
అజిత్ వస్తున్నాడు...
బిల్లా, ఆరంభం... ఇలా తమిళంలో అజిత్ హీరోగా నటిస్తున్న చిత్రాలు దాదాపు తెలుగులోకి అనువాదమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా, మరో చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు అజిత్. మహారాజన్ దర్శకత్వంలో అజిత్, మీరా జాస్మిన్ జంటగా రూపొందిన ఓ తమిళ చిత్రాన్ని ఎస్. మురళీ రామనాధం తెలుగులోకి అనువదించారు.
ఈ నెల రెండో వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. దీనికి ‘నే వస్తున్నా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. వాణిజ్య అంశాలు మెండుగా ఉన్న చిత్రం ఇదనీ, అజిత్ చేసిన రిస్కీ పోరాటాలు, మీరా జాస్మిన్ అందచందాలు, అభినయం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని నిర్మాత తెలిపారు. ఇందులో ఉన్న ఐదు పాటలకూ మణిశర్మ అద్భుతమైన స్వరాలందించారని, శ్రీరాం రాసిన సంభాషణలు బాగుంటాయని కూడా అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: పరిటాల రాంబాబు.