మూడో హీరోయిన్ అయితేనేం? | when opportunities come to make as it use | Sakshi
Sakshi News home page

మూడో హీరోయిన్ అయితేనేం?

Published Sat, Nov 8 2014 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 4:02 PM

మూడో హీరోయిన్ అయితేనేం?

మూడో హీరోయిన్ అయితేనేం?

అవకాశాలు వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాని మనం కావాలనుకున్నప్పుడు అవి రావు. నటి పార్వతీమీనన్ వ్యవహారమే ఇందుకు ఒక ఉదాహరణ. ఈ మలయాళ కుట్టి పూ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ చిత్రం ప్రేక్షకుల మధ్య పర్వాలేదనిపించుకుంది. పార్వతిమీనన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. విమర్శకులు సైతం ప్రశంసించారు. ఇంకేముంది పార్వతికి మరిన్ని అవకాశాలు తలుపుతట్టాయి.

అయితే ఆ సమయంలో ఈ కేరళకుట్టి గ్లామర్ పాత్రలు చేయను.. ఈత దుస్తులు ధరించను.. అవకాశాలు లేకపోతే ఇంట్లో కూర్చొంటా.. అంటూ తెగ స్టేట్‌మెంట్ ఇచ్చేసింది. దీంతో ఆ అవకాశాలన్నీ తిరుగుముఖం పట్టాయి. చాన్నాళ్ల తరువాత ఆ మధ్య ధనుష్ సరసన మరియాన్ చిత్రంలో నటించే అవకాశం వచ్చినా ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. పార్వతిమీనన్‌తో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. మడికట్టుకు కూర్చొంటే లాభం లేదనుకుందో ఏమో! సొంతంగా ఫొటో సెషన్ ఏర్పాటు చేసుకుని అందాలారబోస్తూ ఫొటోలు తీసుకుని వెబ్‌సైట్ తదితర ఇతర ప్రసార సాధనాల్లో ప్రచారం చేసుకుంది. కొంతవరకు సక్సెస్ అయ్యింది కూడా.

నటుడు కమలహాసన్ చిత్రం ఉత్తమవిలన్ చిత్రంలోను, అజిత్ హీరోగా నటిస్తున్న ఎన్నై అరిందాల్ చిత్రంలోను నటించే ఛాన్స్ కొట్టేసింది. అయితే ఉత్తమ విలన్ చిత్రంలో కమలహాసన్ సరసన పూజాకుమార్, ఆండ్రియాలు నటిస్తునారు. అదే విధంగా ఎన్నై అరిందాల్‌లో అజిత్‌కు జంటగా అనుష్క, త్రిషలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల్లోనూ పార్వతి మీనన్ మూడో హీరోయిన్ పాత్రకే పరిమితమైంది. అయితే కమలహాసన్ అజిత్ లాంటి ప్రముఖ హీరోల చిత్రాల్లో మూడో హీరోయిన్‌గా నటించే అవకాశం రావడం ఆనందమే నంటోంది పార్వతి మీనన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement