చిరంజీవి ఇంట్లో సినీ పెద్దల భేటీ | CCC Members Meeting AT Chiranjeevi Home In Hyderabad | Sakshi
Sakshi News home page

చిరు నివాసంలో సినీ పెద్దల సమావేశం

Published Fri, May 29 2020 11:43 AM | Last Updated on Fri, May 29 2020 12:32 PM

CCC Members Meeting AT Chiranjeevi Home In Hyderabad - Sakshi

ఫైల్‌ ఫోటో

సాక్షి, హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి నివాసంలో కరోనా క్రైసిస్‌ ఛారిటీ(సీసీసీ) సభ్యులు సమావేశమయ్యారు. పేద సినీ కార్మికుల సంక్షేమం కోసం చిరంజీవి ఆధ్వర్యంలో సీసీసీ ఆవిర్భవించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఛారిటీ ఆధ్వర్యంలో తొలి విడత సాయంగా నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. తాజాగా రెండో విడత సాయంపై చర్చించేందుకు శుక్రవారం చిరు ఇంట్లో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్‌. శంకర్‌, సి.కళ్యాణ్‌, బెనర్జీ, దామోదర్‌, తదితరులు చిరు నివాసానికి చేరుకున్నారు. కాగా, ఈ సమావేశంలోనే ప్రస్తుతం టాలీవుడ్‌లో నెలకొన్న పరిస్థితులుపై కూడా చర్చించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. 

చదవండి:
బాలయ్య నోరు అదుపులో పెట్టుకో: నాగబాబు
బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement