
సాక్షి, తాడేపల్లి: రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తల బృందం గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులపై సీఎం జగన్‌తో చర్చించారు. ఈ నేపథ్యంలో మంత్రులు, అధికారులు రాష్ట్రంలోని పెట్టుబడుల అనుకూలతలను పారిశ్రామికవేత్తల బృందానికి వివరించారు. డైరీ, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ గ్రిడ్ ఆటోమేషన్, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తల బృందం ఆసక్తి కనబరిచింది.