
వీరాభిమానం.. విగ్రహం
హీరోలకు అభిమానులుండటం కామన్. అభిమాన హీరో సినిమా ఫంక్షన్స్, సినిమా విడుదలైనప్పుడు వీరిదే హంగామా. వీరాభిమానులైతే ఈ హంగామాతో పాటు అభిమాన హీరో పేరిట సామాజిక కార్యక్రమాలు చేస్తుంటారు. అంతేకాదండోయ్... అభిమాన హీరోకు విగ్రహాలు కూడా పెట్టేస్తుంటారు. ఇప్పుడు తమిళ స్టార్ హీరో అజిత్ అభిమానులు ఆయన విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు.
తమిళంలో అజిత్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తెలిసిందే. అజిత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘వివేగమ్’ సినిమాలో నటిస్తున్నారు. కొన్ని రోజుల కిందట విడుదలైన ఆ సినిమా టీజర్ కొద్ది గంటల్లోనే రికార్డు వ్యూస్ దక్కించుకుంది. టీజర్‌లో అజిత్ నడిచి వస్తుంటారు. ఆ తరహాలోనే వాకింగ్ స్టైల్‌లో విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ‘వివేగమ్’ మూవీ రిలీజ్ టైమ్‌లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్టు చెన్నై కోడంబాక్కమ్ టాక్.