ఈ వారం you tube హిట్స్ | Youtube hits this week | Sakshi
Sakshi News home page

ఈ వారం you tube హిట్స్

Oct 12 2015 12:06 AM | Updated on Sep 3 2017 10:47 AM

ఈ వారం  you tube హిట్స్

ఈ వారం you tube హిట్స్

చానెల్ 4 బ్రిటిష్ టీవీ చానెల్. సామాజిక అంశాలు, సమస్యలపై ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేయడంలో ప్రసిద్ధి చెందిన

గర్ల్స్ టు మెన్  : ఛానెల్ 4
నిడివి : 34 సె.
హిట్స్ : 56,71,913

 
చానెల్ 4 బ్రిటిష్ టీవీ చానెల్. సామాజిక అంశాలు, సమస్యలపై ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేయడంలో ప్రసిద్ధి చెందిన ఈ చానెల్ తాజాగా ‘గర్ల్స్ టు మెన్’ అనే ప్రోగ్రామ్‌ని అక్టోబర్ 13 రాత్రి పది గంటలకు ప్రసారం చేయబోతోంది. దాని ట్రైలరే గర్ల్స్ టు మెన్. అమ్మాయిలుగా పుట్టి, అమ్మాయిలుగా ఉండడానికి ఇష్టపడని పిల్లల్ని, వాళ్ల తల్లిదండ్రుల్ని చానల్ 4 ఇంటర్వ్యూ చేసింది. అమ్మాయిల్ని శారీరకంగా అబ్బాయిలుగా మార్చే ఆధునిక శస్త్రచికిత్సల గురించి కూడా ఈ ప్రోగ్రామ్‌లో చూపించబోతోంది. ముందైతే ట్రయిలర్ చూడండి. భలే ఉంది.
 
వెడలామ్ : టీజర్
నిడివి : 45 సె.
 హిట్స్ : 31,19,402

 అజిత్, శృతిహాసన్ నటించిన తమిళ చిత్రం ‘వెడలాం’ ట్రైలర్ హిట్స్ అంతకంతకూ పెరిగిపోతున్నాయి! శివ డెరైక్ట్ చేసిన ఈ చిత్రానికి మ్యూజిక్ అనిరుథ్ రవిచందర్. ఇద్దరి కాంబినేషన్‌కు చిన్న శాంపిల్‌లా ఉంది ఈ టీజర్. నిర్మాత ఎ.ఎం. రత్నం. ప్రస్తుతానికైతే నవంబర్ 11న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. టీజర్‌లో ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో, అజిత్ ఒక రాక్షసుడిలా కనిపిస్తాడు. యూట్యూబ్ హిట్స్‌లో ఈ టీజర్... టేలర్ స్విఫ్ట్ ‘బ్యాడ్ బ్లడ్’ రికార్డును బ్రేక్ చేసింది. అప్‌లోడ్ చేసిన తొలి గంటలోనే ‘వెడలాం’కు 50 వేల లైకులు వచ్చాయి.
 
 హెయిల్, సీజర్ : ట్రైలర్

నిడివి : 2 ని. 32 సె.
హిట్స్ : 25,46,726

నాలుగుసార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న కోయెన్ బ్రదర్స్ స్క్రిప్టు రాసి, డెరైక్ట్ చేస్తున్న ఆల్‌స్టార్ కామెడీ మూవీ ‘హెయిల్, సీజర్’. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న విడుదలవుతోంది. 1950ల నాటి హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ మేనేజర్ కథ ఇది. కంపెనీ ప్రతిష్టను కాపాడడం, ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న సినీ తారలను వివాదాలకు దూరంగా ఉంచడం అతడి పని. ఈ క్రమంలో నిర్మాణంలో ఉన్న ‘హెయిల్ సీజర్, ఎ టేల్ ఆఫ్ క్రైస్ట్స్ లైఫ్’ నటుడు బైర్డ్ వైట్‌లాక్ కిడ్నాప్ అవుతాడు. తర్వాత ఏం జరుగుతుందన్నదే ఈ చిత్రం. ట్రైలర్ రెండు రోజుల క్రితమే విడుదలైంది.
 
మటర్ గస్తీ : వీడియో సాంగ్
నిడివి : 2 ని. 29 సె.
హిట్స్ : 17,22,587

 బాలీవుడ్ మూవీ ‘తమాషా’లోని వీడియో సాంగ్ ఇది. మూడు రోజుల క్రితమే టీ సీరీస్ అప్‌లోడ్ చేసింది. రణబీర్ కబీర్, దీపికా పడుకోన్ మధ్య సాగే ఈ ఉల్లాస గీతాన్ని మోహిత్ చౌహాన్ ఆలా పించారు. సంగీతం ఎ.ఆర్.రెహమాన్. చిత్రం నవంబర్ 27 న విడుదలవుతోంది. ఈ రొమాంటిక్ డ్రామాను డెరైక్ట్ చేసింది ఇంతియాజ్ అలీ. ఆచారాలు, సంప్రదాయాలు, నిమయాలు, నిబంధనలకు అనుగుణం జీవితాన్ని సాగించాలనుకునే ఒక యువకుడు తనలో తను ఎలా సతమతమవుతుంటాడో ఈ చిత్రం వినోదాత్మకంగా చూపిస్తుంది. సాంగ్ చూడండి. బాగుంది. కలర్‌ఫుల్‌గా.
 
 ది హంగర్ గేమ్స్ పార్ట్ 2 : ట్రైలర్
నిడివి : 1 ని. 56 సె.
హిట్స్ : 18,42,897

గత ఏడాది విడుదలైన అమెరికన్ సైన్స్ ఫిక్షన్ వార్ ఫిల్మ్ ‘ది హంగర్ గేమ్స్ : మాకింగ్‌జే పార్ట్ 1’కి సీక్వెల్ ఈ పార్ట్ 2. దీని ట్రైలర్ నాలుగు రోజుల క్రితమే విడుదలైంది. చిత్రం విడుదల నవంబర్ 20. సుజాన్ కాలిన్స్ 2010లో రాసిన ‘మాకింగ్‌జే’ నవల ఆధారంగా ఈ సీరీస్ తయారవు తున్నాయి. పార్ట్ 2లో కూడా జెన్నిఫర్ లారెన్స్, జోష్ హచర్‌సన్ నటిస్తున్నారు డెరైక్టర్ ఫ్రాన్సిస్ లారెన్స్. జెన్నిఫర్, ఆమె బృందం కలసి యుద్ధ పీడిత ప్రాంతమైన పానెమ్‌లో పౌరులకు విముక్తి కల్పించడం కోసం బయల్దేరతారు. భయంకర మైన పోరాటాలు చేస్తారు. చివరికి విజయం సాధిస్తారు.
 
 జస్టిన్ బీబర్ స్నబ్‌డ్
నిడివి : 1 ని. 8 సె.
హిట్స్ : 23,91,885

అమెరికన్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్టిస్ట్, నటి రోండా జీన్ రౌజీ... ఈ ఏడాది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తన పదహారేళ్ల చెల్లెలు జూన్‌కు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ కాస్మోపాలిటన్ మ్యాగజీన్ ఫంక్షన్‌లో మాట్లాడిన వీడియో ఇది. జూన్‌ని అవమానించింది ఎవరో తెలుసా? యూత్ పాప్ ఐకన్, కెనడియన్ సింగర్ జస్టిన్ బీబర్! ‘బీబర్‌కి నా చెల్లెలు డై హార్ట్ ఫ్యాన్. కాన్స్ ఫెస్టివల్‌లో అందరూ వెళ్లి బీబర్‌తో ఫొటోలు దిగుతున్నారు. తనూ అతడితో ఫొటో దిగాలని ఎంతో ఉబలాట పడింది. కానీ బీబర్ ఛాన్స్ ఇవ్వలేదు’ అని రోండా ఆవేదన   వ్యక్తం చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement