బాహుబలి, కబాలిల కన్నా ఎక్కువగా..! | Vivegam Huge Release south India | Sakshi
Sakshi News home page

బాహుబలి, కబాలిల కన్నా ఎక్కువగా..!

Published Wed, Aug 23 2017 10:16 AM | Last Updated on Sun, Sep 17 2017 5:53 PM

బాహుబలి, కబాలిల కన్నా ఎక్కువగా..!

బాహుబలి, కబాలిల కన్నా ఎక్కువగా..!

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హీరోగా తెరకెక్కుతున్న వివేకం ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అజిత్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అజిత్ హీరోగా వీరం, వేదలం లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందించిన శివ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కావటంతో ఈ చిత్రం కూడా గ్యారెంటీ హిట్ అన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.

ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లు సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేశాయి. సినిమా రిలీజ్ విషయంలో కూడా సరికొత్త రికార్డ్ లు సృష్టిస్తున్నాడు అజిత్. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిరోజు చెన్నైలో భారీ సంఖ్యంలో షోలు పడేలా ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి, కబాలి చిత్రాల కన్నా ఎక్కువ షోన్ ప్రదర్శించేందుకు ప్లాన్ చేస్తున్నారు వివేకం టీం.

చెన్నైలోని ఒక్క మాయాజాల్ మల్టీప్లెక్స్ లోనే తొలి రోజు 65 షోలు వేస్తున్నారు. కేరళలోనూ అదే స్థాయిలో రిలీజ్ అవుతోంది. మరే పరభాషా హీరో సినిమా రిలీజ్ చేయని విధంగా కేరళలో తొలి రోజు వివేకం సినిమాను 300 థియేటర్లలో 1000 షోస్ వేసేందుకు రెడీ అవుతున్నారట. కర్నాటకతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా రిలీజ్ చేసేలా ఏర్పాట్లు చేశారు వివేకం యూనిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement