ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడింది. ఈ పండక్కి మూడు పెద్ద సినిమాలు(గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్) సినిమాలు రిలీజ్ అయితే.. వాటిల్లో గేమ్ ఛేంజర్ మినహా మిలిగిన రెండు సినిమాలు హిట్ టాక్‌ని సంపాదించుకున్నాయి. అనిల్ రావిపూడి తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం అయితే రికార్డులను సృష్టిస్తోంది. అయితే సంక్రాంతి సందడి తర్వాత పెద్ద సినిమాలేవి రిలీజ్ కాలేదు. ఫిబ్రవరిలో వరుస సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజై సినిమాలు, వెబ్ సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం.
‘పట్టుదల’తో వస్తున్న అజిత్
కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘విడాముయార్చి’. తిరుమేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ‘పట్టుదల’ పేరుతో తెలుగులోనూ రిలీజ్ కానుంది. అజర్‌బైజాన్ నేపథ్యంగా సాగే ఈ యాక్షన్ కథలో త్రిష, అర్జున్, రెజీనా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లోని కారు ఛేజింగ్ సీన్స్, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ని పెంచాయి. భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
రాజు,సత్యల ప్రేమ కథ
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. మత్స్సకారుల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రాజుగా నాగ చైతన్య, సత్య(బుజ్జితల్లి)గా సాయి పల్లవి నటిస్తున్నారు. దేశ భక్తి అంశాలతో పాటు ఓ చక్కని ప్రేమ కథను ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఫిబ్రవరి 7న ఈ మూవీ రిలీజ్ కానుంది.
‘ఒక పథకం ప్రకారం’
సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతీ సోది, ఆషిమా నర్వాల్ హీరోయిన్లుగా నటించారు. సముద్ర ఖని కీలక పాత్ర చేశారు. వినోద్ కుమార్ విజయన్, గార్లపాటి రమేశ్ నిర్మించారు. ఫిబ్రవరి 7న ఈ చిత్రం విడుదల కానుంది.
నెట్‌ఫ్లిక్స్
హలీవుడ్ వెబ్‌సిరీస్ ‘ప్రిజన్ సెల్ 211’- ఫిబ్రవరి 5
హలీవుడ్ వెబ్‌సిరీస్ ‘సెలబ్రిటీ బేర్ హంట్’- ఫిబ్రవరి 5
హలీవుడ్ వెబ్ సిరీస్ ‘ది ఆర్ మర్డర్స్’- ఫిబ్రవరి 5
అమెజాన్ ప్రైమ్ వీడియో
ది మెహతా బాయ్స్ (హిందీ మూవీ): ఫిబ్రవరి 7
డిస్నీ+ హాట్‌స్టార్
కోబలి (తెలుగు వెబ్‌సిరీస్): ఫిబ్రవరి 4
సోనీలివ్
బడా నామ్ కరేంగే (హిందీ వెబ్‌సిరీస్): ఫిబ్రవరి 7
జీ 5
మిసెస్ (హిందీ సినిమా): ఫిబ్రవరి 7
Comments
Please login to add a commentAdd a comment