
సియాటెల్: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోషియేషన్(టాటా) సియాటెల్ విభాగం ఆధ్వర్యంలో ‘ది సోఫియా వే’లో ఫుడ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. ది సోఫియా వే అనేది ఆవాసం లేని మహిళలకు షెల్టర్ కల్పిస్తుంది. ఈ కార్యక్రమానికి టాటా సియోటెల్ కమ్యూనిటీ నుంచి విశేష స్పందన వచ్చింది. మార్చి 21వ తేదీ సాయంత్రం 5 గంటలకు ది సోఫియా వేకు వెళ్లిన టాటా వాలెంటీర్స్ అక్కడి మహిళలకు పలు రకాలు ఆహారాన్ని అందజేశారు. కాఫీ, టీ, షుగర్, సలాడ్, బ్రీడ్స్, కూరగాయలు, జూస్‌లు ఇచ్చారు.దాతలు, తెలంగాణ కమ్యూనిటీ సాయంతో భవిష్యత్తులో ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని భావిస్తున్నట్టు టాటా సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాలెంటీర్స్ టాటా సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment