Charity Program
-
దానధర్మాలపై ఖురాన్ ఏం చెబుతోంది?
తమ సంపదను దైవ మార్గంలో ఖర్చు చేసే వారి ఉపమానం ఇలా ఉంటుంది: ఒక్క విత్తనాన్ని నాటితే అది మొలిచి ఏడు వెన్నులను ఈనుతుంది. ప్రతి వెన్నుకూ నూరేసి గింజలు ఉంటాయి. ఇదేవిధంగా అల్లాహ్ తాను కోరిన వారి సత్కార్యాన్ని వికసింప జేస్తాడు. అల్లాహ్ అమితంగా ఇచ్చేవాడూ, అన్నీ తెలిసినవాడూను. అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని వ్యయం చేసి ఆ తర్వాత తమ దాతృత్వాన్ని మాటిమాటికి చాటుతూ గ్రహీతల మనస్సును గాయపరచని వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉంది. వారికి ఏ విధమైన భయం కానీ ఖేదం కాని ఉండవు. మనసును గాయపరిచే దానం కంటే మృదుభాషణం. క్షమాగుణం ఎంతో మేలైనవి. అల్లాహ్ అన్నింటికి అతీతుడు, అత్యంత సహనశీలుడూను. విశ్వసించిన ఓ ప్రజలారా! కేవలం పరుల మెప్పును పొందడానికే తమ ధనం ఖర్చు చేసే వాని మాదిరిగా..... మీరు దెప్పి పొడిచి గ్రహీత మనస్సును గాయ పరిచి మీ దానధర్మాలను మట్టిలో కలపకండి. అతడు చేసిన ధనవ్యయాన్ని ఈ విధంగా పోల్చవచ్చు: ఒక కొండ రాతిపై ఒక మట్టి పొర ఏర్పడి ఉంది. భారీ వర్షం దానిపై కురవగా ఆ మట్టి కాస్త కొట్టుకు΄ోయింది. చివరకు మిగిలింది ఉత్త కొండ రాయి మాత్రమే. ఇలాంటివారు తాము దానం చేస్తున్నామని భావించి చేసే పుణ్యకార్యం వల్ల వారికి ఏ ప్రయోజనమూ కలుగదు. (నిస్సహాయతలోనూ.. దేవుని వైపే)(దివ్య ఖుర్ఆన్: 2:261–264)వివరణ: మనం ఎవరికైనా దానం ఇచ్చి దెప్పి పొడవడం సరైన పద్ధతి కాదు. కుడి చేతితో దానం చేసిన విషయం ఎడమ చేతికి తెలియకూడదు అంటారు పెద్దలు. కాబట్టి మనం చాటుమాటుగా దానం చేయాలి. అది దేవుని ప్రీతి కోసం మాత్రమే చేయాలి. ప్రదర్శన బుద్ధి కోసమో పేరు ప్రఖ్యాతల కోసమో చేయకూడదు. మీరు చేసిన దానం దేవుడికి తెలుసు తీసుకున్న వాడికి తెలుసు అంతే కానీ మూడో వ్యక్తికి తెలియకుండా ఉండడమే దైవ భక్తికి నిదర్శనం. – మొహమ్మద్ అబ్దుల్ రషీద్ -
తొలిసారిగా...ఓ చారిటీ ఈవెంట్లో వర్మ...
సాక్షి, హైదరాబాద్ : ఓ వైపు తెలంగాణ ఎన్నికల రణక్షేత్రం అంతకంతకూ వేడెక్కుతూ పూటకో మలుపులు తిరుగుతోంది. అయినప్పటికీ‘‘తెలంగాణ రాజకీయం పట్ల ఆసక్తి కలగడం లేదు. ఇక్కడ డ్రామా లేదు’’ అని తను గతంలో అన్న మాటల్ని పునరుద్ఘాటిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై వ్యూహం, శపధం సినిమా రూపొందిస్తున్న దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. యాపిల్ హోమ్ రియల్ నీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగనున్న మిక్స్ అండ్ మింగిల్ మెగా క్రిస్మస్ కార్నివాల్ పోస్టర్ని బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్కన్ హోటల్లో శనివారం రామ్‌గోపాల్ వర్మ విడుదల చేశారు. తొలిసారి ఒక సేవా కార్యక్రమానికి నిధుల సేకరణకు మద్ధతు తెలుపుతున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పటిలాగే తనదైన శైలిలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సేవ చేయను..కానీ సపోర్ట్ చేస్తాను... ఈ ఈవెంట్ ద్వారా వచ్చిన నిధులను మిషన్ భధ్రత పేరుతో సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారనే విషయాన్ని ప్రస్తావిస్తూ తాను వ్యక్తిగతంగా సేవ చేయననే మరోసారి చెప్పారు. అయితే చేసేవారికి మద్ధతు తెలపాలనే ఉద్దేశ్యంతోనే తొలిసారిగా ఈ తరహా ఈవెంట్‌కి వచ్చానన్నారు. అయితే ఇకపై కూడా ఇలా మద్ధతు ఇవ్వడం అనేది కొనసాగుతుందా అంటే నీలిమ ఆర్య ( కార్యక్రమ నిర్వాహకురాలు) లాంటి ఫ్రెండ్ అడిగితే కావచ్చునన్నారు. ఆసక్తి ఆంధ్రపైనే... తెలంగాణ రాజకీయాల్లో డ్రామా లేదని, అందుకే తాను ఇక్కడి విషయాలు అసలు పట్టించుకోవడం లేదని అంటున్నారు వర్మ. ఆంధ్ర రాజకీయాలే తప్ప తెలంగాణ రాజకీయాలపై సినిమాలు ఎందుకు తీయడం లేదు అన్న ప్రశ్నకు బదులిస్తూ తన కాన్సన్ట్రేషన్ అంతా ఆంధ్రప్రదేశ్ మీదే ఉందన్నారు. ఇలాంటి ఈవెంట్లకు రావడం ద్వారా సమాజానికి భిన్నంగా ఉండే తన జీవనశైలి నుంచీ తాను కాస్త బయటపడుతున్నట్టుగా సాధారణ జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్టుగా అనుకోవచ్చునా అనే ప్రశ్నకు ఆయన బదులిస్తే... అది కేవలం అపోహ మాత్రమేనని తాను ఎన్నటికీ మారనని స్పష్టం చేశారు. వర్మ మేకప్‌తో, మెదడుతో మాట్లాడరు... అందుకే ఈ కార్యక్రమానికి వివాదాస్పద దర్శకుడు, సేవా కార్యక్రమాల పట్ల బహిరంగంగానే విముఖత చూపే రామ్‌గోపాల్ వర్మ అనే దర్శకుడ్ని ఎంచుకోవడం పట్ల ఆయన ఫ్రెండ్ నీలిమ ఆర్య స్పందించారు. ఆయన ముఖానికి మేకప్ ఉండదని, అంతేకాదు ఆయన మైండ్‌తో కాకుండా హృదయంతో మాట్లాడతారని అందుకే తాను ఆయన్ను ఎంచుకున్నానని చెప్పారు. మిషన్ భధ్రత పేరుతో అమ్మాయిలకు ఇన్నర్‌వేర్ ఉచితంగా పంపిణీ చేయబోతూ, నిధుల సేకరించే ఈవెంట్‌కి వర్మను పిలవడం ట్రోల్స్‌కు గురవదా? అంటే అయినా పర్లేదు అనుకున్నానని, ఈ విషయమై వర్మ కూడా ముందే తనను హెచ్చరించారని నీలిమ స్పష్టం చేశారు. అయితే తాను వర్మ విషయంలో నమ్మిన దానికి తగ్గట్టుగా మాత్రమే నడుచుకున్నానన్నారు. ఆయనను మరిన్ని చారిటీ ఈవెంట్లకు కూడా పిలిచే అవకాశం ఉందన్నారు. -
కాళ్లు లేని వారిని నడిపిస్తున్న సదా‘సేవా’మూర్తి!
పాలకొల్లు (సెంట్రల్): పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ఆయన పేరు వేదాంతం సదాశివమూర్తి. పాతికేళ్ల వయసు (1981)లో రైలు దిగుతుండగా కాలుజారి ప్లాట్‌ఫామ్, బోగీ మధ్యలో పడిపోవడంతో ఆయన రెండు కాళ్లూ కోల్పోయారు. పూనేలోని డిఫెన్స్ రిహేబిలిటేషన్ సెంటర్లో మూడు నెలలపాటు చికిత్స చేయించుకున్న సదాశివమూర్తి కృత్రిమ కాళ్లు అమర్చుకున్నారు. 6 నెలల తరువాత కృత్రిమ కాళ్లతోనే బుల్లెట్ వాహనాన్ని నడిపి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఆ తర్వాత తాను ధరించే కృత్రిమ కాళ్లకు ఎలాంటి మరమ్మతు వచ్చినా పూనే వెళ్లాల్సి వచ్చేది. అలా 1998 వరకు దాదాపు 17 సంవత్సరాలపాటు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సదాశివమూర్తి పూనే వెళ్లి వస్తుండేవారు. తాను పడుతున్న ఇబ్బందుల్ని తనలాంటి వారు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో స్థానిక రంగమన్నార్‌పేటలో చైతన్య కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అలా మొదలుపెట్టిన ఈ కేంద్రంలో ఇప్పటివరకు సుమారు 10 వేల మందికి కృత్రిమ కాళ్లను అమర్చారు. ఇటీవల ఓ ఆవుకు సైతం కృత్రిమ కాలు అమర్చి ఔరా అనిపించారు సదాశివమూర్తి. అతి తక్కువ ధరకే.. ఒక్కో కృత్రిమ కాలు ధర రూ.15 వేల నుంచి సుమారు రూ.25 వేల వరకు ఉంటుంది. కాళ్లతో పాటు చేతి వేళ్లు, చెవులు ఇలా ఏ రంగు వారికి ఆ రంగులోనే కృత్రిమ అవయవాలు తయారు చేస్తున్నారు సదాశివమూర్తి. రూ.14 వేలు ఉండే కృత్రిమ కాలిని రూ.900, రూ.3,500 ఉండే కాలి ధరను రూ.120కు తీసుకువచ్చారు. వివిధ కంపెనీలు వేసే రాడ్ల స్థానంలో సైకిల్‌కు వాడే కడ్డీలను కట్ చేసి కృత్రిమ కాళ్ల పరికరాలు తయారు చేయడం ద్వారా కృత్రిమ కాళ్ల ధరలను నిరుపేదలకు సైతం అత్యంత అందుబాటు ధరల్లోకి తెచ్చారు. సదాశివమూర్తి సేవలను గుర్తించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఆర్థోపెడిక్ సర్జన్స్ 15 ఏళ్ల క్రితం స్వర్ణ పతకాలను అందజేశాయి. కృత్రిమ అవయవాలను కొత్తగా తయారు చేసినందుకు 2010లో ఆలిండియా అవార్డుతో పాటు రూ.2 లక్షల నగదు కూడా అందుకున్నారు. 2007లో పుట్టపర్తి సత్యసాయిబాబా ఆశ్రమ నిర్వాహకులు సదాశివమూర్తిని స్వర్ణ ఉంగరంతో సత్కరించారు. ఆస్ట్రేలియా వర్సిటీ డాక్టరేట్ ప్రదానం నూతన టెక్నాలజీతో తక్కువ ధరకు.. పేదవారికైతే ఉచితంగానే కృత్రిమ అవయవాలను అందిస్తున్న సమాచారాన్ని సదాశివమూర్తి ఎప్పటికప్పుడు ఫేస్బుక్లో పోస్ట్ చేస్తుండేవారు. అతని ఫేస్బుక్ ఖాతాను ముంబైలో నివాసం ఉంటున్న డాక్టర్ వీవీఎల్ఎన్ శాస్త్రి చాలాకాలంగా ఫాలో అవుతూ.. ఆ పోస్టులను భద్రపరిచి ఆస్ట్రేలియా యూనివర్సిటీకి పంపించారు. ఆయన అందిస్తున్న సేవలను గుర్తించిన ఆస్ట్రేలియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. గత నెల 5వ తేదీన ఢిల్లీలో డాక్టరేట్‌ను అందించడంతోపాటు ‘ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అవార్డును సైతం సదాశివమూరి్తకి అందజేసింది. పేదలను ఆదుకోవాలనే తపనతోనే.. ఎంఏ చదువుతున్నప్పుడు కాళ్లు కోల్పోయాను. అనంతరం డిపొ్లమా ఇంజనీరింగ్ చేశాను. మోకాలి కింద వరకు కృత్రిమ కాళ్లను ఉచితంగానే అమరుస్తున్నాం. మోకాలి పైవరకు అమర్చాలంటే రూ.45 వేలకు పైగా ఖర్చవుతుంది. పేదలకు ఉచితంగా సేవలందించాలనేదే సంకల్పం. – వేదాంతం సదాశివమూర్తి, చైతన్య కృత్రిమ అవయవ కేంద్రం నిర్వాహకుడు, పాలకొల్లు చదవండి: వేరుశనగలో ‘విశిష్ట’మైనది -
గౌతమ్ అదానీ బర్త్‌డే కానుక.. ఎవ్వరూ ఊహించలేనంత భారీగా
గత కొన్నేళ్లుగా వ్యాపార రంగంలో రాకెట్ వేగంతో దూసుకుపోతున్న గౌతమ్ అదానీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటి వరకు వ్యాపారంలో ఇబ్బడిముబ్బడిగా లాభాలు సంపాందించిన అదానీ ఇప్పుడు సేవా మార్గం బాట పట్టారు. తన తండ్రి వందవ జయంతి తన 60 పుట్టిన రోజును పురస్కరించుకుని కీలక నిర్ణయం వెల్లడించారు. అదానీ గ్రూపు ద్వారా రాబోయే రోజుల్లో 60 వేల కోట్ల రూపాయలతో సేవా కార్యక్రమాలు చేయబోతున్నట్టు స్వయంగా ట్విటర్ ద్వారా ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ తదితర రంగాల్లో ఈ నిధులు ఖర్చు చేయన్నారు. బంగారు భారత్ లక్ష్యంగా సామాజిక సమానత్వం సాధించేందుకు అదాని కుటుంబం పాటుపడుతుందని ఆయన వెల్లడించారు. దేశీయంగా దాతృత్వంలో అజీమ్ ప్రేమ్‌జీ, రతన్‌టాటాలు ముందు వరుసలో ఉన్నారు. తాజా నిర్ణయంతో ఆ దిగ్గజాల సరసన గౌతమ్ అదానీ నిలవనున్నారు. గత నాలుగేళ్లుగా వ్యాపార రంగంలో అదానీ పట్టిందల్లా బంగారం అవుతూ వచ్చింది. బొగ్గు గనులు, పవర్ ప్రాజెక్టులు, ఎయిర్‌పోర్టులు, మీడియా ఇలా అన్ని రంగాల్లో ఆదానీ గ్రూపు సంచలన విజయాలు సాధించింది. దీంతో అనతి కాలంలోనే ఆయన ప్రపంచ కుబేరుల్లో టాప్ టెన్ జాబితాలో చోటు సాధించగలిగారు. ఒక దశలో సంపదలో ముఖేశ్ అంబానీని కూడా వెనక్కి నెట్టారు. అంతా ఆయన సంపద పెరిగిన తీరు గురించి చర్చ జరుపుతున్న సమయంలో అకస్మాత్తుగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచారు అదానీ. On our father’s 100thbirth anniversary & my 60thbirthday, Adani Family is gratified to commit Rs 60,000 cr in charity towards healthcare, edu & skill-dev across India. Contribution to help build an equitable, future-ready India. @AdaniFoundation pic.twitter.com/7elayv3Cvk — Gautam Adani (@gautam_adani) June 23, 2022 చదవండి: స్వావలంబనే భారత్‌కు మార్గం: గౌతం అదానీ -
పిల్లల కథ: తన వంతు సాయం
గుర్ల అనే గ్రామంలో నివసించే శశిధరుడికి బాగా డబ్బుంది. పండే పొలాలు కూడా చాలా ఉన్నాయి. ఐతే ఎవరైనా అవసరం పడి చేయి చాస్తే మాత్రం ఇవ్వడానికి ముందుకొచ్చేవాడు కాదు. ఈ ప్రవర్తన భార్య సుగుణకి నచ్చేది కాదు. ‘మీ మిత్రుడు చరితాత్ముడిని చూసి సిగ్గు తెచ్చుకోండి. ఆయన గుణం ఎంత మంచిది! ఎందరికో ఉత్తి పుణ్యాన దానాలు చేస్తూంటాడు. తను చేసిన దానాలను కూడా ఎవరికీ చాటద్దంటాడు. తన వ్యాపారంలో వచ్చే లాభాలన్నీ దానాలకే ఖర్చు పెడతారు. గుప్త దానమే గొప్పదంటాడు’ అని భార్య చెప్పాక శశిధరుడిలో ఒక వింత ఆలోచన పుట్టుకొచ్చింది. వెంటనే చరితాత్ముడిని కలవడానికెళ్ళాడు. ఆ సమయంలో ఎవరో పొరుగూరి రైతులు తమకు పంట నష్టం వచ్చిందని చెప్పి ఆదుకోమంటున్నారు చరితాత్ముడిని. ‘నేను మిమ్మల్ని ఆదుకున్న సంగతి బైటకు పొక్కనీయవద్దు. ఆ షరతు మీదే మీకు సాయపడగలను’ అని చెప్పాడు చరితాత్ముడు రైతులతో. దానికి వాళ్లు అంగీకరించి చరితాత్ముడి దగ్గర ధన సహాయం తీసుకుని వెళ్లిపోయారు. అప్పుడు శశిధరుడి రాకను గమనించి ‘మిత్రమా! చాలాకాలం తరువాత ఇలా దర్శనమిచ్చావేంటి?’ అంటూ మిత్రుడిని ఆహ్వానించాడు చరితాత్ముడు. ‘నేనొక విషయం విన్నాను. ఇప్పుడు స్వయంగా చూశాను. ఎన్ని దానాలు చేసినప్పటికీ పైకి చెప్పవద్దని అంటావెందుకో? నీకు పేరు రావాలని ఉండదా? ’ సందేహం వెలిబుచ్చాడు శశిధరుడు. ‘నా దృష్టిలో గుప్తదానమే మహాదానం. అది అవతలి వారిని అవసరంలో ఆదుకోవడానికే తప్ప మన గొప్ప చెప్పుకోడానికి కాదని నా ఉద్దేశం’ నిరాడంబరంగా చెప్పాడు చరితాత్ముడు. ‘నీ గుణం గొప్పదే కావచ్చు కాని ఇన్ని దానాలు చేస్తున్నప్పటికీ ఎవరికీ ఆ విలువ తెలియకపోవడం చూసి చింతిస్తున్నాను. అందువలన నువ్వు నాకొక సాయం చేయాలి’ అడిగాడు శశిధరుడు. ఏమిటో చెప్పమన్నట్లు చూశాడు చరితాత్ముడు. ‘ నువ్వు చేస్తున్న దానాలకు నీ పేరెలాగూ వద్దంటున్నావు. నీకు అభ్యంతరం లేకుంటే.. ఇకనుండీ నువ్వు ఏ దానం చేసినా అది నాదిగా చెప్పుకుంటాను. వాళ్లంతా నేనే దానం చేస్తున్నట్లుగా చెప్పుకుని నన్ను కీర్తిస్తారు. నా గురించి అందరూ గొప్పగా అనుకోవడం నాకు ఎంతో ఇష్టం’ అంటూ తన మనసులో కోరికను బైటపెట్టాడు శశిధరుడు. దానికి చరితాత్ముడు ‘నాకు కీర్తి కాంక్ష లేనప్పుడు అది నీకు దక్కితే నాకేమీ నష్టం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దానం చేస్తున్నది నువ్వేగాని నేనన్నది బైటపడకూడదు. దానికి కూడా నువ్వు ఒప్పుకోవాలి’ అని స్పష్టం చేశాడు. అంగీకరించాడు శశిధరుడు. ఆరోజు మొదలు చరితాత్ముడు తన దగ్గరకొచ్చిన వారికి ఏ దానమిచ్చినా సరే అది శశిధరుడిదనే చెప్పేవాడు. అలాగే వాళ్ళు కూడా బైట చెప్పడం మొదలెట్టారు. ఈ విషయం ఊరూవాడా పాకింది. ఇంతకాలం ఏనాడూ ఎవరికీ దానాలు చేయడం చూడని శశిధరుడిలో మార్పు రావడం వింత విషయంగా తోచింది అందరికీ. ఇలా ఉండగా కొంతకాలానికి చరితాత్ముడికి జబ్బు చేసి మంచాన పడ్డాడు. ఆ పరిస్థితిలో దానం కోసం ఎవరైనా వచ్చినప్పటికీ అడగడానికి సంకోచించేవారు. ఐతే చరితాత్ముడి భార్య సుమతి ‘మావారి పరిస్థితి బాగులేదన్నది మీకు తెలుసు. శశిధరుడు దానాలు చేస్తున్న సంగతి మా వారు ఇటీవల చెప్పడం నాకు తెలుసు. అందువలన ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆయన దగ్గరకు వెళ్ళండి. తప్పకుండా సహాయపడతాడు’ అని పంపించడం మొదలెట్టింది. ఆ విషయం తెలుసుకున్న వాళ్లంతా తిన్నగా శశిధరుడి దగ్గరకు పోయి ‘ఇంతదాకా మీరు చేస్తున్న దానాల గురించి వింటూనే ఉన్నాం. మీరు తప్పకుండా సాయం చేయాలి’ అంటూ చేయిచాచసాగారు. గతుక్కుమన్నాడు శశిధరుడు. ఇంతవరకూ తను చేసిన దానధర్మాలు చరితాత్ముడివేనని చెప్పలేక, తను సహాయపడతానని మాటివ్వలేక గిలగిలలాడిపోయాడు. సరిగ్గా అదే సమయంలో ఊళ్ళోకి వరదలొచ్చి కొందరి ఇళ్ళు కొట్టుకుపోయాయి. అప్పుడు కొందరు ఊరిపెద్దలు శశిధరుడి దగ్గరకొచ్చి ‘ఇళ్ళు కోల్పోయిన కొందరికి ఇళ్లను కట్టించడానికి అందరినీ సాయమడుగుతున్నాం. మీరెలాగూ దానకర్ణులుగా పేరుబడ్డారు. మీ వాటా ఘనంగా ఉంటుందని ఆశిస్తున్నాం’ అన్నారు. ఇంతకాలం అయాచితంగా తనకు పేరొచ్చింది. ఇప్పుడు తన ఆస్తిలోంచి తీసివ్వడానికి మనసొప్పటంలేదు శశిధరుడికి. భర్త వాలకం కనిపెట్టిన సుగుణ ‘ఒకరి డబ్బుతో చేసిన దానాలను మీవిగా చెప్పుకుని మురిసిపోయారు. తీరా ఇప్పుడు నిజంగా మీరు చేయాల్సి వచ్చేసరికి వెనకడుగేస్తున్నారు. ఇది ఎంత మాత్రం న్యాయం కాదు. బాధల్లో ఉన్నవారికి తోడుగా నిలవడం మానవత్వమని పించుకుంటుంది. దయచేసి మీలో మార్పు తెచ్చుకోండి’ అని సున్నితంగా మందలించింది. ఇంతదాకా వచ్చి ఇప్పుడు కుదరదు అంటే అయాచితంగా తనకు వచ్చిన మంచిపేరు పోతుంది. దీన్ని నిలబెట్టుకోవడమే ధర్మమనిపించింది. మరో ఆలోచనకి తావివ్వకుండా వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకోడానికి తన వంతు సాయంగా భారీగానే ముట్టచెప్పాడు శశిధరుడు. భర్తలో మార్పు చూసిన భార్య సుగుణ ఎంతగానో సంతోషించింది. (క్లిక్: జాతరలో కోతిబావ.. ఏం చేశాడంటే!) -
జొమాటో డెలివరీ పార్ట్నర్స్కి గుడ్‌న్యూస్!
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ తన ఉదారత చాటుకున్నారు. సంస్థ డెలివరీ పార్ట్నర్స్ పిల్లల చదువుకు ఆర్థికంగా తోడ్పాటు అందించే దిశగా జొమాటో ఫ్యూచర్ ఫౌండేషన్ (జెడ్‌ఎఫ్‌ఎఫ్)కు 90 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 700 కోట్లు) విలువ చేసే ఎసాప్స్‌ను (స్టాక్ ఆప్షన్స్) విరాళంగా ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు సంస్థ అంతర్గతంగా ఉద్యోగులకు ఆయన లేఖ రాశారు. జొమాటో పబ్లిక్ ఇష్యూకి వెళ్లడానికి ముందు .. ఇన్వెస్టర్లు, బోర్డు ఆయన పనితీరు ప్రాతిపదికన కొన్ని ఎసాప్స్‌ను కేటాయించింది. వీటన్నింటినీ ఫౌండేషన్‌కు అందిస్తున్నట్లు గోయల్ తెలిపారు. ఇద్దరు పిల్లలకు గత నెలలో షేరు సగటు ధర ప్రకారం వీటి విలువ సుమారు రూ. 700 కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. అయిదేళ్లకు పైగా తమ డెలివరీ పార్ట్‌నర్స్‌గా పనిచేస్తున్న వారి పిల్లల (గరిష్టంగా ఇద్దరికి) చదువు ఖర్చుల కోసం ఏటా ఒక్కొక్కరికి రూ. 50,000 వరకూ ఈ ఫండ్ నిధులు అందిస్తుంది. అదే పదేళ్ల పైగా పని చేస్తున్న వారి పిల్లలకు ఏటా రూ. 1 లక్ష వరకూ లభిస్తుంది. మహిళా డెలివరీ పార్ట్నర్లకు ఈ పని కాలానికి సంబంధించి కొంత వెసులుబాటు ఉంటుంది. ఫండ్‌కు నిధులు సమకూర్చేందుకు తొలి ఏడాది తన ఎసాప్స్‌లో 10 శాతాన్ని విక్రయించనున్నట్లు గోయల్ పేర్కొన్నారు. చదవండి: శబాష్!! జొమాటో.. చెప్పింది చేసింది! -
ఆ ఇంజక్షన్ ఖరీదు పదహారు కోట్లు.. ఇస్తేనే ప్రాణం నిలబడేది ?
వయస్సు పదహారు నెలల పసితనం... సమస్య అంతు చిక్కని వ్యాధి.. పరిష్కారం రూ. 16 కోట్ల విలువైన ఇంజెక్షన్. ఇప్పుడు కావాల్సింది మనందరి సహకారం. అవును 16 నెలల పాలబుగ్గల ఆయాన్ష్ బతకాలంటే మనవంతు సాయం తప్పనిసరిగా మారింది. పన్నెండేళ్లకు వందన, మదన్ దంపతులకు పెళ్లై చాలా ఏళ్లైనా పిల్లలు కలగలేదు. టీసీఎస్ ఉద్యోగిగా పెద్దగా ఆర్థిక ఇబ్బందులు లేని ఆ కుటుంబానికి సంతాన లేమి ఒక్కటే తిరని లోటుగా మారింది. పండండి బిడ్డ కోసం తిరగని ఆస్పత్రి లేదు మొక్కని దేవుడు లేడు. చివరికి వారి మొర ఆలకించి పన్నెండేళ్ల తర్వాత వారికి మగ బిడ్డ కలిగాడు. ఆ బిడ్డకు ఆయాన్ష్గా పేరు పెట్టుకుని ఆ పిల్లాడే లోకంగా .. అతని ఆలనా పాలానే జీవితంగా వందన బతుకుతోంది. గుండె పగిలే నిజం ఏడాది గడిచిన తర్వాత కూడా తల్లి పాలు తాగడానికి ఊపిరి తీసుకోవడానికి ఆయాన్ష్ ఇబ్బంది పడేవాడు. అనుమానం వచ్చిన ఆ దంపతులు వెంటనే వైద్యులను సంప్రదిస్తే గుండె పగిలే నిజం తెలిసింది. ఆయాన్ష్ను పరీక్షించిన డాక్టర్లు.. స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ (ఎస్ఎంఏ) అనే అరుదైన వ్యాధిగా గుర్తించారు. పది వేల మంది పిల్లలలో ఒక్కరికి ఈ తరహా సమస్య వస్తుంది. ఈ వ్యాధి బారిన పడ్డవారు సరిగా కూర్చోలేరు, నిలబడలేరు. ఎప్పుడూ నేలపైనే పడుకుని ఉంటారు. అలాగే వదిలేస్తే వేగంగా మృత్యువుకి చేరువ అవుతారు. రూ. 16 కోట్లు స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ (ఎస్ఎంఏ) చికిత్సకు ఔషధాలు ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేవు. వైద్యులు అంతా గాలించగా కేవలం అమెరికాలోనే జోల్జెన్స్మా అనే ఔషధం అందుబాటులో ఉన్నట్టుగా తేలింది. ఆ ఇంజక్షన్ ధర 2.14 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో అక్షరాల పదహారు కోట్ల రూపాయాలు. అంత ఖరీదైన మందు కొనే స్థోమత వందనా మదన్ దంపతులకే కాదు మన దేశంలో ఏ మధ్య తరగతి కుటుంబానికి కూడా ఉండదు. (Advertorial) చేయిచేయి కలుపుదాం ఓవైపు కన్న కొడుకును కబళిస్తున్న వ్యాధి, మరోవైపు చికిత్సకు అవసరమైన డబ్బు సర్థుబాటు చేయలేక ఆ తల్లిదండ్రులు సతమతం అవుతున్నారు. ఆయాన్ష్ మరణానికి చేరువ అవుతున్నారు. వారి ఇబ్బందిని చూసి బాలుడి చికిత్సకు అవసరమైన ఔషధం కొనేందుకు ఫండ్ రైజింగ్ సంస్థ కెట్టో ప్రయత్నాలు ప్రారంభించింది. సోనూసూద్, ఫర్హాన్ అక్తర్ వంటి సినీ ప్రముఖులను, కొందరు వ్యాపారవేత్తలను సంప్రదించింది. కొంత వరకు డబ్బు సమకూరింది. అయితే కావాల్సిన మొత్తం రూ. 16 కావడంతో ఇంకా సాయం కావాల్సిన అవసరం ఉంది. మనం చేసే చిన్న సాయం చిన్నారి ఆయాన్ష్ ఈ అందమైన లోకాన్ని చూసే అవకాశం కల్పిస్తుంది. ఆయాన్‌కి సాయం చేయాలనుకునే వారు కింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయండి -
అన్నదానంలో ప్లాస్టిక్ బియ్యం కలకలం?
ఆసిఫాబాద్ రూరల్: జిల్లాలోని ఓ అన్నదాన కార్యక్రమంలో ప్లాస్టిక్ బియ్యం వినియోగించారన్న వార్త కలకలం రేపుతోంది. ఆసిఫాబాద్ మండలంలోని గుండి గ్రామంలో ఆదివారం పులాజీ బాబా ధ్యాన పూజ కార్యక్రమంలో భాగంగా అన్నదానం నిర్వహించారు. భోజనం చేస్తున్న సమయంలో చిన్నారులు అన్నం తినలేక ఇబ్బందులు పడుతుండటంతో గమనించిన గ్రామస్తులు వండిన అన్నంతో పాటు బియ్యాన్ని పరిశీలించారు. అన్నం రబ్బరు మాదిరిగా ఉండటంతో ప్లాస్టిక్ బియ్యం ఉపయోగించారని ఆరోపిస్తూ బియ్యం అమ్మిన దుకాణం వద్ద బైఠాయించి యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రాజేశ్వర్ తెలిపారు. -
చిరంజీవి నివాసంలో సినీ ప్రముఖుల సమావేశం
-
చిరంజీవి ఇంట్లో సినీ పెద్దల భేటీ
సాక్షి, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నివాసంలో కరోనా క్రైసిస్ ఛారిటీ(సీసీసీ) సభ్యులు సమావేశమయ్యారు. పేద సినీ కార్మికుల సంక్షేమం కోసం చిరంజీవి ఆధ్వర్యంలో సీసీసీ ఆవిర్భవించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఛారిటీ ఆధ్వర్యంలో తొలి విడత సాయంగా నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. తాజాగా రెండో విడత సాయంపై చర్చించేందుకు శుక్రవారం చిరు ఇంట్లో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్. శంకర్, సి.కళ్యాణ్, బెనర్జీ, దామోదర్, తదితరులు చిరు నివాసానికి చేరుకున్నారు. కాగా, ఈ సమావేశంలోనే ప్రస్తుతం టాలీవుడ్లో నెలకొన్న పరిస్థితులుపై కూడా చర్చించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. చదవండి: బాలయ్య నోరు అదుపులో పెట్టుకో: నాగబాబు బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు.. -
‘మీరెవరు నన్ను అడగడానికి.. అది నా ఇష్టం’
టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ మరోసారి ఫైర్ అయ్యాడు. తనపై తప్పుడు వార్తలు రాస్తున్న పలు వెబ్సైట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వీడియో విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సెన్సేషన్‌గా మారింది. కరోనా కష్టకాలంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి కుటుంబాలకు సహాయం అందించేలా ‘ది దేవరకొండ ఫౌండేషన్’ స్థాపించి అందులో ‘మిడిల్ క్లాస్ ఫండ్’తో సహాయక కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే మధ్య తరగతి కుటుంబాలకు విజయ్ చేస్తున్న సాయంపై కొన్ని వెబ్సైట్లు తప్పుడు వార్తలు రాశాయి. విజయ్ దేవరకొండ పేద ప్రజలను అవమానిస్తున్నారని.. వెబ్సైట్ పెట్టి సాయం చేస్తున్నట్టు హంగామా చేస్తున్నారని అనేక వార్తలు రాశాయి. అంతేకాకుండా విజయ్ ఎందుకు విరాళం ఇవ్వడం లేదని ప్రశ్నిస్తూనే, చిరంజీవి ప్రారంభించిన కరోనా క్రైసిస్ చారిటీ(సీసీసీ)కి పోటీగా మిడిల్‌క్లాస్ ఫండ్‌ను విజయ్ ప్రారంభించారంటూ సదరు వెబ్‌సైట్స్ పేర్కొన్నాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన విజయ్ తాను చేస్తున్న సహాయక కార్యక్రమాలపై, ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిడిల్ క్లాస్ ఫండ్ ఏర్పాటు చేయడానికి గల కారణాలను క్షుణ్ణంగా వివరించాడు. ఇంటర్వ్యూలు, ప్రకటనలు ఇవ్వకపోవడంతోనే తనపై తప్పుడు వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. అదేవిధంగా ఫేక్ వార్తలు రాస్తున్న వారిని ఉద్దేశిస్తూ.. ఇలాంటి క్లిష్ట సమయంలో ఫేక్‌న్యూస్‌ని కాదు.. మంచిని పంచండి అంటూ విజ్ఞప్తి చేశాడు. విజయ్‌కు మద్దతుగా టాలీవుడ్ ప్రముఖులు పలు వెబ్సైట్లు తనపై చేస్తున్న దుష్ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విజయ్ దేవరకొండ విడుదల చేసిన వీడియో క్షణాల్లో వైరల్ అయింది. విజయ్‌కు మద్దతుగా టాలీవుడ్ ప్రముఖులు ట్వీట్లు చేశారు. విజయ్‌కి తాను అండగా నిలుస్తానని సూపర్‌స్టార్ మహేశ్ బాబు ట్వీట్ చేశాడు. మహేశ్‌తో పాటు రానా, కొరటాల శివ, అనిల్ రావిపూడి, వంశీపైడిపల్లి, అల్లరి నరేశ్, రవితేజ, హరీష్ శంకర్, క్రిష్ తదితరులు విజయ్‌కు బాసటగా నిలుస్తు ట్వీట్లు చేశారు. I stand by you brother @TheDeverakonda #KillFakeNews #KillGossipWebsites https://t.co/mk5enwj5Pm pic.twitter.com/ESYodVIQbw — Mahesh Babu (@urstrulyMahesh) May 4, 2020 I stand by you too @TheDeverakonda @urstrulyMahesh #KillFakeNews #KillGossipWebsites https://t.co/i5dq4vyODj — koratala siva (@sivakoratala) May 4, 2020 Am with you Vijay.... We all love you for ur on screen presence and we respect u for ur off screen work. Go ahead ... @TheDeverakonda more Power to you...... 🤗🤗🤗 https://t.co/HHBm2f2Vz9 — Harish Shankar .S (@harish2you) May 4, 2020 చదవండి: బుట్టబొమ్మకు పెదవి కలిపిన బుట్టబొమ్మ ఆర్జీవీ ట్వీట్.. మండిపడ్డ సింగర్! ‘నీలో ఏమాత్రం మార్పు లేదు’ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1081263436.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చారిటీ పేరుతో అడ్డంగా బుక్కైన నైజీరియన్ ముఠా
సాక్షి, విశాఖపట్నం : విశాఖలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఆన్లైన్ మోసాన్ని సైబర్ క్రైం పోలీసులు అడ్డుకున్నారు. చారిటీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కాగా అరైస్టైన వారిలో నలుగురు నైజీరియన్లతో పాటు మేఘాలయకి చెందిన ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వివరాలు.. విశాఖపట్నంలో నివసిస్తున్న సంజయ్ సింగ్ అనే వ్యక్తి ఒక నైజీరియన్ సంస్థ నుంచి రూ.39 కోట్ల తమ ఆస్తిని ఇండియాలో చారిటీ కోసం వినియోగించనున్నామంటూ మెయిల్ వచ్చింది. మీరు కూడా మీ వంతు సాయం చేయాలనుకుంటే అకౌంట్‌కు డబ్బు పంపించవచ్చంటూ అందులో పేర్కొంది. దీంతో మెయిల్‌కు స్పందించిన సంజయ్ సింగ్ తన వ్యక్తిగత వివరాలను పంపించాడు. దీంతో కస్టమ్స్,లీగల్ ఫార్మాలిటీస్ పేరుతో సంజయ్ సింగ్ వద్ద నుంచి పెద్ద మొత్తంలో గుంజడానికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో నైజీరియన్ ముఠా వలలో చిక్కుకున్న సంజయ్ రూ. 6.62 లక్షల రూపాయలను వివిధ అకౌంట్లకు పంపించాడు. తర్వాత వారి దగ్గర నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన సంజయ్ సింగ్ విశాఖ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నైజిరీయన్ ముఠాను ఢిల్లీలో అరెస్ట్ చేశారు. కాగా వీరికి సహకరించిన మేఘాలయ రాష్ర్టానికి చెందిన మహిళను కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నైజీరియన్ ముఠా నుంచి 55 వేల నగదు, రెండు లాప్‌టాప్‌లు, ఆరు మొబైల్ ఫోన్లు, ఏడు సిమ్‌కార్డులు, రెండు ఏటీఎం కార్డులు, పాస్‌పోర్టులు, వారి బ్యాంకు అకౌంట్లలో ఉన్న రూ. 1.46 లక్షల నగదును సీజ్ చేసనట్లు పోలీసులు వెల్లడించారు. -
దాతృత్వంలో భారత్ అధ్వాన్నం!
న్యూఢిల్లీ : భారత్ దాతృత్వంలో బాగా వెనకబడి పోతోంది. గత పదేళ్ల కాలంలో 128 దేశాల్లో భారత్‌కు 82వ స్థానం లభించడమే ఇందుకు ఉదాహరణ. భారతీయుల్లో ప్రతి మూడో వ్యక్తి అపరిచితుడికి సాయం చేయగా, ప్రతి నలుగురిలో ఒకరు డబ్బును దానం చేయగా, ప్రతి ఐదుగురిలో ఒకరు ఇతరుల కోసం స్వచ్ఛందంగా తమ సమయాన్ని కేటాయించారని ‘వరల్డ్ గివింగ్ ఇండెక్స్’ తన పదవ నివేదికలో వెల్లడించింది. దాతృత్వంలో భారత్, పొరుగునున్న పాకిస్థాన్, నేపాల్‌కన్నా వెనకబడి ఉంది. 128 దేశాల్లోని 13 లక్షల మంది అభిప్రాయాలను గత తొమ్మిదేళ్లుగా సేకరించి ‘వరల్డ్ గివింగ్ ఇండెక్స్’ ఈ వివరాలను వెల్లడించింది. ఇటీవల ఎప్పుడైనా అపరిచితులకు ఆర్థిక సహాయం చేశారా? చారిటీ సంస్థలకు సహాయం చేశారా? ఇతరుల సంక్షేమం కోసం స్వచ్ఛందంగా కృషి చేశారా? లాంటి ప్రశ్నల ద్వారా అధ్యయనకారులు తమకు కావాల్సిన సమాచారాన్ని సేకరించారు. ఇతర దేశాలకు సంబంధించి ‘గాలప్ వరల్డ్ పోల్’, ‘యూకే చారిటీ’ సంస్థల డేటాతో తమ సమాచారాన్ని అధ్యయనకారులు పోల్చి చూశారు. 2010లో దాతృత్వంలో భారత దేశ స్థానం 134 ఉండగా, గతేడాది గణనీయంగా 81 స్థానానికి చేరుకుంది. మళ్లీ ఈ ఏడాది ఒక స్థానం పెరిగి 82కు చేరుకుంది. అధ్యయన సంస్థ అన్ని విధాల లెక్కలేసి భారతీయులకు దాతృత్వంలో 26 శాతం మార్కులను కేటాయించింది. అదే అమెరికాకు అత్యధికంగా 58 శాతం మార్కులు ఇచ్చింది. ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిన చైనా కేవలం 16 శాతం మార్కులతో భారత్‌కన్నా ఎంతో వెనకబడింది. అపరిచుతులకు సహాయం చేయడం, డబ్బు దానం చేయడం, ఇతరుల సంక్షేమం కోసం స్వచ్ఛంగా సమయాన్ని కేటాయించడం.. మూడు కేటగిరీల్లో న్యూజిలాండ్ టాప్ టెన్‌లో నిలిచింది. భారత్‌లో పేదవాడు, పేదవాడికే సహాయం ఎక్కువ చేస్తున్నారని, ధనికుల వద్ద 21 లక్షల కోట్ల రూపాయలు మూలుగుతున్న వారు పెద్దగా అపరిచితులకు సహాయం చేయడం లేదని కూడా ఈ అధ్యయనంలో తేలింది. ముస్లింలు అధికంగా ఉన్న ఇండోనేసియా కూడా టాప్ టెన్‌లో ఉంది. అందుకు కారణం ఇతరులకు దానం చేయాలనే సూక్తి వారి ఇస్లాంలో ఉండడం, దాన్ని అక్కడి ప్రజలు బలంగా నమ్మడం. చాలా దేశాల్లో దాన గుణం ఎక్కువ, తక్కువ ఉండడానికి కారణం వారి సంస్కృతులు, మత విశ్వాసాలు, వాటి పట్ల ప్రజలకున్న నమ్మకాలే కారణమని అధ్యయనం తేల్చింది. -
ఆనందం.. విరాళం
తమ అభిమాన స్టార్స్‌ని కలవాలని ప్రతి అభిమాని కోరుకుంటాడు. అలా స్టార్స్‌ను ఫ్యాన్స్‌ను కలిపేలా ఓ ఈవెంట్ ఏర్పాటు చేసి దాన్ని చారిటీకి ఉపయోగించాలనుకుంటున్నారు అన్షులా కపూర్. ఇంతకీ అన్షులా కపూర్ ఎవరంటే.. నిర్మాత బోనీ కపూర్ మొదటి భార్య కుమార్తె. నటుడు అర్జున్ కపూర్ చెల్లెలు. నాన్న, అన్నలా సినిమాల్లోకి రాలేదు అన్షులా. అయితే సేవా కార్యక్రమాలు చేయడం తనకి చాలా ఇష్టం. ఇందులో భాగంగానే ‘ఫ్యాన్ కైండ్’ అనే ఆన్లైన్ ఫండ్ రైజింగ్ ప్లాట్‌ఫామ్‌ను స్థాపించారామె. మన అభిమాన స్టార్స్‌తో క్రికెట్, బేకింగ్, పింట్ బాల్.. ఇలా సరదాగా గేమ్స్ ఆడుకోవచ్చు. ఇందుకోసం 300 పెట్టి ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఈ టికెట్స్‌తో వచ్చిన డబ్బులో ఎక్కువ మొత్తం విరాళాలకు ఉపయోగిస్తారట. బాలీవుడ్ యాక్టర్స్ వరుణ్ ధవన్, ఆలియా భట్, సోనాక్షి సిన్హాలు ఈ ఫ్యాన్‌కైండ్ సంస్థతో అనుబంధమయ్యారు. ‘‘నీటి కొరత వల్ల ఈ ఏడాది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మా ఈవెంట్‌తో వచ్చిన డబ్బుని వాళ్లకు ఉపయోగపడేలా చేస్తాం’’ అని చెప్పుకొచ్చారు వరుణ్. ‘‘అభిమానులకు వాళ్ల ఆనంద క్షణాలు ఇస్తూనే అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని చెప్పారు అన్షులా కపూర్. -
సెయింట్ లూయిస్‌లో నాట్స్ సంగీత విభావరి
సెయింట్ లూయిస్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలుగు ఆట పాటలతో అమెరికాలో తెలుగువారికి మరింత దగ్గరవుతుంది. తాజాగా నాట్స్ ఎంవో ఛాప్టర్ సెయింట్ లూయిస్ విభాగం స్వరవేదిక పేరుతో సంగీత విభావరి నిర్వహించింది. నాట్స్ కోశాధికారి శ్రీనివాస్ మంచికలపూడి, హరీంద్ర గరిమెళ్ల, డాక్టర్ సుధీర్ అట్లూరి నాయకత్వంలో నిర్వహించిన ఈ సంగీత విభావరి విజయవంతంగా జరిగింది. ఖమ్మం జిల్లాలో నవీన మానసిక వికలాంగుల పునరావస కేంద్రానికి విరాళాలు సేకరించే ఉద్దేశంతో సంగీత విభావరి ఏర్పాటు చేశారు. దీనికి కృష్ణ అనుమోలు, స్వర్ణ గాడేపల్లి సహకరం అందించారు. పాడుతా తీయగా ఫేమ్ గాయనీ, గాయకులు ప్రవీణ్ కుమార్, ఇషానా, స్నిగ్థ, మానస, నేహ, ప్రియలు తమ గానంతో ఆకట్టుకున్నారు. ఈ విభావరికి నాట్స్ ఉచిత ప్రవేశం కల్పించింది. విందు కూడా ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను నాట్స్ అధ్యక్షుడు మోహనకృష్ణ వివరించారు. తెలుగు ప్రజలకు అమెరికాలో అండగా నిలవడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ చేపడుతున్న కార్యక్రమాలను నాట్స్ కోశాధికారి శ్రీనివాస్ మంచికలపూడి తెలిపారు. నాట్స్ నాయకులు సతీష్ ముమ్మనగండి, నాగ శ్రీనివాస్, చిన్న ముచ్చర్ల, కుమార్ రెడ్డి టి, సురేంద్ర బాచిన, రమేష్ బెల్లం, వైఎస్ఆర్ కే ప్రసాద్, కృష్ణ వల్లూరు, శివ మామిళ్లపల్లి, జగన్ వేజండ్ల, కాంతారావు మిన్నగంటి, తిరుమల రమేశ్ కొండముట్టి, రమేశ్ పేరూరు, సుదర్శన్ నాయుడు, అప్పలనాయుడు, రామ్మోహన్ జిల్లేల, నర్సీరెడ్డి ఉప్పునూరి తదితరులు ఈ సంగీత విభావరిని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. నాట్స్ లో తాము కూడా భాగస్వాములవుతామని ఈ సందర్భంగా చాలా మంది స్థానిక తెలుగువారు ముందుకొచ్చారు. ఈ సంగీత విభావరి ద్వారా దాదాపు ఐదు వేల డాలర్లను విరాళంగా నవీన మానసిక వికలాంగుల పునరావస కేంద్రానికి సమకూర్చారు. ఇదే వేదికపై స్వరవేదిక ఛైర్మన్ కృష్ణ అనుమోలును నాట్స్ ఎంఓ ఛాప్టర్ కో ఆర్డినేటర్ సతీష్ ముమ్మనగండి సత్కరించారు. నాట్స్ ప్రెసిడెంట్ ను మోహన్ కృష్ణ మన్నవను కూడా ఇదే వేదిక పై నాట్స్ నాయకులు ఘనంగా సత్కరించారు. టీఏఎస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పర్వతనేని, డాక్టర్ కాజ రామరావు, బాబు రాజేంద్రప్రసాద్ దండమూడి, విజయ్ బుడ్డి, శ్రీనివాస్ కొఠారు, వెంకట్ పంతే, గోపి ఉప్పల, సురేంద్ర బీరపనేని, శేషు, చంద్ర, డాక్టర్ రామకృష్ణ గొండి, కృష్ణగంటాజీ, వీరవెల్లిఆర్.కె, డాక్టర్ కూర్మనాథ్, సురేశ్ యలవర్తి, శ్రీనివాస్ ఐనపురపు, డాక్టర్ ధర్మవరపు, శ్రీనివాస్ అట్లూరి తదితర ప్రముఖులు ఈ సంగీత విభావరిలో పాల్గొన్నారు. -
టాటా ఆధ్వర్యంలో ‘సర్వ్ ఎ మీల్’
న్యూయార్క్ : తెలంగాణ అమెరికన్ తెలుగు అసోషియేషన్ (టాటా) ఆధ్వర్యంలో ‘సర్వ్ ఎ మీల్’ చారిటీ కార్యక్రమం ఏర్పాటుచేశారు. న్యూయార్క్‌లోని రొనాల్డ్ మెక్‌డొనాల్డ్ హౌజ్‌లో ఈ చారిటీ విందును ఏర్పాటు చేశారు. పసందైన వంటకాలతో వచ్చిన వారి ఆకలి తీర్చారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పీ.మల్లారెడ్డి, వీ.సుధాకర్, మాధవ రెడ్డి మిగతావారికి టాటా వారు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టాటా రీజనల్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.పాపిరెడ్డి, కో ఆర్డినేటర్ సత్యారెడ్డి, స్టాండింగ్ కమిటీ మెంబర్ ఆర్.పవన్, టాటా బోర్డ్ డైరెక్టర్స్ రంజిత్, శరత్, పణిభూషన్, మహిళా స్టాండింగ్ కమిటీ కో చైర్ పర్సన్ మాధవి, స్టాండింగ్ కమిటీ కో చైర్మెన్ అశోక్, కో ఆర్డినేటర్స్ ఉషా, మల్లిక్, సత్యారెడ్డి, యోగి, ప్రహ్లాద, హేమంత్, రమా, జయప్రకాష్, వాలంటీర్లు నాగశ్రీ, మౌనిక, శ్వేత, కరుణ, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పార్లమెంటేరియన్ల చేతిలో పాన్‌కేకులు!
వేషధారణను బట్టి ఫైవ్‌స్టార్ హోటల్ షెఫ్లలా ఉన్నారు కానీ నిజానికి వీళ్లు బ్రిటన్ ఎంపీలు. మరి ఆ చేతుల్లో పాన్లు, ఎగురుతున్న కేక్‌లు ఏమిటంటే... ఇదంతా ఒక చారిటీ ప్రోగ్రామ్. చేతిలో పాన్‌తో ఒక రొట్టెను గాల్లో ఎగరేస్తూ తిరిగి పట్టుకొంటూ పరిగెత్తడానికి వీళ్లు ప్రాక్టీస్ అవుతున్నారు. ప్రతియేటా బ్రిటన్ ఎగువసభ, దిగువసభకు చెందిన పార్లమెంటేరియన్లు ఒక టీమ్‌గా, పొలిటికల్ జర్నలిస్టులంతా మరో టీమ్‌గా ఈ రేస్‌లో పాల్గొంటారు. దీన్నే పాన్కేక్ రేస్ అని అంటారు. ఆనవాయితీ ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ కార్యక్రమం జరిగింది. రాజకీయ ప్రముఖులు పాల్గొనే షో కాబట్టి దీనికి మంచి ఆదరణ కనిపించింది. విరాళాలూ బాగానే పోగయ్యాయి.