ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఆగస్ట్ 27 (మంగళవారం ) సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. కవిత బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది.
అయితే ఇదే ధర్మాసనం మద్యం కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేసింది. ఈసారి తమ నాయకురాలికి తప్పనిసరిగా బెయిల్ వస్తుందని బీఆర్‌ఎస్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, మద్యం పాలసీ కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఇదే కేసులో ఏప్రిల్ 15న సీబీఐ అరెస్టు చేసింది.
అయితే ఈ రెండు సీబీఐ, ఈడీ కేసుల్లో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ బెయిల్ పిటిషన్‌పై రేపు విచారణకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment