![Telangana American Telugu Association Conduct A Charity Program - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/15/Serve1.jpg.webp?itok=4dNyCNTj)
న్యూయార్క్ : తెలంగాణ అమెరికన్ తెలుగు అసోషియేషన్ (టాటా) ఆధ్వర్యంలో ‘సర్వ్ ఎ మీల్’ చారిటీ కార్యక్రమం ఏర్పాటుచేశారు. న్యూయార్క్‌లోని రొనాల్డ్ మెక్‌డొనాల్డ్ హౌజ్‌లో ఈ చారిటీ విందును ఏర్పాటు చేశారు. పసందైన వంటకాలతో వచ్చిన వారి ఆకలి తీర్చారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పీ.మల్లారెడ్డి, వీ.సుధాకర్, మాధవ రెడ్డి మిగతావారికి టాటా వారు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టాటా రీజనల్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.పాపిరెడ్డి, కో ఆర్డినేటర్ సత్యారెడ్డి, స్టాండింగ్ కమిటీ మెంబర్ ఆర్.పవన్, టాటా బోర్డ్ డైరెక్టర్స్ రంజిత్, శరత్, పణిభూషన్, మహిళా స్టాండింగ్ కమిటీ కో చైర్ పర్సన్ మాధవి, స్టాండింగ్ కమిటీ కో చైర్మెన్ అశోక్, కో ఆర్డినేటర్స్ ఉషా, మల్లిక్, సత్యారెడ్డి, యోగి, ప్రహ్లాద, హేమంత్, రమా, జయప్రకాష్, వాలంటీర్లు నాగశ్రీ, మౌనిక, శ్వేత, కరుణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment