ఉత్తర అమెరికాలోని తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(టాటా) రెండో వార్షికోత్సవ వేడుకలను డల్లాస్‌లోని బిర్యానీపాట్@హిల్‌టాప్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. టాటాను ఫార్మసీ రంగ ప్రముఖుడు పైళ్ల మల్లారెడ్డి స్ధాపించారు. గత రెండేళ్లలో టాటా అనేక సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించింది. టాటా డల్లాస్ ప్రాంతీయ అధ్యక్షురాలు సమీరా ఇల్లెందుల మాట్లాడుతూ.. సంస్ధ వార్షికోత్సవ వేడుకలను తొలుత ఏప్రిల్‌లో నిర్వహించాలని భావించనట్లు చెప్పారు.
అనివార్య కారణాల వల్ల ఫిబ్రవరిలోనే కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వచ్చినా అందరూ హాజరైనందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత టాటా గత రెండేళ్లలో నిర్వహించిన సామాజిక కార్యక్రమాలపై వీడియోను ప్లే చేశారు. టాటా కార్యదర్శి విక్రమ్ ఆర్ జనగాం వార్షికోత్సవ కమిటీల గురించి వివరించగా.. ఈవెంట్ కో-ఆర్డినేటర్ మహేష్ ఆదిభట్ల కమిటీల సభ్యులను పరిచయం చేశారు. సమీరా ఇల్లెందుల, మహేందర్ కామిరెడ్డి, మనోహర్ కసగాని, శాంతి నూతి, రూప, రోజా ఆదెపు, షకేర్ బ్రహ్మదేవర, సంతోష్ కోరె, రత్నా, సతీష్ నాగిల్ల, సురేష్ పథనేని, పవన్ గంగాధర, చంద్ర పోలీస్, శ్యాం పాటి, పద్మ శ్రీ తోటలు కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు.
డా.పైళ్ల మల్లారెడ్డి ఆదర్శాల మేరకు టాటాను సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల ఆర్గనైజేషన్లలో అత్యున్నత స్ధాయికి తీసుకెళ్లాలని, అందుకు జాతీయ, స్ధానిక తెలుగు ఆర్గనైజేషన్లు సహకారం అందించాలని మహేష్ ఆదిభట్ల, విక్రమ్ జనగాంలు కోరారు. వార్షికోత్సవం విజయవంతం కావడానికి కృషి చేసిన అడ్వైజరీ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, నేషనల్ టీం తదితరాలకు మహేష్ ఆదిభట్ల ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రామానికి టాంటెక్స్, టీపాడ్, డాటా, తానా, అటా, నాటా, నాట్స్, ఐటీ సర్వ్ తదితర కమ్యూనిటీ లీడర్లు హాజరయ్యారు. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(టీపాడ్) టాటా రెండో వార్షికోత్సవానికి స్పాన్సర్‌షిప్ వహించిన తొలి డైమండ్ పార్ట్‌నర్. కార్యక్రమానికి టీపాడ్ ఇచ్చిన మద్దతుకు విక్రమ్ జనగాం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.