పే..ద్ద లారీ
చిలమత్తూరు : లారీకి సాధారణంగా 10 లేదా 16 చక్రాలు అంతకంటే పెద్ద లారీకి 90 చక్రాల వరకు ఉంటాయి. కానీ తమిళనాడు తిరుచునారు నుంచి పరిశ్రమలకు సంబంధించిన అతి పెద్ద పరికరంతో గుజరాత్ వెళ్తున్న ఓ లారీకి ఏకంగా 134 చక్రాలు ఉన్నాయి. శుక్రవారం కొడికొండ చెక్‌పోస్టులో తనిఖీలో భాగంగా ఈ లారీని ఆపారు. ఇంత పెద్ద లారీని చూసిన స్థానికులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.