వీరే ‘ఆటా’ నవలల పోటీ విజేతలు | ATA Novel Competition Results | Sakshi
Sakshi News home page

వీరే ‘ఆటా’ నవలల పోటీ విజేతలు

Published Thu, Jun 16 2022 12:51 PM | Last Updated on Sat, Jun 18 2022 1:34 PM

ATA Novel Competition Results - Sakshi

తెలుగు భాషా, సాహిత్యంపైన మక్కువతో అమెరికా తెలుగు సంఘం (ఆటా)  నిర్వహించిన నవలల పోటీకి ప్రపంచం నలుమూలల నుండి దాదాపుగా 70 వరకూ నవలలు వచ్చాయి. అనేక పరిశీలనలూ, వడ పోతల తర్వాత ఈ దిగువ నవలలకు బహుమతి మొత్తాన్ని సమానంగా పంచాలని న్యాయనిర్ణేతలు నిర్ణయించారు. బహుమతి పొందిన నవలలు  పగులు (తాడికొండ శివకుమార శర్మ, వర్జీనియా),  కొంతమంది... కొన్నిచోట్ల... (వివిన మూర్తి, బెంగళూరు)గా ఉన్నాయి.

విజేతలకు చెరి లక్ష రూపాయలు బహుమతిగా అందివ్వనున్నారు. ఈ రెండు నవలలను ‘ఆటా’ త్వరలో ప్రచురిస్తుంది. ఈ పోటీలో పాల్గొన్న ప్రతీ రచయితకీ, రచయిత్రికీ మా ఆటా కార్యవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఈ పోటీ నిర్వహణలో మాకు ఎంతో సహకరించి, న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన రమణమూర్తి, స్వాతికుమారి, అనిల్‌ రాయల్, పద్మవల్లి గార్లకు ప్రత్యేక ధన్యవాదాలని ఆటా పేర్కొంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement