Delhi medical team
-
ధర్మవరంలో ఢిల్లీ వైద్య బృందం పర్యటన
ధర్మవరం అర్బన్: పట్టణంలో మంగళవారం ఢిల్లీ నుంచి వచ్చిన వైద్య బృందం పర్యటించింది. డెంగీ బాధితులు 60 శాతానికి కన్నా ఎక్కువగా ఉన్నట్లు తేలితే ఈ జ్వరానికి ప్రత్యేకంగా వ్యాక్సిన్ వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఈ సందర్భంగా బృందంలోని డాక్టర్ రమేష్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ యుగంధర్ తెలిపారు. ఇందులో భాగంగానే దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాలో్లని 65 జిల్లాలను పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి డెంగీ జ్వరం తీవ్రతను గుర్తించేందుకు రక్తనమూనాలు సేకరిస్తున్నట్లు వివరించారు. జిల్లాలోని ధర్మవరం, హిందూపురం పట్టణాలతోపాటు రామగిరి మండలంలోని కుంటిమద్ది, యల్లనూరు మండలంలోని వెన్నపూసపల్లి గ్రామాల్లో పర్యటించి రక్త నమూనాలను సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, పట్టణంలోని 16వ వార్డులో వైద్యులు నాలుగు బృందాలుగా విడిపోయి ప్రజల నుంచి రక్తనమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. -
అమ్మకు రక్ష.. జననీ సురక్ష
కంగ్టి: గ్రామీణ ప్రాంత ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జాతీయ ఆరోగ్య మిషన్ విస్తృత చర్యలు చేపట్టిందని జాతీయ కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ సీనియర్ రీజినల్ డెరైక్టర్ డాక్టర్ మహేశ్, యూనిసెఫ్ హెల్త్ స్పెషలిస్ట్ డాక్టర్ అజిత్ తెలిపారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీని కామన్ రివ్యూ మిషన్ (సీఆర్ఎం) ఢిల్లీ బృందం మంగళవారం సందర్శించింది. స్థానికంగా అందుతున్న వైద్య సేవలు, సదుపాయాల గురించి బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలోని 18 రాష్ట్రాల్లో సీఆర్ఎం బృందం విస్తృతంగా పర్యటిస్తోందని చెప్పారు. తెలంగాణలోని ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో తమ పరిశీలన కొనసాగుతోందన్నారు. ఆరోగ్య వైద్య సేవల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు నివేదిస్తామని తెలిపారు. మహిళలకు సాధారణ ప్రసవాలు చేయకుండా సిజేరియన్లు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు పేదల నుంచి డబ్బులు గుంజుతున్నారని పేర్కొన్నారు. దీన్ని అరికట్టేందుకు జననీ సురక్ష కింద రూపాయి ఖర్చు లేకుండా గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో సాధారణ ప్రసూతులు జరిగేలా చూడాలని సిబ్బందికి సూచించారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా సిజేరియన్ ఆపరేషన్లు నమోదవుతున్నాయని తెలిపారు. తెలంగాణాలోని 18 పట్టణాల్లో నవజాత శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మాతా, శిశు మరణాలను తగ్గించేందుకు జాతీయ ఆరోగ్య మిషన్ తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతంలో అందుబాటులో సీజేరియన్ ఆపరేషన్ చేసే వైద్య నిపుణులు, రక్తనిధి, పరిరక్షణ ఏర్పాట్లు తది తర సర్వవసతులు కల్పించే సరికొత్త ఆస్పత్రిని నారాయణఖేడ్ పట్టణంలో నెల కొల్పి వైద్య సేవలను పటిష్టం చేస్తామన్నారు. శిశువులకు ఒక్క టీకాతో ఐదు రకాలైన రోగాలను నియంత్రించేందుకు త్వరలో ‘పెంటావాలింట్’ టీకా రానుందని పేర్కొన్నారు. సీఆ ర్ఎం బృందం స్టేట్ కన్సల్టెంట్ డాక్టర్ జనార్దన్, ఎస్పీహెచ్ఓ డాక్టర్ గాయత్రీదేవి, మెడికల్ ఆఫీసర్ భాస్కర్, సీహెచ్ఓ గాలన్న, వసంత్‌రావు, ఎంపీహెచ్ఏలు భాస్కర్, చంద్రబాబు, నారాయణరెడ్డి, స్టాఫ్ నర్స్‌లు ఉన్నారు. మెరుగైన వైద్యం అందించాలి... నర్సాపూర్ రూరల్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి సేవలు అందించాలని కేంద్ర వైద్య బృందం ఫైనాన్స్ కన్సల్టెంట్ సభ్యుడు గుప్తా సిబ్బందికి సూచించారు. బిల్‌గేట్స్ ఫౌండేషన్ సభ్యుడు నరేంద్ర, ఎన్ఆర్హెచ్ఎం మెంబర్ రాజేష్‌తో కలిసి మండల పరిధిలోని రెడ్డిపల్లి పీహెచ్‌సీని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. స్థానిక వైద్యులను ఉద్దేశించి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్నాయని తెలిపారు. పీహెచ్‌సీకి వస్తున్న రోగుల సంఖ్య, అందుబాటులో ఉన్న మం దుల వివరాలను నమోదు చేసుకున్నారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సునీల్, స్థానిక డాక్టర్ జ్యోతి, లక్ష్మణ్, రాజయ్య, గంగాధర్ చందర్, ఆరోగ్యమిత్ర రవిగౌడ్ ఉన్నారు. -
‘ఢిల్లీ’ వైద్య బృందం ఆకస్మిక తనిఖీ
సిద్దిపేట జోన్: ఢిల్లీ వైద్య బృందం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి, మాతా శిశు సంక్షేమ కేంద్రం, హైరిస్క్ కేంద్రం, పొన్నాల పీహెచ్‌సీలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసింది. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) నిధుల వినియోగం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పథకం నిధులతో అందుతున్న సేవలను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ స్థాయి హోదా కలిగిన అధికారి నేతృత్వంలో ప్రత్యేక బృందం సిద్దిపేటకు చేరుకుంది. జాతీయ స్థాయిలోని వైద్య, ఆరోగ్య సంక్షేమ శాఖ నేతృత్వంలో ఏటా జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులకు ఎన్ఆర్హెచ్ఎం కింద నిధులు విడుదలవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సముచిత వైద్య సేవలను అందించడానికి వీటిని వినియోగస్తుంటారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇండియా డాక్టర్ కె.జె. రామ్, కేంద్ర రీజినల్ డెరైక్టర్ మహేష్, డా. అజిత్ సుడుకె, భారత ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కన్సల్టెంట్లు రాజేష్, జనార్ధన్, ఫైనాన్స్ విభాగం కన్సల్టెంట్ గుప్తాతో కూడిన ప్రత్యేక బృందం మొదట మాతా శిశు సంక్షేమ కేంద్రాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా ఆస్పత్రి స్థితిగతులు, వైద్యుల సంఖ్య, ఆస్పత్రిలో అందుతున్న సేవలపై బృందం ఆరా తీసింది. అనంతరం హైరిస్క్ కేంద్రాన్ని సందర్శించి కేంద్రం ఇన్చార్జి డా. కాశీనాథ్‌తో పరిస్థితులపై సమీక్షించారు. అత్యవసర వైద్య సేవల కేంద్ర వినియోగం, కేంద్రానికి వచ్చే కేసులు, నిధుల వినియోగం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక ఏరియా ఆస్పత్రిని సందర్శించి రికార్డులను పరిశీలించారు. నిధుల పెంపుపై నివేదిక బృందం టీమ్ లీడర్, రీజనల్ డెరైక్టర్ డా. మహేష్ మాట్లాడుతూ తెలంగాణ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జాతీయ, గ్రామీణ ఆరోగ్య మిషన్ ద్వారా మంజూరైన నిధుల వినియోగంపై నివేదిక కోసం రెండు బృందాలు పర్యటిస్తున్నాయన్నారు. వీటిలో ఒక బృందం ఆదిలాబాద్‌లో ఉండగా రెండో బృందం మెదక్ జిల్లాలో పర్యటిస్తుందన్నారు. మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎన్ఆర్హెచ్ఎం కింద అమలవుతున్న వైద్య సేవలు గురించి వివరాలు సేకరిస్తామన్నారు. ప్రధానంగా ఖాళీల సమస్య, నిధుల శాతాన్ని 20 నుంచి 30కి పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నామన్నారు. ము ఖ్యంగా పిల్లలకు వైద్య సేవలను సముచితంగా ఈ నిధుల ద్వారా అందించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఎన్ఆర్హెచ్ఎం కింద మంజూరైన నిధుల వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు.