ఈసారైనా కలిసొచ్చేనా | she think at this time may be success? | Sakshi
Sakshi News home page

ఈసారైనా కలిసొచ్చేనా

Published Thu, Jul 3 2014 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 9:42 AM

ఈసారైనా కలిసొచ్చేనా

ఈసారైనా కలిసొచ్చేనా

 మాజీ ప్రపంచసుందరి పార్వతి ఓమన కుట్టాన్ మరోసారి కోలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోంది. ఈ బ్యూటీ అజిత్ సరసన బిల్లా-2 చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైంది. ఆ చిత్రంపై అమ్మడు చాలా ఆశలు పెట్టుకుంది. బిల్లా-2 చిత్రం పార్వతి ఓమన కుట్టాన్ ఆశల్ని అడియాశలు చేసింది. ఆ చిత్ర పరాజయంతో ఆమెకు మరో అవకాశం దరిచేరలేదు. తాజాగా నంబియార్ చిత్రంలో ముఖ్యపాత్రను పోషిస్తోంది. శ్రీకాంత్ హీరోగా నటిస్తూ సొంతంగా తన గోల్డెన్ ప్రైడే పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి సునైనా హీరోయిన్‌గా నటిస్తోంది. సంతానం హాస్యభూమికను పోషిస్తున్నారు.

గణేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పార్వతి ఓమన కుట్టాన్ పాత్ర గురించి దర్శకుడు తెలుపుతూ కాలేజ్‌గర్ల్‌గా మంచి యూత్ పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. పార్వతి ఓమన కుట్టాన్ పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందన్నారు. ఈ మలయాళ బ్యూటీ బాలీవుడ్‌లోను తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తమిళంలో అనూహ్య విజయాన్ని సాధించిన పిజ్జా చిత్రం హిందీ రీమేక్‌లో పార్వ తి ఓమన కుట్టాన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో నటించడం టెరిఫిక్ ఎక్స్‌పీరియన్స్ అంది. చిత్రం విడుదల కోసం చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నట్లు పార్వతి ఓమన కుట్టాన్ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement