second anniversary
-
వేగా శ్రీ రెండో వార్షికోత్సవం గోల్డ్ అండ్ డైమండ్స్ స్పెషల్ కలెక్షన్స్ (ఫోటోలు)
-
ట్రెండ్ సృష్టించిన జియో : హ్యాపీ బర్త్‌డే
ముంబై : సరిగ్గా రెండేళ్ల క్రితం.. టెలికాం మార్కెట్‌ను హడలెత్తిస్తూ ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియోను ఎవరూ మర్చిపోయి ఉండరు. ముఖ్యంగా యువత. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గారాలపట్టి ఇషా అంబానీ, పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ ఆలోచన... జియో రూపంలో ఓ సంచలనానికి తెరలేపింది. ఆ క్షణాన మొదలైన జియో ట్రెండ్... ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దేశీయ మార్కెట్లోనే కాకుండా... ప్రపంచవ్యాప్తంగా జియో తానేంటో నిరూపించుకుంటూ.. అంతకంతకు పెరిగిపోతూనే ఉంది. నేడు(సెప్టెంబర్ 5) రిలయన్స్ జియో తన రెండో వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో ఇప్పటి వరకు దేశీయ టెలికాం సర్వీసులపై చూపిన ప్రభావమెంతో ఓ సారి తెలుసుకుందాం... జియో ఎంట్రీ తర్వాత మొబైల్ డేటా వినియోగం భారత్‌లో నెలకు 20 కోట్ల జీబీ నుంచి 370 కోట్ల జీబీకి పెరిగింది. కేవలం జియో కస్టమర్లే 240 కోట్ల జీబీ డేటాను వినియోగిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. జియో లాంచ్ అయిన నెలల్లోనే, ప్రపంచంలోనే నెంబర్ కంపెనీగా ఎదిగింది. కేవలం 170 రోజుల్లో 10 కోట్ల మంది కస్టమర్లను తన సొంతం చేసుకుంది. ప్రతి సెకనుకు ఏడుగురు కస్టమర్లను జియో తన ఖాతాలో వేసుకుంది. ఇలా తన నెట్‌వర్క్‌ను పెంచుకుంటూ పోతూ.. 2018 జూన్ 30 నాటికి 21.5 కోట్ల మందికి పైగా కస్టమర్లను చేరుకుంది. భారత్‌లో ఎల్టీఈ కవరేజ్ ఎక్కువగా జియోకే ఉంది. 99 శాతం భారత జనాభాను త్వరలో జియోనే కవర్ చేయబోతుంది. అన్ని టారిఫ్ ప్లాన్లపై ఉచిత అపరిమిత కాలింగ్ ఆఫర్ చేసిన కంపెనీ జియోనే. అప్పటి వరకు ఏ కంపెనీ కూడా అలా ఆఫర్ చేయలేదు. జియో తీసిన ఈ అపరిమిత సంచలనంతో, మిగతా అన్ని కంపెనీలు కూడా ఉచితాల బాట పట్టాయి. డేటాను ధరలను కూడా తగ్గించాయి. జియో లాంచ్ తర్వాత, 250 రూపాయల నుంచి 10వేల రూపాయల మధ్యలో ఉన్న ఒక్క జీబీ డేటా ధర, ప్రస్తుతం 15 రూపాయలకు తగ్గింది. అంటే అంతకముందు డేటా ఛార్జీల బాదుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జియో లాంచింగ్ తర్వాత డేటా ధరలు భారీగా కుప్పకూలి, సామాన్యుడికి చేరువలో ఇంటర్నెట్ వచ్చేసింది. ఇప్పటికీ కూడా జియో తీసుకొస్తున్న కొత్త కొత్త టారిఫ్ ప్లాన్లతో ఇతర టెల్కోల గుండెల్లో పరుగులు పెడుతున్నాయి. ఆయా కంపెనీలు కూడా జియో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టిన వెంటనే, దానికి కౌంటర్‌గా టారిఫ్ ధరలను తగ్గిస్తూ పోతున్నాయి. ఇలా టెలికాం మార్కెట్లో అసాధారణమైన పోటీ నెలకొంది. జియో దెబ్బకు చాలా కంపెనీలు మూత పడటం, మరికొన్ని కంపెనీలు విలీనమవడం జరిగింది. 4జీ నెట్వర్క్ కవరేజ్‌లో జియోనే ఆధిపత్య స్థానంలో ఉన్నట్టు ట్రాయ్ స్పీడ్‌టెస్ట్ పోర్టల్ వెల్లడించింది. జియో ఎంట్రీ అనంతరం, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు యూజర్ బేస్ పెరిగింది. అంటే పరోక్షంగా ఈ కంపెనీలకు కూడా జియో బాగా సహకరించింది. జియో కార్యకలాపాలు లాంచ్ అయినప్పటి నుంచి గూగుల్, ఫేస్‌బుక్‌లకు భారత్ మోస్ట్ యాక్టివ్ మార్కెట్‌గా మారింది. ఎల్వైఎఫ్ బ్రాండ్ కింద వాయిస్ఓవర్ ఎల్టీఈ డివైజ్‌లను కూడా రిలయన్స్ రిటైల్ లాంచ్ చేసింది. జియో అరంగేట్రం తర్వాత ఈ డివైజ్‌ల సరుకు రవాణా పెరిగింది. ఫీచర్ ఫోన్ మార్కెట్లోనూ జియో సంచలనానికి తెరలేపింది. జియోఫోన్ పేరుతో కొత్త ఫీచర్ ఫోన్‌ను ప్రవేశపెట్టి, మరింత మంది కస్టమర్లను ఆకట్టుకుంది. ఇటీవలే ఫీచర్ ఫోన్లో హైఎండ్ మోడల్ జియోఫోన్ 2ను కూడా ఆవిష్కరించింది. దీంతో పాటు బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లోకి జియో అడుగుపెట్టింది. జియో గిగాఫైబర్ పేరుతో ఫైబర్ ఆధారిత వైర్‌లైన్ కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకొచ్చింది. 2018 ఆగస్టు 15 నుంచి దీని రిజిస్ట్రేషన్లను కూడా ప్రారంభించింది. భారత్‌ను గ్లోబల్‌గా ఆధిపత్య స్థానంలో నిల్చోబెట్టడమే లక్ష్యంగా జియో ముందుకు సాగుతుందని ఆ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ పలుమార్లు పునరుద్ఘాటించారు. -
ఘనంగా టాటా రెండో వార్షికోత్సవ వేడుకలు
ఉత్తర అమెరికాలోని తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(టాటా) రెండో వార్షికోత్సవ వేడుకలను డల్లాస్‌లోని బిర్యానీపాట్@హిల్‌టాప్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. టాటాను ఫార్మసీ రంగ ప్రముఖుడు పైళ్ల మల్లారెడ్డి స్ధాపించారు. గత రెండేళ్లలో టాటా అనేక సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించింది. టాటా డల్లాస్ ప్రాంతీయ అధ్యక్షురాలు సమీరా ఇల్లెందుల మాట్లాడుతూ.. సంస్ధ వార్షికోత్సవ వేడుకలను తొలుత ఏప్రిల్‌లో నిర్వహించాలని భావించనట్లు చెప్పారు. అనివార్య కారణాల వల్ల ఫిబ్రవరిలోనే కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వచ్చినా అందరూ హాజరైనందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత టాటా గత రెండేళ్లలో నిర్వహించిన సామాజిక కార్యక్రమాలపై వీడియోను ప్లే చేశారు. టాటా కార్యదర్శి విక్రమ్ ఆర్ జనగాం వార్షికోత్సవ కమిటీల గురించి వివరించగా.. ఈవెంట్ కో-ఆర్డినేటర్ మహేష్ ఆదిభట్ల కమిటీల సభ్యులను పరిచయం చేశారు. సమీరా ఇల్లెందుల, మహేందర్ కామిరెడ్డి, మనోహర్ కసగాని, శాంతి నూతి, రూప, రోజా ఆదెపు, షకేర్ బ్రహ్మదేవర, సంతోష్ కోరె, రత్నా, సతీష్ నాగిల్ల, సురేష్ పథనేని, పవన్ గంగాధర, చంద్ర పోలీస్, శ్యాం పాటి, పద్మ శ్రీ తోటలు కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు. డా.పైళ్ల మల్లారెడ్డి ఆదర్శాల మేరకు టాటాను సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల ఆర్గనైజేషన్లలో అత్యున్నత స్ధాయికి తీసుకెళ్లాలని, అందుకు జాతీయ, స్ధానిక తెలుగు ఆర్గనైజేషన్లు సహకారం అందించాలని మహేష్ ఆదిభట్ల, విక్రమ్ జనగాంలు కోరారు. వార్షికోత్సవం విజయవంతం కావడానికి కృషి చేసిన అడ్వైజరీ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, నేషనల్ టీం తదితరాలకు మహేష్ ఆదిభట్ల ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రామానికి టాంటెక్స్, టీపాడ్, డాటా, తానా, అటా, నాటా, నాట్స్, ఐటీ సర్వ్ తదితర కమ్యూనిటీ లీడర్లు హాజరయ్యారు. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(టీపాడ్) టాటా రెండో వార్షికోత్సవానికి స్పాన్సర్షిప్ వహించిన తొలి డైమండ్ పార్ట్నర్. కార్యక్రమానికి టీపాడ్ ఇచ్చిన మద్దతుకు విక్రమ్ జనగాం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
పాట విడుదల చేసిన మోదీ!
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వ విజయాలపై రాసిన పాటను విడుదల చేశారు. 'నా దేశం మారుతోంది. ముందుకు దూసుకుపోతోంది' అనే పదాలతో ప్రారంభమయ్యే పాటలో ఆద్యంతం బీజేపీ రెండేళ్ల విజయ ప్రస్థానాన్ని ప్రస్తావించారు. జన్ ధన్ యోజన, బేటీ బచావో బేటీ పడావో పథకాలు ప్రజల జీవితాల్లో తెచ్చిన మార్పులను క్షుణ్ణంగా వివరించారు. అంతేకాకుండా, కేంద్రమంత్రులు ఒక్కొక్కరిగా దూరదర్శన్, మీడియా సంస్థలకు వార్షికోత్సవ సందర్భంగా ఇంటర్వూలను ఇస్తున్నారు. సమాచారం మంత్రిత్వ శాఖ, పార్లమెంటు సభ్యులు వివిధ శాఖల విజయాలను ప్రజల్లోకి తీసుకుపోనున్నారు. -
తెలం‘గానం’ కోసమే తొలి లాఠీ దెబ్బ
కొడుకు జ్ఞాపకాల్లో బతుకుతున్న తల్లి నేడు మావోయిస్టు నేత కిషన్‌జీ రెండో వర్ధంతి పెద్దపల్లి, న్యూస్‌లైన్: సమసమాజ స్థాపన కోసం మూడున్నర దశాబ్దాలు పాలకుల గుండెల్లో నిద్రించిన విప్లవయోధుడు మల్లోజుల కోటేశ్వర్రావు అలియాస్ కిషన్‌జీ. సాయుధ పోరాటంలో శిఖరమంత ఎత్తు ఎదిగి.. పోలీసుల తూటాలకు కుప్పకూలిన కోటేశ్వర్ రావు విప్లవ బాట పట్టేందుకు తెలంగాణ భావజాలమే బీజాలు నాటింది. విద్యార్థి దశలోనే కోటేశ్వర్రావు తెలంగాణ ఉద్యమం లో చురుకుగా పాల్గొన్నారు. నాటి పీపుల్స్ వార్ నుంచి..నేటి మావోయిస్టు పార్టీకి మూల స్తంభంగా ఎదిగిన కోటేశ్వర్రావు పాతికేళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపారు. ప్రహ్లాద్, కిషన్‌జీ పేర్లతో పలు రాష్ట్రాల్లో విప్లవ ఉద్యమాన్ని నడిపించారు. కుటుంబమే ధిక్కార స్వరం... కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన మల్లోజుల కోటేశ్వర్రావు కుటుంబ సభ్యులందరిది ధిక్కార స్వరమే. ఆయన తండ్రి మల్లోజుల వెంకటయ్య తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. రజాకార్లను ఎదురొడ్డిన ధీరుడు. తండ్రి అడుగుజాడల్లో నడచిన కోటేశ్వర్రావు, ఆయన తమ్ముడు వేణుగోపాల్‌రావు ఆనాడే సమైక్య పాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా గళమెత్తారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి నియమనిష్టలతో జీవనం సాగించాల్సిన అన్నదమ్ములు దళిత, బహుజన బానిస బతుకుల విముక్తి కోసం తుపాకీ పట్టారు. తల్లి మధురమ్మ కూడా భర్తతో పాటు రజాకార్లను ఎదురించింది. రజాకార్లతో జరిగిన సమరంలో వెంకటయ్య అజ్ఞాతవాసం వెళ్లి, జైలు పాలయ్యారు. హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనమైన తర్వాత విడుదలయ్యారు. అప్పటినుంచి వెంకటయ్య కుటుంబం పదిహేనేళ్లపాటు ప్రశాంతంగా ఉంది. 1969లో జై తెలంగాణ సభ తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న క్రమంలో వెంకటయ్యతో పాటు ఆయన కొడుకులు కోటేశ్వర్రావు, వేణుగోపాల్‌లు ఉద్యమగొంతుకలై సర్కారును నిలదీశారు. 1969లో టీపీఎస్(తెలంగాణ ప్రజా సమితి) నాయకత్వాన పెద్దపల్లి జూనియర్ కళాశాల మైదానంలో జై తెలంగాణ సభపై పోలీసులు దాడి చేసి, లాఠీచార్జి చేశారు. నాడు మల్లోజు కోటేశ్వర్‌రావుతో పాటు మరికొందరు యువకులు జైలు పాలయ్యారు. మిగిలినవారు విడుదల కాగా, కోటేశ్వర్రావు జైల్లోనే ఎక్కువ కాలం గడిపి విప్లవ రాజకీయాలవైపు ఆకర్షితులయ్యారు. 1975 ఎమర్జెన్సీ కాలంలో రమేజాబీ, జిజియాబాయి అనే మిహళలు పోలీసుల లైంగికదాడికి గురయ్యారు. ఈ సంఘటనకు నిరసనగా విద్యార్థి సంఘాలు బస్సును దగ్ధం చేశాయి. ఈ కేసులో కోటేశ్వర్రావు మరోసారి అరెస్టయి వరంగల్ జైలుకు వెళ్లారు. తెలుగు మహాసభ, విరసం వంటి సంస్థలతో కొనసాగిన అనుబంధంతో కోటేశ్వర్రావు విప్లవోద్యమానికి మరింత దగ్గరయ్యారు. అప్పటి నుంచి విప్లవోద్యమంలో అనేక బాధ్యతలు నిర్వహించారు. సమ సమాజ స్థాపన కోసం ఎక్కుపెట్టిన ఆయుధంతో పాల కుల గుండెల్లో నిద్రించిన కిషన్‌జీని పట్టుకోవడానికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు 36 ఏళ్లు పట్టింది. 2011 డిసెంబర్ 24న బెంగాల్ రాష్ట్రంలోని మిద్నాపూర్‌లోని కలోని అడవుల్లో కేంద్ర బలగాల చేతిలో హతమయ్యారు. హైదరాబాద్‌లో నేడు వర్ధంతి సభ.. ఈనెల 24తో కిషన్‌జీ ఎన్కౌంటర్లో అమరుడై రెండేళ్లు నిండుతున్నాయి. ఆయన రెండో వర్ధంతి సభను హైదరాబాద్‌లో పౌర హక్కుల సంఘాలు, విరసం సంయుక్తంగా నిర్వహిస్తుం డగా తిథి, వార నక్షత్రం ప్రకారం డిసెంబర్ 2న ఆయన కుటుం బ సభ్యులు రెండో వర్ధంతి జరుపుతున్నారు. రాష్ట్రం చూడకముందే పొట్టన పెట్టుకున్నరు.. కొడుకును చెంప మీద ఒక్క దెబ్బ కొట్టకుండా పెంచుకున్న.. జై తెలంగాణ అంటూ టీపీఎస్ మీటింగ్‌కు వెళ్లి పోలీసుల నుంచి దెబ్బలు తిని జైలుకు వెళ్లారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రావడంతో నా కొడుకు పడ్డ శ్రమకు, వాడు తిన్న లాఠీ దెబ్బలు వృథా పోలేదు. కాని తెలంగాణ రాష్ట్రం చూడకముందే కొడుకు కోటన్నను సర్కారు పొట్టనబెట్టుకుంది. మాయన వెంకటయ్య తెలంగాణ రజాకార్ల పోరాటం చేసి స్వాతంత్య్రాన్ని చూశారు. స్వాతంత్య్ర సమరయోధులుగా నలుగురిలో సంతోషంగా గడిపారు. కాని కొడుకు కోరుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక్క పూటయినా గడపకపోవడం విషాదం. ఆదివారంతో కొడుకు మరణించి రెండేళ్లు అవుతుంది. కొడుకు చిన్ననాటి జ్ఞాపకాలు ఇంకా మదినిండా కదులుతున్నాయి. అన్న వెనుకే నా చిన్న కొడుకు వేణు కూడా అడవిలోకి పోయింది. అడవిలో ఉన్న చిన్న కొడుకు వేణును ఒక్కసారి చూడాలని ఉంది. - మల్లోజుల కోటేశ్వర్రావు తల్లి మధురమ్మ