లాస్‌వెగాస్ : తెలంగాణ అమెరికా తెలుగు సంఘం(టాటా) నూతన అధ్యక్షునిగా విక్రమ్ రెడ్డి జనగామ నియమితులయ్యారు. లాస్‌వెగాస్‌లోని ఆరియా కన్వెన్షన్ సెంటర్‌లో డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన బోర్డు మీటింగ్‌లో సుమారు 150 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. టాటా ప్రెసిడెంట్‌గా విక్రమ్ జనగామను అడ్వైజరీ కౌన్సిల్ ఎంపిక చేసింది. టాటా మాజీ అధ్యక్షులు డా. హరనాత్ పొలిచర్ల తన హయాంలో టాటా సాధించిన లక్ష్యాలను వివరించారు. టాటాకు హరనాథ్ అందించిన సేవలను టాటా సభ్యులు కొనియాడారు.
తనకు మద్దతుగా నిలిచిన సభ్యులందరికీ విక్రమ్ ధన్యవాదాలు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా వంశీ రెడ్డి, జనరల్ సెక్రటరీగా శ్రీనివాస్ గానగోని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మహేశ్ ఆదిభట్ల, ట్రెజరర్‌గా రంజీత్ క్యాటం, జాయింట్ సెక్రటరీ నీలోహిత కొత్త, జాయింట్ ట్రెజరర్‌గా సురేశ్ వెంకన్నగారి, ఇంటర్నేషన్ వైస్ ప్రెసిడెంట్ హరీందర్ తాళ్లపళ్లి, ఎగ్జిక్యూటివ్ కో ఆర్డినేటర్‌గా శ్రీనివాస్ మనప్రగాడలు ఎన్నికయ్యారు.
టాటా నూతన అధ్యక్షునిగా విక్రమ్ రెడ్డి
Published Tue, Jan 22 2019 3:44 PM | Last Updated on Tue, Jan 22 2019 4:07 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment