమందికి జ్యుడిషియల్ రిమాండ్ విధించగా.. మిగిలిన వారిని సొంత పూచీకత్తు మీద విడుదల చేసినట్లు తెలిపారు. ఈ కేసు విచారణలో వెల్లడైన అంశాల ప్రకారం ఈ ఘటనపై ఆరుకేసులు నమోదుచేసి ఇప్పటివరకు వందమందిని అరెస్టు చేశామని, 82 మంది పరారీలో ఉన్నారని చెప్పారు. జనసేన నాయకుల ఆరోపణలు అసత్యాలు 15వ తేదీన పవన్‌కళ్యాణ్ ర్యాలీ సందర్భంగా మంత్రులపై దాడులు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసంతోపాటు జాతీయ రహదారిపై నాలుగు గంటలపాటు పెద్ద ఎత్తున ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందన్నారు. ర్యాలీలో యువకులు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయని చెప్పారు. అత్యవసర సర్వీసులకు ఆటంకాలు ఏర్పడ్డాయన్నారు. విమాన ప్రయాణికులు 30 మంది తమ విమానాలను మిస్ చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే 16వ తేదీన జనవాణి కార్యక్రమం నిర్వహించుకోవచ్చుగానీ, ర్యాలీగా వెళ్లకూడదని పవన్‌కు చెప్పామన్నారు. తమ నాయకులు జైలులో ఉండడంతో జనవాణి కార్యక్రమానికి హాజరుకావడం లేదని ఆయన తమకు తెలిపారని, అయితే జనసేన నాయకుడు వరప్రసాద్ ఆధ్వర్యంలో జనవాణి కార్యక్రమాన్ని కొనసాగించారని చెప్పారు. పవన్ పర్యటన సందర్భంగా తగిన పోలీస్ భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఆయన ఎయిర్‌పోర్టుకు వచ్చినప్పటికీ నుంచి డీసీపీ (లా అండ్ ఆర్డర్) సుమిత్‌సునీల్ గరుడ్, డీసీపీ (క్రైం) నాగన్న.. అనుమతి లేకుండా చేసిన ర్యాలీ కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఆ ర్యాలీకి అనుమతి లేదన్న విషయాన్ని స్వయంగా డీసీపీ సుమిత్ జనసేన అధినేత పవన్‌కు తెలిపారన్నారు. అంతేతప్ప పవన్‌పై దుసురుగా ప్రవర్తించాలన్న ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యాలని కొట్టిపారేశారు. వారి కేడర్, నాయకులు మంత్రులపై దాడిచేసిన కారణంగానే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. యువత ఇటువంటి క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుని తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు, కార్యకర్తలు విమానాశ్రయంలో మంత్రులపై దాడులు చేస్తున్న ఫొటోలు, వీడియోలను ప్రదర్శించారు. ఈ సమావేశంలో డీసీపీ (లా అండ్ ఆర్డర్) సుమిత్‌సునీల్ గరుడ్, ఏడీసీపీ (ఎస్బీ) ఆనందరెడ్డి, ఏసీపీ పెంటారావు తదితరులు పాల్గొన్నారు. -
పవన్‌కు చంద్రబాబు ఫోన్
సాక్షి, అమరావతి: విశాఖ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు చంద్రబాబు ఆదివారం ఫోన్‌చేశారు. పోలీసుల ఆంక్షలు, ప్రభుత్వ వైఖరిపై పవన్‌తో చంద్రబాబు మాట్లాడినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. పోలీసుల నోటీసు, జనసేన కార్యకర్తల అరెస్టుల గురించి చంద్రబాబుకు పవన్ వివరించారు. మరోవైపు.. అక్రమ అరెస్టులు, కేసులను చంద్రబాబు ట్విట్టర్లో ఖండించారు. పవన్‌కు పోలీసులు నోటీసులివ్వడం సరికాదని, జనవాణిపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం దుర్మార్గమన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని వైసీపీ సర్కార్ రాజ్యమేలుతోందని, ప్రతిపక్షాల కార్యక్రమాలకు అడ్డుపడటం, వ్యక్తిగత దూషణలు అప్రజాస్వామికమని చంద్రబాబు జగన్ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ప్రతిపక్షాల కార్యక్రమాలను అడ్డుకునే హక్కు ప్రభుత్వానికి లేదని, అక్రమ కేసులను ఎత్తివేసి, వారిని విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. -
రాష్ట్రపతి కోవింద్ కు స్వాగతం పలికిన సీఎం వైఎస్ జగన్
-
రాష్ట్రపతి కోవింద్ కు ఘన స్వాగతం పలకనున్న సీఎం జగన్
-
విశాఖకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
-
సీఎం జగన్ విశాఖ టూర్ కి సర్వం సిద్ధం
-
రాష్ట్రపతి పర్యటనలో మార్పులు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ విశాఖ పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 20వ తేదీ మ.1.45 గంటలకు రావాల్సి ఉంది. కానీ, సా.5.30కు విశాఖ ఐఎన్ఎస్ డేగాలోని నేవల్ ఎయిర్ స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రెసిడెన్షియల్ సూట్ (చోళా సూ ట్)కి వెళ్లి బసచేస్తారు. 21న ఉదయం నేవల్ డాక్ యార్డుకు చేరుకుని గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత 9గంటల నుంచి 11.45 వరకు జరిగే ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటారు. మ.12.15 గంటల నుంచి పీఎఫ్ఆర్ గ్రూప్ ఫొటో సెషన్లో.. అనంతరం విందులో పాల్గొంటారు. 22న ఉ.10.20 గంటలకు విమానంలో ఢిల్లీకి బయల్దేరుతారు. అలాగే, రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా ఈనెల 20న మ.3.10కి విశాఖ విమానాశ్రయానికి చేరుకుని నోవోటెల్ హోటల్‌కు వెళ్తారు. సా.5.05 నిమిషాలకు ఐఎన్ఎస్ డేగాలోని నేవల్ ఎయిర్ స్టేషన్‌కు చేరుకుని రాష్ట్రపతికి స్వాగతం పలుకుతారు. తిరిగి నోవోటెల్‌కు వచ్చి రాత్రికి అక్కడే బస చేస్తారు. ఇక 21న ఉదయం రాష్ట్రపతితో కలిసి పీఎఫ్ఆర్లో.. మధ్యాహ్నం ఫొటో కార్యక్రమంలోనూ పాల్గొంటారు. అనంతరం రాష్ట్రపతితో కలిసి విందుకు హాజరవుతారు. అక్కడ నుంచి నవోటెల్‌కు చేరుకుంటారు. 22న ఉ.10.20కి రాష్ట్రపతికి వీడ్కోలు పలుకుతారు. అనంతరం ప్రత్యేక విమానంలో గవర్నర్ తిరిగి విజయవాడ వెళ్తారు. -
విశాఖలో చంద్రబాబును అడ్డుకున్నది అక్కడి ప్రజలే
-
విశాఖ పర్యాటకానికి మూడు అవార్డులు
సాక్షి, విశాఖపట్నం : ప్రకృతి అందాలతో ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంటున్న విశాఖపట్నం జిల్లా పర్యాటకం మూడు జాతీయ స్థాయి అవార్డులు సొంతం చేసుకుంది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏటా పర్యాటక అవార్డుల్ని అందజేస్తుంది. ఈ ఏడాది మూడు విభా గాల్లో విశాఖపట్నం అవార్డులు దక్కించుకుంది. ఈ అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీ లోని విజ్ఞాన్‌భవన్‌లో శుక్రవారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీని వాసరావు అందుకోనున్నారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ మూడు విభాగాల్లో విశాఖ అవార్డులు కైవసం చేసుకుందని తెలిపారు. కాంప్రిహెన్సివ్ టూరిజం డెవలప్మెంట్ విభాగంలో బెస్ట్ స్టేట్ అవార్డుతో పాటు హ్యాండీక్రాఫ్ట్సŠ, సాగర తీరాలపై ప్రచురించిన పుస్తకాలు పబ్లిషింగ్ ఇన్ ఇంగ్లీష్ విభాగంలో మరో అవార్డు, విశాఖపట్నం రైల్వే స్టేషన్ బెస్ట్ టూరిస్ట్ ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్‌గా అవార్డు సొంతం చేసుకున్నాయని వివరించారు. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డులు విశాఖ దక్కించుకోవడం ఆనందంగా ఉందని మంత్రి అవంతి అన్నారు. భవిష్యత్తులో విశాఖ పర్యాటకాన్ని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసి మరిన్ని అవార్డులు సాధించే దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ముందుకెళ్తోందని అవంతి అన్నారు. -
విశాఖలో ప్రారంభమైన వైఎస్ జగన్ పర్యటన
-
రేపు వైఎస్ జగన్ తూ.గో, విశాఖ జిల్లాల పర్యటన
విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ శాసన సభా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు(బుధవారం) విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 29న జరిగిన గోకులపాడు బాణాసంచా పేలుడు ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలను ఆయన పరామర్శిస్తారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ చెప్పారు. విశాఖ సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గాయపడినవారిని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. దీంతో పాటు తూర్పు గోదావరి జిల్లాలో కూడా వైఎస్ జగన్ పర్యటించనున్నారు. గత కొన్ని రోజుల క్రితం గుండె పోటుతో మరణించిన జ్యోతిల నెహ్రూ సోదరుడు సత్యనారాయణ కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు.