న్యూఢిల్లీ: పారిశ్రామిక మద్యానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఇండస్ట్రీయల్ ఆల్కహార్ తయారీ, అమ్మకాలను నియంత్రించే చట్టాలను చేసే అధికారం రాష్ట్రాలకు కూడా ఉంటుందని సుప్రీంకోర్టు బుధవరం తీర్పునిచ్చింది. ఈ విషయంపై ప్రభుత్వాలకు ఉన్న అధికారాన్ని తొలగించలేనని పేర్కొంది.
ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలోని ఎనిమిది మంది సభ్యులు ఈ పిటిషన్‌కు మద్దతు తెలపగా.. జస్టిస్ బీవీ నాగరత్న మాత్రం విభేదించారు. పారిశ్రామిక మద్యంపై శాసనాధికారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉండాలని ఆమె వాదించారు. దీంతో 8:1 మెజార్టీతో సుప్రీం ధర్మాసనం ఈ తీర్పును ప్రకటించింది.
అయితే యూపీ స్టేట్ వర్సెస్ సింథటిక్స్ అండ్ కెమికల్స్ కేసులో పారిశ్రామిక మద్యపానాన్ని నియంత్రించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి మంజూరు చేస్తూ 1990లో ఇచ్చిన ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పును తాజాగా సుప్రీం రద్దు చేసింది. సీజేఐ చంద్రచూడ్, మెజారిటీ అభిప్రాయాన్ని అందజేస్తూ.. ‘డినేచర్డ్ స్పిరిట్స్' అని పిలవబడే 'పారిశ్రామిక మద్యం'పై చట్టం చేసే అధికారం రాష్ట్రాలకు ఉందని, ఈ అధికారాలను రాష్ట్రాల నుండి తొలగించలేమని స్పష్టం చేశారు. వారి అధికార పరిధిలో పారిశ్రామిక మద్యం ఉత్పత్తి, సరఫరాను నియంత్రించడానికి వీలుందని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment