సత్యవేడు (తిరుపతి జిల్లా): భారత్‌లోని ప్రముఖ ఇంటిగ్రేటివ్–3పీఎల్ (థర్డ్ పార్టీ లాజిస్టిక్స్) సేవల సంస్థ కెర్రీ ఇండెవ్ లాజిస్టిక్స్ నెట్‌వర్క్, శ్రీసిటీలో 3 లక్షల చ.అ విస్తీర్ణంలో నిర్మించిన నూతన అత్యాధునిక లాజిస్టిక్స్ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించింది. మిత్సుబిషి ఎలక్ట్రిక్ ఇండియా ఆపరేషన్స్ కోసం ఇది పనిచేయనుంది. పరిశ్రమ ఆవరణలో జరిగిన ప్రారంభోత్సవ వేడుకల్లో మిత్సుబిషి ఎలక్ట్రిక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్)ఒబాటా మసకాజు ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.
కెర్రీ ఇండెవ్ చైర్మన్ డాక్టర్ గ్జావియర్ బ్రిట్టో మాట్లాడుతూ..వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్ వ్యాపార సంస్థలకు శ్రీసిటీ అత్యంత అనువైన వ్యూహాత్మక స్థానమని చెప్పారు. తమ ప్లాంట్ ఏర్పాటుకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన శ్రీసిటీ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఒబాటా మసకాజు మాట్లాడుతూ నూతన ప్లాంట్ ఏర్పాటులో కెర్రీ ఇండెవ్ లాజిస్టిక్స్, ఇండోస్పేస్ బృందాల అత్యుత్తమ కృషిని అభినందించారు. శ్రీసిటీ ఎండీ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ..ప్రస్తుతం పారిశ్రామిక రంగంలో లాజిస్టిక్, వేర్‌హౌసింగ్ సేవల ప్రాముఖ్యతను వివరించారు. మిత్సుబిషి ఎలక్ట్రిక్ ప్లానింగ్ హెడ్ గణపతి శంకర్ తదితరులు పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment