అజిత్‌తో రొమాన్స్ చేయాలని! | Hansika wants to work with Thala Ajith! | Sakshi
Sakshi News home page

అజిత్‌తో రొమాన్స్ చేయాలని!

Published Sat, Sep 20 2014 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 PM

అజిత్‌తో రొమాన్స్ చేయాలని!

అజిత్‌తో రొమాన్స్ చేయాలని!

సూపర్‌స్టార్ రజనీకాంత్ తరువాత కోలీవుడ్‌లో హీరోయిన్లు ఎక్కువగా నటించాలని కోరుకునేది అజిత్ సరసనే అంటారు. ఇప్పుడు సరిగ్గా నటి హన్సిక అలాంటి ఆశనే వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్యూటీ ఆర్య, ధనుష్, కార్తీ, జీవా, జయం రవి వంటి యువ హీరోలతో పాటు ఇళయదళపతి విజయ్, సూర్య లాంటి స్టార్స్‌తో కూడా జతకట్టారు. అజిత్ సరసన మాత్రం నటించే అవకాశం ఇంకా రాలేదు. అజిత్ ఆరంభం చిత్రంలో నటించినా ఆయనకు జంటగా నటించలేదు. దీంతో ఆమె అజిత్‌తో రొమాన్స్ చే యాలనే కోరికను వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి హన్సిక మాట్లాడుతూ తాను అజిత్ వీరాభిమానినన్నారు. ఆయనతో ఒక చిత్రంలో అ యినా నటించాలన్నది తన స్వప్నమన్నా రు. అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు.  ప్రస్తుతం అలాంటి ప్రయత్నంలోఉన్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement