ను ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్టే’ – వందేళ్ల తర్వాతైనా డీటీఎస్‌లో ఈ డైలాగ్ మనకు వినిపిస్తూ ఉంటుందేమో! ఎందుకంటే... రజనీకాంత్ కల్ట్ క్లాసిక్ ‘బాషా’ వచ్చి 22 ఏళ్లయింది. అయినా ఆ సిన్మా పవర్ ఏమాత్రం తగ్గలేదు. సౌత్ సిన్మా ఇండస్ట్రీపై... ఆ మాటకొస్తే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీపై... ‘బాషా’ సినిమా, అందులోని రజనీ నటన చూపించిన ఎఫెక్టు అటువంటిది! అందుకే, అమెరికన్ ఫిల్మ్ ఫెస్టివల్ ‘ఫెంటాస్టిక్ ఫెస్ట్’ నిర్వాహకులు ‘బాషా’ నిర్మాతలను అడిగి మరీ ఈ ఏడాది తమ ఫెస్టివల్‌లో సిన్మాను ప్రదర్శిస్తున్నారు. అమెరికాలోని ఆస్టిన్, టెక్సాస్‌లో నిన్న మొదలైన ‘ఫెంటాస్టిక్ ఫెస్ట్’ ఈ నెల 28 వరకు జరుగుతుంది.
ఈ ఆదివారం (ఈ 24న) ఉదయం 10.40 గంటలకు, మళ్లీ మంగళవారం (26న) 10.20 గంటలకు ‘బాషా’ను ప్రదర్శించనున్నారు. ప్రపంచంలోని డిఫరెంట్ జానర్ ట్రెండ్ సెట్టింగ్ సిన్మాలను ప్రతి ఏడాది ఈ ఫెస్టివల్‌లో ప్రదర్శిస్తారు. అసలు ‘బాషా’ సినిమా ‘ఫెంటాస్టిక్ ఫెస్ట్’కు ఎలా వెళ్లిందంటే... ఈ ఏడాది మార్చిలో ‘బాషా’ డిజిటల్లీ రీమాస్టర్డ్ వెర్షన్‌ను విడుదల చేశారు! అప్పుడు యూకేలో ఓ ఛారిటీ షో వేశారు. అక్కడ ‘ఫెంటాస్టిక్ ఫెస్ట్’ నిర్వాహకులు సినిమాను చూసి ఫెస్టివల్‌లో ప్రదర్శిస్తామని నిర్మాతలను అడిగారు. ‘క్రైమ్ క్లాసిక్’ కేటగిరీలో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు.
బాషా... ఫెంటాస్టిక్
Published Thu, Sep 21 2017 11:37 PM | Last Updated on Thu, Apr 4 2019 4:27 PM
Advertisement
Advertisement