జార్ఖండ్‌లో పెట్టుబడులు పెట్టండి-రతన్‌ టాటా | Ratan Tata calls upon fellow industrialists to invest in Jharkhand | Sakshi
Sakshi News home page

జార్ఖండ్‌లో పెట్టుబడులు పెట్టండి-రతన్‌ టాటా

Published Thu, Feb 16 2017 3:32 PM | Last Updated on Tue, Sep 5 2017 3:53 AM

జార్ఖండ్‌లో పెట్టుబడులు పెట్టండి-రతన్‌ టాటా

జార్ఖండ్‌లో పెట్టుబడులు పెట్టండి-రతన్‌ టాటా

జార్ఖండ్‌ లోపెట్టుబడులు పెట్టాల్సిందిగా తోటి పారిశ్రామిక వేత్తలకు  టాటా గ్రూపు అధినేత పిలుపునిచ్చారు.  జంషెడ్ పూర్‌ లోని  వ్యాపార  ప్రారంభ రోజుల గుర్తుచేసుకున్న  టాటా గ్రూప్ మూలపురుషుడు  రతన్ టాటా జార్ఖండ్ రాష్ట్రంలో అపారమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని చెప్పారు.  ఈ  పొటెన్షియాలిటీని అందిపుచ్చుకోవాలని  దేశీయ,  అంతర్జాతీయ కార్పొరేట్లకు విజ్ఞప్తి చేశారు.

గ్లోబల్ ఇన్వెస్టర్స్ 'సమ్మిట్ 2017  లో ఆయన గురువారం పాల్గొన్నారు.  ఈ సందర్భంగా రతన్‌ టాటా వద్ద మాట్లాడుతూ దేశంలో  వ్యాపారానికి గొప్ప అవకాశాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం ఆధ్వర్యంలో   న్యూ ఇండియాగాఅవతరించబోతోందన్నారు.  అయితే కేవలం పారిశ్రామికంగా అభివృద్ది చెందిన ప్రాంతాలపైనే దృష్టిపెడితే  సరిపోదని,  ఈ ప్రగతిని మరింత విస్తరించాల్సినఅవసరం ఉందన్నారు.  ఖనిజ సంపదలతో  అలరారుతున్న సహజ సౌందర్యంతో విలసిల్లే ప్రదేశం జార్ఖండ్‌ లో పెట్టుబడులపై దృష్టిపెట్టాలని టాటా చెప్పారు.

జార్ఖండ్‌  రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించిందనీ ఆ దిశగా  పురోగమిస్తూ ఇతర రాష్ట్రాలకు  దీటుగా నిలుస్తోందని చెప్పారు. ఈ క్రమంలో ఇక్కడ పెట్టుబడులు పెట్టడం చాలా లాభదాయకన్నారు. కనుక ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటూ తన సమకాలీన దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను  కోరారు.

కాగా భారతదేశంలో అతిపెద్ద ప్రైవేటు కార్పొరేట్ గ్రూప్ టాటా గ్రూప్ .  ప్రపంచంలోని బాగా ప్రఖ్యాతిగాంచిన సంస్థలలో ఒకటిగా గుర్తించబడిన టాటా స్టీల్‌ ప్రస్తానం జంషెడ్‌ పూర్‌ లో మొదలైన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement