అమ్మాయి కోసం ఫేస్‌బుక్‌లో వార్నింగ్... | ground for the girl on Facebook | Sakshi
Sakshi News home page

అమ్మాయి కోసం ఫేస్‌బుక్‌లో వార్నింగ్...

Published Wed, Aug 17 2016 1:36 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

అమ్మాయి కోసం ఫేస్‌బుక్‌లో వార్నింగ్... - Sakshi

అమ్మాయి కోసం ఫేస్‌బుక్‌లో వార్నింగ్...

ఫేస్‌బుక్‌లో వార్నింగ్.. గ్రౌండ్‌లో డిష్యుం డిష్యుం

బెంగళూరు :  ఓ అమ్మాయి కోసం ఇద్దరి మధ్య ఫేస్‌బుక్‌లో జగడం మొదలైంది. ఇది చినికిచినికి గాలివానగా మారి దాడులకు దారితీసింది. ఈ ఘటన మంగళవారం బెంగళూరు నగరంలో వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బెంగళూరులోని రాజాజీనగర్‌కు చెందిన అజిత్ తనతో పాటు కళాశాలలో చదువుతున్న అమ్మాయితో స్నేహంగా ఉండేవాడు.  ఆ అమ్మాయిని.. ఆమె ఇంటి పక్కన ఉండే శివప్రసాద్ కూడా ఇష్టపడేవాడు.  కొన్ని రోజుల క్రితం సదరు అమ్మాయితో అజిత్ కలిసి తిరుగుతున్న విషయాన్ని శివప్రసాద్ గమనించాడు. ఈ నేపథ్యంలో అతను ఫేస్‌బుక్‌లో అజిత్‌కు వార్నింగ్ ఇచ్చాడు. ఆ అమ్మాయిని తాను  ప్రేమిస్తున్నానని,  మర్యాదగా అడ్డుతప్పుకోవాలని హెచ్చరించాడు. అజిత్ కూడా వెనక్కి తగ్గలేదు.


అమ్మాయితో స్నేహంగా ఉండటం, ప్రేమించడం తన సొంత విషయమని, బెదిరింపులకు లొంగేది లేదని  ఫేస్‌బుక్‌లో సమాధానం ఇస్తూ ఫోన్‌నంబర్‌ను కూడా పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో శివప్రసాద్ సోమవారం రాత్రి అజిత్‌కు ఫోన్‌చేసి ధైర్యముంటే స్థానిక శంకర్‌మఠం వద్ద ఉన్న మైదానం వద్దకు రావాలని చెప్పాడు. అజిత్ తన నలుగురు స్నేహితులతో అక్కడికి చేరుకున్నారు. శివప్రసాద్ కూడా తన గ్యాంగుతో అక్కడికి చేరుకున్నారు.  వాగ్వాదంతో మొదలై.. భౌతిక దాడుల వరకు వెళ్లారు. కత్తులు, రాడ్లతో గాయపరచుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రాజాజీనగర పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని అజిత్, శివప్రసాద్‌తో పాటు వారి స్నేహితులను అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement