Updates:
10:55 AM
నీటి పారుదల రంగంలో భారత్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది: షెకావత్
►ఇరిగేషన్‌పై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నాం
►ప్రపంచ దేశాలకు భారత్ అతిపెద్ద ఎగుమతిదారుగా వృద్ధి చెందుతోంది
►వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నాం
►మోదీ నేతృత్వంలో నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నాం
►రైతులకు మేలు జరిగేలా నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నాం
►భూగర్భ జలాల సంరక్షణకు సరైన ప్రణాళికలు రూపొందిస్తున్నాం
►నీటిని పొదుపుగా వాడితేనే భవిష్యత్ తరాలను ఉపయోగం
►వాటర్ రీసైక్లింగ్ విధానంతో మురికినీటిని శుద్ది చేస్తున్నాం
►తాగు, సాగునీటికి ఇబ్బంది కలగకుండా సరైన చర్యలు చేపడుతున్నాం
►2019లో మోదీ నేతృత్వంలో జలశక్తి అభియాన్ ప్రారంభించాం
►జలశక్తి అభియాన్‌తో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి
►నదుల అనుసంధాన ప్రక్రియ వేగంగా జరుగుతోంది
►ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్‌లో ఉన్న నదులను అనుసంధానం చేస్తున్నాం
►డ్యామ్ సేఫ్టీ యాక్ట్‌ల ద్వారా డ్యామ్‌ల పరిరక్షణ జరుగుతోంది
►అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా డ్యామ్‌లను పరిరక్షిస్తున్నాం
►ప్రపంచబ్యాంకు సహకారంతో డ్యామ్‌ల పరిరక్షణ జరుగుతోంది
10:45 AM
నీటి పారుదల రంగంపై సదస్సు జరగడం శుభపరిణామం: సీఎం జగన్
►సదస్సులో పాల్గొన్న దేశ,విదేశీ ప్రతినిధులకు కృతజ్ఞతలు
►ఏపీలో సాగునీటి రంగం, వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది
►ఏపీకి విస్తారమైన తీర ప్రాంతం ఉంది
►ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవడమే లక్ష్యం
►రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తరచూ కరవు వస్తోంది
►వర్షం కురిసేది తక్కువ కాలమే.. ఆ నీటిని సంరక్షించుకుని వ్యవసాయానికి వాడుకోవాలి
►సదస్సు నిర్వహణకు ఏపీకి అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాం
10:05 AM
►రాడిసన్ బ్లూ హోటల్‌లో ప్రారంభమైన ఐసీఐడీ కాంగ్రెస్ ప్లీనరీ
►కేంద్రమంత్రి షెకావత్‌తో కలిసి ప్రారంభించిన సీఎం జగన్
►ర్యాడిసన్ బ్లూ రిసార్ట్స్ వేదికగా ప్రతిష్టాత్మక సదస్సు
►సుమారు 90 దేశాల నుంచి హాజరైన ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు
►నీటి ఎద్దడిని అధిగమించడం, అధిక దిగుబడులే సదస్సు అజెండా
►కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు సత్కారం చేసి జ్ఞాపికలను బహూకరించిన నిర్వాహకులు
►విశాఖ చేరుకున్న సీఎం జగన్
►రుషికొండ ఐటీ హిల్స్‌కు చేరుకున్న సీఎం జగన్
►విశాఖపట్నం బయలుదేరిన సీఎం వైఎస్ జగన్
►మరికొద్ది సేపట్లో ఐసీఐడీ సదస్సుకు హాజరుకానున్న సీఎం
సాక్షి, విశాఖపట్నం: మరో అంతర్జాతీయ సదస్సుకు విశాఖ సిద్ధమైంది. అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకమైన ఐసీఐడీ కాంగ్రెస్ ప్లీనరీకి వేదికవుతోంది. 74 దేశాల అంబాసిడర్లు, మంత్రులు, ఇతర ప్రతినిధులకు అతిథ్యమిస్తోంది. ఇప్పటికే జీఐఎస్, జీ 20 సదస్సులతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన విశాఖలో గురువారం నుంచి ఈ నెల 8వ తేదీ వరకు 25వ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ సదస్సు జరగనుంది. 57 ఏళ్ల తరువాత భారత్‌లో జరుగుతున్న ఈ సదస్సుకు విశాఖ వేదికవడం విశేషం.
సెంట్రల్ వాటర్ కమిషన్, ఏపీ జలవనరుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రాడిసన్ బ్లూ హోటల్‌లో జరగనున్న ఈ సదస్సును గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ‘వ్యవసాయం నీటి కొరతను అధిగమించడం’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఐసీఐడీ అధ్యక్షుడు డాక్టర్ రాగబ్, ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుతో పాటు భారత్ నుంచి 300 మంది హాజరుకానున్నారు.
అలాగే ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, చైనా, ఇండోనేషియా, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయిల్, జపాన్, కొరియా, మలేషియా, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం ఇలా 74 దేశాల నుంచి 900 మందికి పైగా ప్రతినిధులు రానున్నారు. ఇదే వేదికపై 74వ అంతర్జాతీయ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(ఐఈసీ) సదస్సు కూడా జరగనుంది. తొలిరోజు ప్రముఖుల కీలక ఉపన్యాసాలు ఉండగా.. 3, 4, 5, అలాగే 9వ తేదీన విశాఖ పర్యాటక ప్రాంతాలైన అరకు వ్యాలీ, బొర్రా గుహలు, తాటిపూడి రిజర్వాయర్ వంటి ప్రాంతాలను సందర్శించనున్నారు. ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సు విజయవంతంగా పూర్తయ్యేందుకు పోలీసులు 1100 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment