కాజల్, కెరీర్లో ఫస్ట్ టైం..?
కెరీర్ ఎక్కువగా గ్లామర్ రోల్స్ మాత్రమే చేసిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ త్వరలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా చేసేందుకు అంగీకరించింది. ఇప్పటికే నయనతార, త్రిష, అనుష్క లాంటి హీరోయిన్స్ లేడీ ఓరియంటెడ్ సినిమాలతో దూసుకుపోతుంటే కాజల్ మాత్రం గ్లామర్ రోల్స్కే పరిమితమయ్యింది. ఇటీవల అవకాశాలు కూడా తగ్గటంతో మనసు మార్చుకున్న ఈ బ్యూటి, ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాకు ఓకె చెప్పింది.
జీవా, కాజల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన కవలై వేండమ్ సినిమాకు దర్శకత్వం వహించిన డీకే కాజల్ లీడ్ రోల్లో సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ మధ్య కాజల్కు కథ కూడా చెప్పిన దర్శకుడు డేట్స్ కోసం ఎదురుచూస్తున్నాడట. ప్రస్తుతం కోలీవుడ్లో అజిత్, విజయ్ లాంటి టాప్ హీరోల సరసన నటిస్తున్న కాజల్, త్వరలోనే డీకే దర్శకత్వంలో లేడీ ఓరియంటెడ్ సినిమాను ప్రారంభించనుంది.