
మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ విశాఖ పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 20వ తేదీ మ.1.45 గంటలకు రావాల్సి ఉంది. కానీ, సా.5.30కు విశాఖ ఐఎన్‌ఎస్ డేగాలోని నేవల్ ఎయిర్ స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రెసిడెన్షియల్ సూట్ (చోళా సూ ట్)కి వెళ్లి బసచేస్తారు. 21న ఉదయం నేవల్ డాక్ యార్డుకు చేరుకుని గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత 9గంటల నుంచి 11.45 వరకు జరిగే ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటారు. మ.12.15 గంటల నుంచి పీఎఫ్‌ఆర్ గ్రూప్ ఫొటో సెషన్‌లో.. అనంతరం విందులో పాల్గొంటారు.
22న ఉ.10.20 గంటలకు విమానంలో ఢిల్లీకి బయల్దేరుతారు. అలాగే, రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా ఈనెల 20న మ.3.10కి విశాఖ విమానాశ్రయానికి చేరుకుని నోవోటెల్ హోటల్‌కు వెళ్తారు. సా.5.05 నిమిషాలకు ఐఎన్‌ఎస్ డేగాలోని నేవల్ ఎయిర్ స్టేషన్‌కు చేరుకుని రాష్ట్రపతికి స్వాగతం పలుకుతారు. తిరిగి నోవోటెల్‌కు వచ్చి రాత్రికి అక్కడే బస చేస్తారు. ఇక 21న ఉదయం రాష్ట్రపతితో కలిసి పీఎఫ్‌ఆర్‌లో.. మధ్యాహ్నం ఫొటో కార్యక్రమంలోనూ పాల్గొంటారు. అనంతరం రాష్ట్రపతితో కలిసి విందుకు హాజరవుతారు. అక్కడ నుంచి నవోటెల్‌కు చేరుకుంటారు. 22న ఉ.10.20కి రాష్ట్రపతికి వీడ్కోలు పలుకుతారు. అనంతరం ప్రత్యేక విమానంలో గవర్నర్ తిరిగి విజయవాడ వెళ్తారు.
Comments
Please login to add a commentAdd a comment