శివకార్తికేయన్‌తో సమంత | Sivakarthikeyan to romance Samantha in Rajini Murugan | Sakshi
Sakshi News home page

శివకార్తికేయన్‌తో సమంత

Published Sun, Jul 13 2014 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 10:12 AM

శివకార్తికేయన్‌తో సమంత

శివకార్తికేయన్‌తో సమంత

లక్ ఇచ్చే కిక్కే వేరు. ప్రస్తుతం అలాంటి కిక్‌లో ఉన్న హీరోయిన్లు నటి సమంత ఒకరైతే హీరోలలో యువ నటుడు శివకార్తికేయన్ మరొకరు. కోలీవుడ్‌లో ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ ఎవరంటే ఏ మాత్రం ఆలోచించకుండా వచ్చే సమాధానం సమంత అనే. అలాగే వరుస హిట్‌లతో హవా సాగిస్తున్న నటుడు శివకార్తికేయన్ అని చెప్పక తప్పదు. ఈయన నటించిన వరుత్త పడాద వాలాభర్ సంఘం, ఎదిర్ నీచ్చల్, మాన్‌కరాటే చిత్రాలు వరుసగా వందరోజులు ఆడిన చిత్రాల పట్టికలో నమోదవ్వడం విశేషం. ఈ రోజుల్లో ఒక చిత్రం వంద రోజులు ఆడడం అంటే ఆషామాషీ విషయం కాదు.
 
 అదే విధంగా శివకార్తికేయన్ హీరోయిన్ల విషయంలోను అదృష్టజాతకుడే. వర్ధమాన హీరోయిన్ల నుంచి ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ సరసన నటించే లక్కీచాన్స్‌లను కొట్టేస్తున్నారు. ఎదుర్‌నీచ్చిల్ చిత్రంలో ప్రియా ఆనంద్‌తోను, మాన్ కరాటే చిత్రంలో అందాల భామ హన్సికతోను నటించిన ఈ యువ నటుడు త్వరలో క్రేజీ బ్యూటీ సమంతతో రొమాన్స్ చేయనున్నారు.  స్టార్ హీరోల సరసన నటిస్తున్న సమంత శివకార్తికేయన్‌తో జతకట్ట నుండడం బ్యాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.
 
 ఈ లక్కీ జంట కలిసి నటించే చిత్రాన్ని తిరుపతి బ్రదర్స్ అధినేతలు లింగుస్వామి, సుభాష్ చంద్రబోస్ నిర్మించనున్నారు. వరుత్తపడాద వాలిబర్ సంఘం వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన పొన్‌రాం ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. దీనికి రజనీ మురుగన్ అనే టైటిల్ ఖరారు చేసినట్లు నిర్మాత సుభాష్ చంద్రబోస్ నిర్ధారించారు. మదురై నేపథ్యంలో సాగే విభిన్న కథా చిత్రమని చెప్పారు. డి.ఇమాన్ సంగీత బాణీలందించనున్న ఈ చిత్రాన్ని భారీ నిర్మాణ విలువలతో నిర్మించనున్నట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement