నటుడు అజిత్ ఇప్పుడు మాస్ పాత్రలతో స్టార్ హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన నట పయనం ప్రేమ కథా చిత్రంతోనే మొదలైంది. అజిత్ నటించిన తొలి చిత్రం అమరావతి. నటి సంఘవి నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని చోళా క్రియేషన్స్ పతాకంపై చోళా పొన్నురంగం నిర్మించారు. మొదట్లో టీవీ సీరియల్ నిర్మించిన ఈయన ఆ తరువాత సినీ రంగ ప్రవేశం చేసి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.
కాగా నటుడు అజిత్‌ను అమరావతి చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేసింది ఈయనే. వైవిధ్య భరిత ప్రేమ కథా చిత్రంగా 1993లో రూపొందిన ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అమరావతి చిత్రం విడుదలై 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దానికి ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతో సరికొత్త హంగులు అద్ది నటుడు అజిత్ పుట్టిన రోజును పురస్కరించుకుని మే 1వ తేదీన మళ్లీ తెరపైకి తీసుకురావడానికి నిర్మాత చోళ పొన్నురంగం సన్నాహాలు చేస్తున్నారు.
(చదవండి: సక్సెస్ లేని రకుల్.. మాస్ మసాలా పాత్రల కోసం వెయిటింగ్..)
దీని గురించి ఆయన మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ తాను అజిత్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన అమరావతి చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించిందన్నారు. కాగా తాజాగా అజిత్ అభిమానుల కోరిక మేరకు ఆ చిత్రాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మళ్లీ రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. దీనిని సుమారు 400 థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. అందుకు అజిత్ అభిమానులు థియేటర్ల యాజమాన్యం సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment