అజిత్‌తో ఇద్దరు రొమాన్స్? | Again Ajith to romance 2 heroines Samantha Shruti haasan | Sakshi
Sakshi News home page

అజిత్‌తో ఇద్దరు రొమాన్స్?

Published Fri, Nov 21 2014 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 PM

అజిత్‌తో ఇద్దరు రొమాన్స్?

అజిత్‌తో ఇద్దరు రొమాన్స్?

 ఇంతకుముందు ఒక హీరోకు ఒకే హీరోయిన్ ఉండేవారు. అయితే ప్రస్తుతం ఒక హీరో ఇద్దరు హీరోయిన్ల ట్రెండ్ నడుస్తోంది. కోలీవుడ్ విషయానికొస్తే కమలహాసన్ విశ్వరూపం చిత్రంలో ఆండ్రియా, పూజాకుమార్‌లు నటించగా ఆ తరువాత ఈ ఇద్దరు విశ్వరూపం-2, ఉత్తమ విలన్ చిత్రాల్లోనూ వారు కొనసాగుతూ వచ్చారు. ఇక రజనీకాంత్ తాజా చిత్రం లింగాలో అనుష్క, సోనాక్షి సిన్హాలతో డ్యూయెట్లు పాడేశారు. విజయ్ కూడా తాజా చిత్రం మారిషన్‌లో శ్రుతిహాసన్, హన్సికతో రొమాన్స్ చేస్తున్నారు.
 
 సూర్య నటిస్తున్న మాస్ చిత్రంలో నయనతార, ఎమిజాక్సన్‌లుగా హీరోయిన్లుగా చేస్తున్నారు. నటుడు అజిత్ కూడా తానేమీ తక్కువ కాదంటూ ప్రస్తుతం నటిస్తున్న ఎన్నై అరిందాళ్ చిత్రంలో ఏకంగా అనుష్క, త్రిష, పార్వతిమీనన్‌లతో యువళగీతాలు పాడేశారు. గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. అజిత్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. శివ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం మంచి మాస్ ఎంటర్‌టైనర్ కథా చిత్రం అట. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇంతకుముందు వీరం చిత్రం తెరకెక్కి విజయం సాధించిందన్నది గమనార్హం.  తాజా చిత్రంలో అజిత్‌తో రొమాన్స్‌కు శ్రుతిహాసన్, సమంత సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement