
అట్లాంటా : అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్యర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళా దినోత్సవం సదర్భంగా అట్లాంటా ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో టాలీవుడ్ సింగర్ అంజనా సౌమ్యతో పాలు పలువురు సింగర్స్ పాల్గొని తమ ఆట, పాటలతో ఆహుతులను అలరించారు. మూడు వందలకు పైగా మహిళలు ఈ ఈవెంట్లో పాల్గొని మహిళా సాధికారత గురించి చర్చించారు.
ఆటా అధ్యక్షుడు మరునాలా అసిరెడ్డి, బోట్స్ అనిల్ బోడిరెడ్డి, వేణు పిసికే, రీజనల్ కో ఆర్డినేటర్ శివ రామడుగులు మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నేతృత్వంలో డల్లాస్‌లో మే 31, జూన్ 1, జూన్ 2 తేదీల్లో మూడు రోజుల పాటు జరగనున్న కన్వెన్షన్‌కు హాజరుకావాల్సిందిగా తెలుగువారిని ఆహ్వానించారు. మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మహిళలకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.



Comments
Please login to add a commentAdd a comment