తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ సేవా డేస్ కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించింది టీటీఏ టీమ్. తుమ్మంపేట గ్రామంలో పలు సేవాకార్యక్రమాలు చేపట్టారు. టీటీఏ నాయకులు సైదులు స్వగ్రామంలో ప్రభుత్వ స్కూల్కు స్టేజ్ నిర్మాణం పూర్తి చేసి పాఠశాలకు అందించారు. టీటీఏ నాయకులను ఉపాధ్యాయులు, గ్రామస్థులు శాలువాతో సన్మానించారు. స్కూల్ అభివృద్ధిలో సహాయసహాకారాలు అందిస్తున్న టీటీఏ బృందానికి టీచర్లతో పాటు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ వల్ల విద్యార్థులకు ఇన్స్పిరేషన్ గా ఉన్నటీటీఏ సంస్థను గ్రామస్థులు, పలువురు నాయకులు ప్రసంశించారు.
రానున్న రోజుల్లో ఈ స్కూల్ ను దత్తత తీసుకోనున్నామని టీటీఏ సభ్యులు తెలిపారు. ప్రిన్సిపాల్ అడిగిన గ్రీన్ బోర్డ్ త్వరలో అందిస్తామని ప్రామిస్ చేశారు. చదువులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో పాటు ధైర్య ప్రదర్శన చేసిన పిల్లలకు మోమొంటోలు, ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. చదువులో ప్రతిభ కనబరిచిన ప్రతి క్లాస్ లో ముగ్గురు విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ లు పంపిణీ చేసారు. ఇక కార్యక్రమానికి సహకరించిన ప్రతిఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. గణిత శాస్త్ర నిపుణులు రామానుజం జయంతి సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన గణిత ప్రయోగాలను టీటీఏ నాయకులు మనోహర్, నరసింహ పేరుక తిలకించారు. ఇక విద్యార్థుల ప్రతిభకు అబ్బురపడి పిల్లలను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
(చదవండి: 'టీటీఏ' ఆధ్వర్యంలో దివ్యాంగులకు వీల్‌చైర్స్ పంపిణీ)
Comments
Please login to add a commentAdd a comment