విశాఖలో ప్రధాని మోదీ రోడ్‌ షో | Pm Narendra Modi Visakha Tour Updates | Sakshi
Sakshi News home page

విశాఖలో ప్రధాని మోదీ రోడ్‌ షో

Published Wed, Jan 8 2025 5:00 PM | Last Updated on Wed, Jan 8 2025 9:09 PM

Pm Narendra Modi Visakha Tour Updates

సాక్షి, విశాఖపట్నం: విశాఖలో ప్రధాని  మోదీ పర్యటించారు. సిరిపురం జంక్షన్‌  నుంచి రోడ్‌ షో ప్రారంభమైంది. ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ గ్రౌండ్‌ వరకు రోడ్‌ షో సాగింది. అనంతరం ప్రధాని మోదీ బహిరంగ సభలో మాట్లాడారు.

సాయంత్రం.. ప్రధాని ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్‌ షోలో పాల్గొన్నారు.  అనంతరం ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానం సభా వేదిక వద్ద నుంచి వర్చువల్‌గా పలు శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేసి ప్రసంగించారు.

అనంతరం విశాఖ విమానాశ్రయానికి చేరుకుని భువనేశ్వర్‌ వెళ్లారు. వెంకటాద్రి వంటిల్లు రెస్టారెంట్‌ నుంచి కిలోమీటరు పొడవున రోడ్డు షోలో పాల్గొని ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో సభా వేదిక వద్దకు ప్రధాని చేరుకున్నారు.

అక్కడ నుంచే వర్చువల్‌గా విశాఖ రైల్వే జోన్‌ ప్రధాన కేంద్రం సహా పూడిమడకలో గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్, నక్కపల్లిలో బల్క్‌ డ్రగ్‌ పార్కు, కృష్ణపట్నం ఇండ్రస్టియల్‌ నోడ్, గుంటూరు–బీబీనగర్, గుత్తి–పెండేకల్‌ రైల్వే లైన్ల డబ్లింగ్‌ వంటి పనులకు శంకుస్థాపన చేశారు. చిలకలూరిపేట 6 లైన్ల బైపాస్‌ను జాతికి అంకితం చేయడంతోపాటు పలు జాతీయ రహదారులు, రైల్వే లైన్లను వర్చువల్‌గా ప్రధాని ప్రారంభించారు.

విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన

ఇదీ చదవండి: ప్రధాని పర్యటనలో పోలీసుల ఓవరాక్షన్‌.. ఉక్కు కార్మికులకు వార్నింగ్‌
 

 

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement