అన్నదానంలో ప్లాస్టిక్‌ బియ్యం కలకలం?  | Locals Alleges Plastic Rice At Charity Program In Asifabad Mandal | Sakshi
Sakshi News home page

అన్నదానంలో ప్లాస్టిక్‌ బియ్యం కలకలం? 

Published Mon, Mar 1 2021 2:38 PM | Last Updated on Mon, Mar 1 2021 2:46 PM

Locals Alleges Plastic Rice At Charity Program In Asifabad Mandal - Sakshi

బియ్యం షాప్‌ను పరిశీలిస్తున్న ఎస్‌ఐ

ఆసిఫాబాద్‌ రూరల్‌: జిల్లాలోని ఓ అన్నదాన కార్యక్రమంలో ప్లాస్టిక్‌ బియ్యం వినియోగించారన్న వార్త కలకలం రేపుతోంది. ఆసిఫాబాద్‌ మండలంలోని గుండి గ్రామంలో ఆదివారం పులాజీ బాబా ధ్యాన పూజ కార్యక్రమంలో భాగంగా అన్నదానం నిర్వహించారు. భోజనం చేస్తున్న సమయంలో చిన్నారులు అన్నం తినలేక ఇబ్బందులు పడుతుండటంతో గమనించిన గ్రామస్తులు వండిన అన్నంతో పాటు బియ్యాన్ని పరిశీలించారు. అన్నం రబ్బరు మాదిరిగా ఉండటంతో ప్లాస్టిక్‌ బియ్యం ఉపయోగించారని ఆరోపిస్తూ బియ్యం అమ్మిన దుకాణం వద్ద బైఠాయించి యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ రాజేశ్వర్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement