గేమ్‌ చేంజర్‌ తర్వాత శంకర్‌ లిస్ట్‌లో ఉన్న టాప్‌ హీరో ఎవరు..? Director Shankar's next movie with Actor Ajith Kumar after Game Changer? Sakshi
Sakshi News home page

గేమ్‌ చేంజర్‌ తర్వాత శంకర్‌ లిస్ట్‌లో ఉన్న టాప్‌ హీరో ఎవరు..?

Published Sat, Jun 8 2024 9:31 AM | Last Updated on Sat, Jun 8 2024 10:59 AM

Game Changer Director Shankar Next Movie

భారీ చిత్రాలకు కేరాఫ్‌ దర్శకుడు శంకర్‌. ఈ విషయంలో మరోమాటకు తావు లేదు. కొత్తవారితో చేసినా అది భారీగా ఉంటుంది. అందుకు చిన్న ఉదాహరణ బాయ్స్‌ చిత్రం. ఇకపోతే తొలి రోజుల్లోనే జెంటిల్‌మెన్,  ఒకే ఒక్కడు  వంటి చిత్రాల్లో భారీ తనాన్ని చూపించిన దర్శకుడు శంకర్‌. ఇక ఇండియన్, రోబో, అపరిచితుడు, ఐ వంటి చిత్రాల గురించి చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈయన దర్శకత్వంలో ఇండియన్‌–2, తెలుగు చిత్రం గేమ్‌ చేంజర్‌ ఉన్నాయి. 

కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటించిన ఇండియన్‌–2 చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని జూలై 12న ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీని తరువాత రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్‌ చేంజర్‌ చిత్రం సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ నెలలో విడుదల కానుంది. దీంతో శంకర్‌ తర్వాత చిత్రం ఏమిటన్న ప్రశ్న సర్వత్రా నెలకొంది. అందుకు సమాధానంగా ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అదే అజిత్‌ హీరోగా శంకర్‌ భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుపుతున్నారట. 

అజిత్‌ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. దక్షిణాదిలో సూపర్‌ క్రేజ్‌ ఉన్న కోలీవుడ్‌ స్టార్‌ హీరో ఆయన. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈయన ప్రస్తుతం మగిళ్‌ తిరుమేణి దర్శకత్వంలో విడాముయర్చి చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. అదే సమయంలో తన 63వ చిత్రాన్ని ఆధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. దీనికి గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ రెండు చిత్రాల తరువాత అజిత్‌ నటించే చిత్రం ఏమిటన్న ప్రశ్నకు శంకర్‌ దర్శకత్వంలో నటించనున్నారని టాక్‌ వస్తోంది. 

అజిత్, దర్శకుడు శంకర్‌ల క్రేజీ కాంబినేషన్‌లో ఇప్పటి వరకూ చిత్రం రాలేదు. తాజాగా బాహుబలి చిత్రాన్ని మించే స్థాయిలో భారీ బడ్జెట్‌ చారిత్రక కథా చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు ప్రచారం వైరల్‌ అవుతోంది. ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ, నిజం అయితే మాత్రం సూపర్‌గా ఉంటుందని చెప్పవచ్చు. 
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement