
ajit Valimai motion poster: కోలీవుడ్ అగ్ర కథనాయకుడు అజిత్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అప్‌డేట్ రానే వచ్చేసింది. హెచ్.వినోద్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘వాలిమై’కు సంబంధించి అభిమానుల్లో అనందం నింపేలా ఓ అప్‌డేట్ వచ్చింది. కాగా, ఆదివారం ఈ చిత్రంలోని అజిత్ ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ విడుదలైంది. ఇందులో అజిత్ సీబీ సీఐడి అధికారిగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టాలీవుడ్ నటుడు కార్తికేయ విలన్‌గా నటిస్తున్నారు.
అజిత్‌కు జోడీగా హ్యుమా ఖురేషి నటిస్తుండగా, యువన్ శంకర్‌రాజా స్వరాలు సమకూరుస్తున్నారు. బేవ్యూ ప్రొజెక్ట్స్ పతాకంపై బోనీకపూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గతంలో ‘వాలిమై’ చిత్ర అప్‌డేట్స్ ఇవ్వడం లేదంటు అజిత్ అభిమానులు సోషల్‌మీడియాలో రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఒకానొక సందర్భంలో ఇది తారస్థాయికి చేరింది. ఏకంగా ఓ సారి క్రీడా మైదానాల్లో ప్లకార్డులు ప్రదర్శించడం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలో అభిమానుల తీరుపై ఆయన అసహనం కూడా వ్యక్తం చేశారు.
HD Posters of #ThalaAjith's #Valimai #ValimaiMotionPoster
— BARaju's Team (@baraju_SuperHit) July 11, 2021
▶️ https://t.co/NwxiG3ubjY#Valimai #ValimaiFirstlook#Ajithkumar @BoneyKapoor #HVinoth @BayViewProjOffl @SureshChandraa #NiravShah @thisisysr @humasqureshi @ActorKartikeya @RajAyyappamv pic.twitter.com/cY3VaELpdF