సెయింట్ లూయిస్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలుగు ఆట పాటలతో అమెరికాలో తెలుగువారికి మరింత దగ్గరవుతుంది. తాజాగా నాట్స్ ఎంవో ఛాప్టర్ సెయింట్ లూయిస్ విభాగం స్వరవేదిక పేరుతో సంగీత విభావరి నిర్వహించింది. నాట్స్ కోశాధికారి శ్రీనివాస్ మంచికలపూడి, హరీంద్ర గరిమెళ్ల, డాక్టర్ సుధీర్ అట్లూరి నాయకత్వంలో నిర్వహించిన ఈ సంగీత విభావరి విజయవంతంగా జరిగింది. ఖమ్మం జిల్లాలో నవీన మానసిక వికలాంగుల పునరావస కేంద్రానికి విరాళాలు సేకరించే ఉద్దేశంతో సంగీత విభావరి ఏర్పాటు చేశారు. దీనికి కృష్ణ అనుమోలు, స్వర్ణ గాడేపల్లి సహకరం అందించారు. పాడుతా తీయగా ఫేమ్ గాయనీ, గాయకులు ప్రవీణ్ కుమార్, ఇషానా, స్నిగ్థ, మానస, నేహ, ప్రియలు తమ గానంతో ఆకట్టుకున్నారు. ఈ విభావరికి నాట్స్ ఉచిత ప్రవేశం కల్పించింది. విందు కూడా ఏర్పాటు చేసింది.
ఈ కార్యక్రమంలో నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను నాట్స్ అధ్యక్షుడు మోహనకృష్ణ వివరించారు. తెలుగు ప్రజలకు అమెరికాలో అండగా నిలవడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ చేపడుతున్న కార్యక్రమాలను నాట్స్ కోశాధికారి శ్రీనివాస్ మంచికలపూడి తెలిపారు. నాట్స్ నాయకులు సతీష్ ముమ్మనగండి, నాగ శ్రీనివాస్, చిన్న ముచ్చర్ల, కుమార్ రెడ్డి టి, సురేంద్ర బాచిన, రమేష్ బెల్లం, వైఎస్ఆర్ కే ప్రసాద్, కృష్ణ వల్లూరు, శివ మామిళ్లపల్లి, జగన్ వేజండ్ల, కాంతారావు మిన్నగంటి, తిరుమల రమేశ్ కొండముట్టి, రమేశ్ పేరూరు, సుదర్శన్ నాయుడు, అప్పలనాయుడు, రామ్మోహన్ జిల్లేల, నర్సీరెడ్డి ఉప్పునూరి తదితరులు ఈ సంగీత విభావరిని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.
నాట్స్ లో తాము కూడా భాగస్వాములవుతామని ఈ సందర్భంగా చాలా మంది స్థానిక తెలుగువారు ముందుకొచ్చారు. ఈ సంగీత విభావరి ద్వారా దాదాపు ఐదు వేల డాలర్లను విరాళంగా నవీన మానసిక వికలాంగుల పునరావస కేంద్రానికి సమకూర్చారు. ఇదే వేదికపై స్వరవేదిక ఛైర్మన్ కృష్ణ అనుమోలును నాట్స్ ఎంఓ ఛాప్టర్ కో ఆర్డినేటర్ సతీష్ ముమ్మనగండి సత్కరించారు. నాట్స్ ప్రెసిడెంట్ ను మోహన్ కృష్ణ మన్నవను కూడా ఇదే వేదిక పై నాట్స్ నాయకులు ఘనంగా సత్కరించారు. టీఏఎస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పర్వతనేని, డాక్టర్ కాజ రామరావు, బాబు రాజేంద్రప్రసాద్ దండమూడి, విజయ్ బుడ్డి, శ్రీనివాస్ కొఠారు, వెంకట్ పంతే, గోపి ఉప్పల, సురేంద్ర బీరపనేని, శేషు, చంద్ర, డాక్టర్ రామకృష్ణ గొండి, కృష్ణగంటాజీ, వీరవెల్లిఆర్.కె, డాక్టర్ కూర్మనాథ్, సురేశ్ యలవర్తి, శ్రీనివాస్ ఐనపురపు, డాక్టర్ ధర్మవరపు, శ్రీనివాస్ అట్లూరి తదితర ప్రముఖులు ఈ సంగీత విభావరిలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment