
శ్రీవారి సేవలో అజిత్
ప్రముఖ తమిళ నటుడు అజిత్ శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సుప్రభాత సమయంలో ఏడుకొండల వాడిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ సిబ్బంది ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయనను చూసేందుకు భక్తులు పోటీపడ్డారు.