అమ్మకు రక్ష.. జననీ సురక్ష | effort to reduce mother and child deaths | Sakshi
Sakshi News home page

అమ్మకు రక్ష.. జననీ సురక్ష

Published Wed, Nov 12 2014 12:03 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

effort to reduce mother and child deaths

కంగ్టి: గ్రామీణ ప్రాంత ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జాతీయ ఆరోగ్య మిషన్ విస్తృత చర్యలు చేపట్టిందని జాతీయ కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ సీనియర్ రీజినల్ డెరైక్టర్ డాక్టర్ మహేశ్, యూనిసెఫ్ హెల్త్ స్పెషలిస్ట్ డాక్టర్ అజిత్ తెలిపారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీని కామన్ రివ్యూ మిషన్ (సీఆర్‌ఎం) ఢిల్లీ బృందం మంగళవారం సందర్శించింది. స్థానికంగా అందుతున్న వైద్య సేవలు, సదుపాయాల గురించి బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలోని 18 రాష్ట్రాల్లో సీఆర్‌ఎం బృందం విస్తృతంగా పర్యటిస్తోందని చెప్పారు. తెలంగాణలోని ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో తమ పరిశీలన కొనసాగుతోందన్నారు. ఆరోగ్య వైద్య సేవల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు నివేదిస్తామని తెలిపారు. మహిళలకు సాధారణ ప్రసవాలు చేయకుండా సిజేరియన్లు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు పేదల నుంచి డబ్బులు గుంజుతున్నారని పేర్కొన్నారు.

దీన్ని అరికట్టేందుకు జననీ సురక్ష కింద రూపాయి ఖర్చు లేకుండా గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో సాధారణ ప్రసూతులు జరిగేలా చూడాలని సిబ్బందికి సూచించారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా సిజేరియన్ ఆపరేషన్లు నమోదవుతున్నాయని తెలిపారు. తెలంగాణాలోని 18 పట్టణాల్లో నవజాత శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మాతా, శిశు మరణాలను తగ్గించేందుకు జాతీయ ఆరోగ్య మిషన్ తీవ్రంగా కృషి చేస్తోందన్నారు.

గ్రామీణ ప్రాంతంలో అందుబాటులో సీజేరియన్ ఆపరేషన్ చేసే వైద్య నిపుణులు, రక్తనిధి, పరిరక్షణ ఏర్పాట్లు తది తర సర్వవసతులు కల్పించే సరికొత్త ఆస్పత్రిని నారాయణఖేడ్ పట్టణంలో నెల కొల్పి వైద్య సేవలను పటిష్టం చేస్తామన్నారు. శిశువులకు ఒక్క టీకాతో ఐదు రకాలైన రోగాలను నియంత్రించేందుకు త్వరలో ‘పెంటావాలింట్’  టీకా రానుందని పేర్కొన్నారు.   సీఆ ర్‌ఎం బృందం స్టేట్ కన్సల్టెంట్ డాక్టర్ జనార్దన్, ఎస్పీహెచ్‌ఓ డాక్టర్ గాయత్రీదేవి, మెడికల్ ఆఫీసర్  భాస్కర్, సీహెచ్‌ఓ గాలన్న, వసంత్‌రావు, ఎంపీహెచ్‌ఏలు భాస్కర్, చంద్రబాబు, నారాయణరెడ్డి, స్టాఫ్ నర్స్‌లు ఉన్నారు.
 
మెరుగైన వైద్యం అందించాలి...
 నర్సాపూర్ రూరల్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి సేవలు అందించాలని కేంద్ర వైద్య బృందం ఫైనాన్స్ కన్సల్టెంట్ సభ్యుడు గుప్తా సిబ్బందికి సూచించారు. బిల్‌గేట్స్ ఫౌండేషన్ సభ్యుడు నరేంద్ర, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం మెంబర్ రాజేష్‌తో కలిసి మండల పరిధిలోని రెడ్డిపల్లి పీహెచ్‌సీని మంగళవారం ఆయన తనిఖీ చేశారు.  

స్థానిక వైద్యులను ఉద్దేశించి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్నాయని తెలిపారు.  పీహెచ్‌సీకి వస్తున్న రోగుల సంఖ్య, అందుబాటులో ఉన్న మం దుల వివరాలను నమోదు చేసుకున్నారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సునీల్, స్థానిక డాక్టర్ జ్యోతి, లక్ష్మణ్, రాజయ్య, గంగాధర్ చందర్, ఆరోగ్యమిత్ర రవిగౌడ్  ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement