
పోలీసాఫీసర్‌గా...
తమిళంలో మంచి మాస్ హీరో అయిన అజిత్‌కు తెలుగునాట కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా అజిత్ ‘నే వస్తున్నా’ అనే అనువాద చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇందులో మీరాజాస్మిన్ కథానాయిక. ఎస్. మురళీ రామనాథన్ నిర్మాత. ఈ నెలాఖరున పాటలను, వచ్చే నెల మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘అజిత్ శక్తిమంతమైన పోలీసాఫీసర్‌గా నటించారు. ఈ చిత్రంలో ఉన్న పదకొండు ఫైట్స్ ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేస్తాయి. మణిశర్మ స్వరపరచిన ఆరు పాటలూ వినసొంపుగా ఉంటాయి. అజిత్ యాక్షన్, మీరాజాస్మిన్ అభినయం ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: శ్రీరామ్ .వై, సహనిర్మాత: పరిటాల రాంబాబు, దర్శకత్వం: ఎన్. మహరాజన్.