బాషా-2లో అజిత్? | ajith act to basha-2 ? | Sakshi
Sakshi News home page

బాషా-2లో అజిత్?

Published Tue, Jul 21 2015 2:33 AM | Last Updated on Sun, Sep 3 2017 5:51 AM

బాషా-2లో అజిత్?

బాషా-2లో అజిత్?

బాషా. ఇది రజనీకాంత్, దర్శకుడు సురేష్‌కృష్ణ సినీకేరీర్‌లోనూ మరచిపోలేని చిత్రం. అంతేకాదు తమిళ చిత్రపరిశ్రమలోనే ఒక మైలురాయి. దర్శకుడు సురేష్‌కృష్ణ ఎక్కడికి వెళ్లినా బాషా చిత్రానికి సంబంధించిన ప్రశ్నల నుంచి తప్పికోలేరు. అంతగా ఆయనకు పేరు ప్రఖ్యాతులు ఆపాధించి పెట్టిన చిత్రం అది. అలాంటి చిత్రానికి సీక్వెల్ తీయాలని ఏ దర్శకుడికైనా ఉంటుంది. అయితే ఇది కత్తి మీద సాము అన్న సంగతి తెలిసిందే. అయినా బాషా-2 రూపొందించాలన్నది సురేష్‌కృష్ణ కోరిక. రజనీ ఓకే అంటే బాషా పార్టు 2 తీస్తానని బహిరంగంగానే ప్రకటించారు. ఆ పట్టుదలతోనే బాషా సీక్వెల్‌కు కథ సిద్ధం చేశారు. ఈ విషయాన్ని మన సూపర్‌స్టార్‌కు తెలిజేశారు కూడా. అయితే బాషా ఒక్కడే మరో బాషాను కలలో కూడా ఊహించుకోలేనని రజనీకాంత్ అన్నారట.

దీంతో ప్రత్యామ్నాయ దిశగా దృష్టి సారించిన దర్శకుడు సురేష్‌కృష్ణ. ఆయనకు అజిత్ ఒక్కరే కనిపించారట. అజిత్ ఇంతకు ముందు రజనీకాంత్ నటించిన బిల్లా చిత్ర రీమేక్‌లో నటించే సాహసంచేసి విజయం సాధించారు. అదీకాకుండా బాషా లాంటి గ్యాంగ్‌స్టర్ పాత్రలకు ప్రస్తుత నటుల్లో ఆయనే గుడ్ ఛాయిస్ అనుకున్నారు. బాషా-2 స్క్రిప్ట్‌ను అజిత్‌కు వినిపించారని, ఆయన నటించడానికి సమ్మతించినట్లు కోలీవుడ్ వర్గాల బోగట్టా. అజిత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో ఏఎం.రత్నం నిర్మిస్తున్న భారీ చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి కేవీ ఆనంద్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు అనధికార ప్రచారం జరుగుతోంది. మరి బాషా సీక్వెల్ తెరరూపం దాల్చేదెప్పుడో? అసలు ఈ చిత్రం ఉంటుందో? లేదో? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement