సాక్షి, హైదరాబాద్ : ఓ వైపు తెలంగాణ ఎన్నికల రణక్షేత్రం అంతకంతకూ వేడెక్కుతూ పూటకో మలుపులు తిరుగుతోంది. అయినప్పటికీ‘‘తెలంగాణ రాజకీయం పట్ల ఆసక్తి కలగడం లేదు. ఇక్కడ డ్రామా లేదు’’ అని తను గతంలో అన్న మాటల్ని పునరుద్ఘాటిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై వ్యూహం, శపధం సినిమా రూపొందిస్తున్న దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. యాపిల్ హోమ్ రియల్ నీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగనున్న మిక్స్ అండ్ మింగిల్ మెగా క్రిస్మస్ కార్నివాల్ పోస్టర్‌ని బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్కన్ హోటల్‌లో శనివారం రామ్‌గోపాల్ వర్మ విడుదల చేశారు. తొలిసారి ఒక సేవా కార్యక్రమానికి నిధుల సేకరణకు మద్ధతు తెలుపుతున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పటిలాగే తనదైన శైలిలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
సేవ చేయను..కానీ సపోర్ట్ చేస్తాను...
ఈ ఈవెంట్ ద్వారా వచ్చిన నిధులను మిషన్ భధ్రత పేరుతో సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారనే విషయాన్ని ప్రస్తావిస్తూ తాను వ్యక్తిగతంగా సేవ చేయననే మరోసారి చెప్పారు. అయితే చేసేవారికి మద్ధతు తెలపాలనే ఉద్దేశ్యంతోనే తొలిసారిగా ఈ తరహా ఈవెంట్‌కి వచ్చానన్నారు. అయితే ఇకపై కూడా ఇలా మద్ధతు ఇవ్వడం అనేది కొనసాగుతుందా అంటే నీలిమ ఆర్య ( కార్యక్రమ నిర్వాహకురాలు) లాంటి ఫ్రెండ్ అడిగితే కావచ్చునన్నారు.
ఆసక్తి ఆంధ్రపైనే...
తెలంగాణ రాజకీయాల్లో డ్రామా లేదని, అందుకే తాను ఇక్కడి విషయాలు అసలు పట్టించుకోవడం లేదని అంటున్నారు వర్మ. ఆంధ్ర రాజకీయాలే తప్ప తెలంగాణ రాజకీయాలపై సినిమాలు ఎందుకు తీయడం లేదు అన్న ప్రశ్నకు బదులిస్తూ తన కాన్సన్‌ట్రేషన్ అంతా ఆంధ్రప్రదేశ్ మీదే ఉందన్నారు. ఇలాంటి ఈవెంట్లకు రావడం ద్వారా సమాజానికి భిన్నంగా ఉండే తన జీవనశైలి నుంచీ తాను కాస్త బయటపడుతున్నట్టుగా సాధారణ జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్టుగా అనుకోవచ్చునా అనే ప్రశ్నకు ఆయన బదులిస్తే... అది కేవలం అపోహ మాత్రమేనని తాను ఎన్నటికీ మారనని స్పష్టం చేశారు.
వర్మ మేకప్‌తో, మెదడుతో మాట్లాడరు...
అందుకే ఈ కార్యక్రమానికి వివాదాస్పద దర్శకుడు, సేవా కార్యక్రమాల పట్ల బహిరంగంగానే విముఖత చూపే రామ్‌గోపాల్ వర్మ అనే దర్శకుడ్ని ఎంచుకోవడం పట్ల ఆయన ఫ్రెండ్ నీలిమ ఆర్య స్పందించారు. ఆయన ముఖానికి మేకప్ ఉండదని, అంతేకాదు ఆయన మైండ్‌తో కాకుండా హృదయంతో మాట్లాడతారని అందుకే తాను ఆయన్ను ఎంచుకున్నానని చెప్పారు. మిషన్ భధ్రత పేరుతో అమ్మాయిలకు ఇన్నర్‌వేర్ ఉచితంగా పంపిణీ చేయబోతూ, నిధుల సేకరించే ఈవెంట్‌కి వర్మను పిలవడం ట్రోల్స్‌కు గురవదా? అంటే అయినా పర్లేదు అనుకున్నానని, ఈ విషయమై వర్మ కూడా ముందే తనను హెచ్చరించారని నీలిమ స్పష్టం చేశారు. అయితే తాను వర్మ విషయంలో నమ్మిన దానికి తగ్గట్టుగా మాత్రమే నడుచుకున్నానన్నారు. ఆయనను మరిన్ని చారిటీ ఈవెంట్లకు కూడా పిలిచే అవకాశం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment