కోలీవుడ్ పొంగల్ పోటీలో తాల అజిత్, తలపతి విజయ్ పోటీ పడుతున్నారు.బాక్సాఫీసు ముందర భారీ వార్ జరగబోతుంది.ఇప్పటికే సోషల్ మీడియాలో విజయ్ వారిసు ప్రమోషన్లు షూరు అయ్యాయి.రంజితమే పాటతో..రచ్చ మొదలయ్యింది.అయితే అజిత్ మాత్రం..ఒక అడుగు ముందుకు వేసి విజయ్‌ని డామినేట్ చేయబోతున్నాడు.కలెక్షన్ల దగ్గర తనదే పై చేయి అనిపించుకోవాలి అనుకుంటున్నాడు.ఇంతకీ అజిత్ వేస్తున్న స్కెచ్ ఏంటి?
కోలీవుడ్ పొంగల్ పోటీలో తలపతి విజయ్ వరిసుతో దూసుకుపోతున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్లతో అలరించటమే కాదు..ఫస్ట్ సింగిల్ రంజితమే సాంగ్ ను రిలీజ్ చేసి..సోషల్ మీడియాలో తన రేంజ్ ఎంటో చూపిస్తున్నాడు..ప్రమోషన్లలో ముందున్నాను అనిపించుకుంటున్నాడు. విజయ్‌తో వార్‌కి సై అంటున్నాడు అజిత్.
తాల అజిత్ ‘తునివు’ మూవీతో విజయ్ తో పోటీకి దిగుతున్నాడు.ఈ సీనియర్ హీరోకు కూడా మాస్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. దాంతో విజయ్ ,అజిత్ మధ్య పోటీ రంజుగా మారింది. బాక్సాఫీసు ఫైట్ మరో రేంజ్ కు చేరింది. విజయ్ వరిసుతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటే..అజిత్ తునివు పోస్టర్లతోనే సరిపెట్టుకున్నాడు.కాని బాక్సాఫీసు ను శాషించటానికి భారీ స్కెచ్ మాత్రం వేశాడు. కలెక్షన్ల దగ్గర..విజయ్ సినిమాను డామినేట్ చేయాలి అనుకుంటున్నాడు అజిత్.అందు కోసం థియేటర్లను బ్లాక్ చేసుకున్నాడు. తన సినిమా తునివును ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అయేలా ప్లాన్ చేశాడు. మొదటి రోజు కలెక్షన్లలో తనదే పై చేయి అనిపించుకోవాలి అనుకుంటున్నాడు. మరి ఈ ఇద్దరు హీరోలలో ఎవరిది పై చేయి సాధిస్తారన్నది సినిమాలు విడుదయ్యాక తెలుస్తుంది.
విజయ్‌ని డామినేట్ చేస్తున్న అజిత్!
Published Sat, Dec 3 2022 2:00 PM | Last Updated on Sat, Dec 3 2022 3:06 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment